ETV Bharat / business

వాళ్లందరూ ఫైనాన్స్ మినిస్టర్లే - పాపం ఒక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ఛాన్స్​ రాలే! ఎందుకో తెలుసా? - Union Budget Interesting Facts

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 11:37 AM IST

Interesting Facts About The Union Budget : కేంద్ర బడ్జెట్‌ను జులై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో తమ కోసం ఎలాంటి ప్రకటనలు, కేటాయింపులు ఉంటాయో అని అన్ని వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా తమకు ఆశాజనకంగా కేటాయింపులు ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర బడ్జెట్‌తో ముడిపడిన కొన్ని కీలక విశేషాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Indian Budget
UNION BUDGET (ETV Bharat)

Interesting Facts About The Union Budget : కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ జులై 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఇక 23వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12న బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌తో ముడిపడిన ఆసక్తికర, సమాచారదాయక విశేషాల గురించి మనం తెలుసుకుందాం.

  1. బడ్జెట్ - ‘బౌగెట్’ : 'బడ్జెట్' అనే పదం ‘బౌగెట్’ (bougette) అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. లెదర్ బ్రీఫ్‌కేస్ అని దీని అర్థం. అందుకే బడ్జెట్ ప్రకటన రోజున భారత ఆర్థిక మంత్రులంతా తమ బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్‌కేస్‌లో పార్లమెంటుకు తీసుకొచ్చే ఆనవాయితీని పాటించారు. భారతీయులు ఈ పద్ధతిని బ్రిటీష్ వారి నుంచి స్వీకరించారు.
  2. స్వాతంత్య్రం తర్వాత తొలి భారతీయ బడ్జెట్ : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను నాటి ఆర్థిక మంత్రి ఆర్‌‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అవలోకనం ఉంది. అయితే అందులో ఎటువంటి మార్పులు లేదా ప్రతిపాదనలను చేయలేదు. తొలి బడ్జెట్‌లో వార్షిక ఆదాయం రూ.171.15 కోట్లుగా, వార్షిక వ్యయం రూ.197.29 కోట్లుగా అంచనా వేశారు.
  3. స్వాతంత్య్రానికి పూర్వం తొలి భారతీయ బడ్జెట్ : స్వాతంత్య్రానికి పూర్వం తొలి భారతీయ బడ్జెట్‌ను 1860 ఏప్రిల్ 7న ఈస్టిండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన నాటి బ్రిటీష్ రాజదర్బారుకు సమర్పించారు.
  4. ఎక్కువ బడ్జెట్లు - ఆర్థికమంత్రులు : మన దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల జాబితాలో మొరార్జీ దేశాయ్ తొలిస్థానంలో ఉన్నారు. ఈయన రికార్డు స్థాయిలో 10సార్లు బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  5. కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ విలీనం : దాదాపు 92 సంవత్సరాల పాటు రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌లను విడివిడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే 2017లో కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు.
  6. కేంద్ర బడ్జెట్ కాన్సెప్ట్ రూపకర్త : స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనే కాన్సెప్ట్‌కు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ రూపకల్పన చేశారు. ఆయన భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త. భారత ప్రణాళికా సంఘంలో ప్రధాన సభ్యులుగా కూడా అప్పట్లో వ్యవహరించారు. భారతదేశ ఆధునిక గణాంకాల పితామహుడిగా పీసీ మహలనోబిస్‌ను పిలుస్తుంటారు.
  7. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని : కేంద్ర బడ్జెట్‌ను సాధారణంగా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతుంటారు. అయితే తొలిసారిగా 1958-1959 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1970 సంవత్సరంలో ఇందిరాగాంధీ, 1987 సంవత్సరంలో రాజీవ్ గాంధీ కేంద్ర బడ్జెట్‌లను సమర్పించారు.
  8. తొలిసారి అందరికీ బడ్జెట్ : 1955లో అప్పటి ఆర్థిక మంత్రి సీ.డీ.దేశ్‌ముఖ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ ప్రజలందరికీ బడ్జెట్ ప్రతులను అందుబాటులో ఉంచాలని ఆయన భావించారు. ఇందుకోసం బడ్జెట్‌ ప్రతులను ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆయన ముద్రింపజేశారు.
  9. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించని ఆర్థిక మంత్రి : ఇద్దరు ఆర్థిక మంత్రులు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు. వారు కేసీ నియోజీ, హెచ్‌ఎన్ బహుగుణ. ఎందుకంటే వారు రెండు బడ్జెట్ రోజుల మధ్య తక్కువ వ్యవధి పాటు ఆ పదవిలో కొనసాగారు. దీనివల్ల వారికి బడ్జెట్‌ను సమర్పించే అవకాశం దక్కలేదు. భారతదేశపు రెండో ఆర్థిక మంత్రి అయిన నియోగీ కేవలం 35 రోజులే ఆ పదవిలో కొనసాగారు.
  10. పేపర్‌లెస్ బడ్జెట్ : మన దేశంలో తొలిసారిగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను 2021 ఫిబ్రవరి 1న ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దేశంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు.
  11. బడ్జెట్ - భాషలు : కేంద్ర బడ్జెట్‌ పత్రాలను తొలిసారిగా 1955-56లో ఇంగ్లీష్, హిందీలో ముద్రించారు. అంతకుముందు వీటిని కేవలం ఆంగ్లంలో ముద్రించేవారు.
  12. బడ్జెట్‌ సమర్పించిన మొదటి మహిళ : 1970-71 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఇందిరా గాంధీ సమర్పించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీయే.
