ETV Bharat / business

ITR ఫైలింగ్​లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! లేదంటే ఇన్​కమ్​ ట్యాక్స్ నోటీసులు వస్తాయ్! - ITR Filing Mistakes

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 2:37 PM IST

ITR Filing Mistakes : పన్ను చెల్లిందుపుదారులు జూన్​ 31 లోపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాలి. తొందరపడి పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో సాధారణంగా చేసే తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ITR Filing Mistakes
ITR Filing Mistakes (ETV Bharat)

ITR Filing Mistakes : పన్ను చెల్లింపుదారులు ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్నులు దాఖలు చేసే సమయం జూన్ 31 వరకే ఉంది. ఆ తర్వాత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సరైనా అవగాహన లేకపోయినా లేదా నిపుణుల సాయంతో చాలా మంది జాగ్రత్తగానే ఐటీఆర్​ను సమర్పిస్తారు. కానీ కొన్ని సార్లు తొందపాటు వల్ల పొరపాట్లు చేసేస్తుంటారు. ఈ తప్పులను సరిదిద్దుకునేందు అవకాశం ఉంటుంది. రివైజ్డ్ రిటర్నుల దాఖలు చేసి సవరించుకోవచ్చు. కానీ, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి చేయాలి. అందుకే ముందే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

సరైన ఫారం ఎంచుకోవాలి
కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT)నోటిఫై చేసిన ఏడు రకాల ఐటీ ఫారాల్లో, మీకు ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. రూ.50లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్‌-1 ఎంచుకోవచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్‌-4 దాఖలు చేయొచ్చు. రూ.50లక్షలకు పైగా వేతనం ఉండి, ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్‌-2ను దాఖలు చేయాలి. ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్‌-3ని ఎంచుకోవచ్చు. అయితే షేర్లలో క్రయవిక్రయాలు చేసినప్పుడు మీరు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్‌-2 లేదా ఐటీఆర్‌ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.

బ్యాంకు ఖాతా ధ్రువీకరణ
పన్ను చెల్లింపుదారులంతా ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ముందుగానే తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ట్యాక్స్‌ పేయర్ల ఖాతా యాక్టివ్‌గానే ఉందా లేదా అనే విషయాన్ని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.

ఐటీఆర్‌ ఈ-వెరిఫై తప్పనిసరి
ఐటీఆర్‌ ఫైల్​ చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. అది కూడా ఐటీఆర్‌ అప్‌లోడ్‌ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేయాల్సి ఉంటుంది.

మినహాయింపులు
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్‌ 80సీ ముఖ్యం. ఈ సెక్షన్‌ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తే, రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం వంటివి సెక్షన్‌ 80సీ పరిధిలోకే వస్తాయి. అయితే ఈ సెక్షన్​లో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్‌ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్‌ఆర్‌ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా కోసం అన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులను రిటర్నుల్లో సరిగ్గా పేర్కొనాలి.

ఇతర ఆదాయాలు
చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌ ఫైల్​ చేసినప్పుడు చూపించరు. వడ్డీ, కమిషన్‌ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్​ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్‌ కట్‌ చేసి ఉంటారనే ఉద్దేశంతో చాలా మంది అనవసరం అని అనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో మీకు వచ్చే ప్రతీ ఆదాయ పేర్కొనాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

గడువు లోపే
ఐటీఆర్‌ దాఖలు గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆడిట్‌ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

టీడీఎస్‌ జమ
కొన్నిసార్లు ఆదాయపు పన్ను దగ్గర ఉన్న వివరాలకూ, మీ ఫారం-16లో ఉన్న వాటికి వ్యత్యాసం ఉండొచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ తేడా కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లను పూర్తిగా పరిశీలించుకోవాలి. ఏదైనా తేడా ఉంటే మీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలి. పొరపాట్లతో రిటర్నులు సమర్పిస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆదాయాలన్నీపేర్కొనాలి
ఐటీఆర్‌ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఆదాయాలనూ తప్పనిసరిగా పేర్కొనాల్సిందే. కొంతమంది కొన్ని ఆదాయాలను గురించి నివేదించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ దీన్ని గుర్తిస్తే నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. చాలామంది వ్యక్తులు తమ వేతనాన్ని మాత్రమే నమోదు చేస్తారు. బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీల నుంచి వచ్చిన ఆదాయం, పీపీఎఫ్‌ వడ్డీలను వదిలేస్తారు. మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలనూ రిటర్నులలో చూపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. మైనర్‌ పిల్లల పేరుతో పెట్టుబడులు ఉండి, వాటి ద్వారా ఆదాయం వస్తుంటే, ఆ మొత్తాన్నీ ఆదాయంలో భాగంగానే పరిగణిస్తారు.

డ్రైవింగ్​లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజర్! ఈ రోడ్ సేఫ్టీ టిప్స్ పాటిస్తే హ్యాపీ జర్నీ - Road Safety Tips

గౌతమ్ అదానీకి శాలరీ అంతేనా? కంపెనీ ఉద్యోగుల కన్నా తక్కువా! - Gautam Adani Salary 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.