Jio 857 Prepaid Plan : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ప్లాన్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగా ఇటీవల ఓటీటీ లవర్స్ కోసం రూ.857 ధరతో ఓ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ రూ.857 జియో ప్లాన్ తీసుకున్న యూజర్లకు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. వీటితోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సబ్స్క్రిప్షన్లు పూర్తి ఉచితంగా లభిస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అయితే జియో యూజర్లకు నెట్ సమస్య ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం జియో తమ యూజర్లకు అపరిమిత 5జీ డేటాను పూర్తి ఉచితంగా అందిస్తోంది.
జియోభారత్ యూజర్ల కోసం
రిలయన్స్ జియో ఇటీవలే తమ జియోభారత్ ఫోన్ యూజర్ల కోసం ఓ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.234. వ్యాలిడిటీ 56 రోజులు. దీని ద్వారా యూజర్లకు ప్రతి 28 రోజులకు 300 ఎస్ఎంఎస్లు, రోజుకు 0.5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది. జియోసావన్, జియోసినిమా సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.
Rs 49 Jio Cricket Plan : రిలయన్స్ జియో (ఐపీఎల్) క్రికెట్ లవర్స్ కోసం ఓ సరికొత్త డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వాస్తవానికి ఇది ఒక యాడ్-ఆన్ డేటా ప్లాన్. దీని ద్వారా కేవలం రూ.49లకే మీరు 25 జీబీ 4జీ డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 24 గంటలు ఉంటుంది. ఈ 25 జీబీ వాడిన తరువాత యూజర్లు 64kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ను యాక్సెస్ చేయవచ్చు. యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ జియో క్రికెట్ ప్లాన్ అనేది కేవలం ఒక డేటా ప్లాన్. కనుక ఎలాంటి కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు. పైగా దీని వ్యాలిడిటీ 24 గంటలు మాత్రమే. దీనిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వీలుపడదు.
4కె ఐపీఎల్ మ్యాచ్‌లు
ప్రస్తుతం టాటా ఐపీఎల్ 2024 టోర్నీ జరుగుతోంది. అందుకే క్రికెట్ లవర్స్ కోసం జియో ఈ సరికొత్త డేటా ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీనితో స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాదు, హాట్‌స్పాట్‌తో కనెక్ట్ చేసుకుని ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీల్లోనూ క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. యూజర్లు ఈ డేటా ప్లాన్ ద్వారా 4కె రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.
వీడియో ఎడిటింగ్‌కు ఉపయోగపడే టాప్-6 ఫ్రీ ఏఐ టూల్స్ ఇవే! - Free AI Tools For Video Editing