  13. బడ్జెట్‌ సమర్పించిన రెండో మహిళ : కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన రెండో మహిళ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె తొలిసారిగా 2019 జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆమె భారతదేశపు మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి.
  14. బడ్జెట్ ప్రవేశపెట్టే వేళల మార్పు : కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయాన్ని 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మార్చారు. అంతకు ముందు వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి యశ్వంత్ సిన్హా శ్రీకారం చుట్టారు.
  15. గిఫ్ట్ ట్యాక్స్​ : మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1958-1959 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పన్ను ఎగవేతను మరింత కష్టతరం చేసేందుకు గిఫ్ట్ ట్యాక్స్‌‌ను ఆయన ప్రవేశపెట్టారు.
  16. వస్తువులు, సేవల పన్ను : 2006 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టారు.
  17. బ్రీఫ్‌కేస్‌కు బదులుగా బాహీ ఖాతా : సాధారణంగానైతే కేంద్ర బడ్జెట్‌ ప్రతులను ఆర్థికమంత్రులు బ్రీఫ్ కేస్‌లో పార్లమెంటుకు తీసుకొచ్చేవారు. అయితే ఈ ట్రెండ్‌ను 2019 సంవత్సరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చేశారు. తాను సాంప్రదాయ 'బాహీ ఖాతా'లో బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు తెచ్చారు. 'బాహీ ఖాతా'పై జాతీయ చిహ్నం ముద్రించారు.
  18. హల్వా వేడుక : సంప్రదాయాల ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ (నార్త్ బ్లాక్)కు చెందిన నేలమాళిగలో బడ్జెట్ ప్రతులను రహస్యంగా ముద్రిస్తారు. ఈ నేల మాళిగలోనే స్వయంగా ఆర్థిక మంత్రి 'హల్వా' వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించడానికి 9-10 రోజుల ముందు ఈ వేడుక జరుగుతుంది. బడ్జెట్ తయారీలో సహకరించిన సభ్యుల కృషిని గుర్తిస్తూ ఈ వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది, బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్నవారు ఈ నేలమాళిగలోనే ఉంటారు. ఈ వ్యవధిలో వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. బడ్జెట్ లీకేజీలు లేకుండా చూడాలనే లక్ష్యంతో హల్వా వేడుకను నిర్వహిస్తుంటారు.
  19. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం : కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. ఆమె 2020 ఫిబ్రవరి 1న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇంకా రెండు పేజీలు మిగలడంతో, వాటిలోని వివరాలను సంక్షిప్తంగా చదివి వినిపించారు. ఈ విషయంలో రెండో స్థానంలో కూడా నిర్మలే ఉన్నారు. అంతకుముందు ఆమె 2019 జూలైలో రెండు గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకు నాలుగు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల, ప్రతిసారీ సుదీర్ఘంగానే ప్రసంగించారు.
  20. అత్యధిక పదాలతో బడ్జెట్ ప్రసంగం : అత్యధిక పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన జాబితాలో నంబర్ 1 స్థానంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ చాలా తక్కువగా మాట్లాడుతారు. కానీ ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో, 1991లో అత్యధికంగా 18,650 పదాలతో బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ జాబితాలో రెండో ప్లేసులో మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. ఈయన గంటా 49 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో 18,604 పదాలను వాారు.
  21. అత్యల్ప పదాలతో బడ్జెట్ ప్రసంగం : అత్యల్ప పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్. ఈయన 1977లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆయన బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలనే వాడారు.
  22. బడ్జెట్ ముద్రణ స్థలం : కేంద్ర బడ్జెట్‌ను 1950 సంవత్సరం వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. అయితే ఆ ఏడాది అక్కడ బడ్జెట్ ప్రతులు లీకయ్యాయి. దీంతో వాటి ప్రింటింగ్ ప్రక్రియను దిల్లీలోని మింటో రోడ్‌లో ఉన్న ప్రెస్‌కి తరలించారు. 1980 సంవత్సరంలో నార్త్ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడే కేంద్ర బడ్జెట్‌ను ముద్రిస్తున్నారు.
  23. మధ్యంతర బడ్జెట్ - కేంద్ర బడ్జెట్ : పాలనా కాలం త్వరలో ముగిస్తుందనేటప్పడు లేదా ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌‌ను మధ్యంతర బడ్జెట్ అంటారు. మధ్యంతర బడ్జెట్‌ను 'ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్' అని కూడా పిలుస్తారు. పరిమిత కాలానికి నిధులను ఖర్చు చేసేందుకు పార్లమెంటు అనుమతిని కోరడమే మధ్యంతర బడ్జెట్‌ లక్ష్యం. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం నూతన బడ్జెట్‌ను ఖరారు చేస్తుంది. అప్పటికే ఉన్న మధ్యంతర బడ్జెట్ అంచనాలను కంటిన్యూ చేయాలా? కొత్త బడ్జెట్‌ అంచనాలను పార్లమెంటుకు సమర్పించాలా? అనే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.

బడ్జెట్​ 2024లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా? పాత Vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెటర్​? - Decoding Income Tax Slabs 2024

బ్యాంక్​ నుంచి భారీ మొత్తం విత్​డ్రా చేయాలా? ఇలా చేస్తే నో ట్యాక్స్​! - Bank Account Tax Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.