ETV Bharat / business

బడ్జెట్‌పై కోటి ఆశలు! ఇన్సూరెన్స్ పాలసీలపై GST తగ్గుతుందా? - ఆరోగ్య బీమా జీఎస్టీ ఎంత

Insurance Policy GST Rate : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1వ తేదీన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్‌టీని తగ్గించాలని అటు పాలసీదారులు, ఇటు పరిశ్రమ వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందుకు కారమేమింటంటే?

Insurance Policy GST Rate
Insurance Policy GST Rate
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 9:00 PM IST

Insurance Policy GST Rate : ప్రస్తుత రోజుల్లో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు అందరికీ ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయాయి. అయితే కొవిడ్‌ మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రీమియం ఏటా 10-15 శాతం పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఆ భారాన్ని మోయలేక పాలసీలను రెన్యువల్ చేసుకోవడం లేదట. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్‌టీని తగ్గించాలని అటు పాలసీదారులు, ఇటు పరిశ్రమ వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ప్రస్తుతం భారతీయ బీమా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. జీ20 దేశాలతో పోలిస్తే మన దేశంలో బీమా రంగం ఏటా సగటున 7.1 శాతం వృద్ధి సాధించే అవకాశాలున్నట్లు స్విస్‌ రి ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. మరోవైపు దేశీయ బీమా పరిశ్రమ సైతం ఇలాంటి అంచనాలతోనే ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే మన బీమా రంగం 2.4 శాతం అధికంగా వృద్ధి సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నాయి.

బీమా రంగం వృద్ధి చెందుతున్న దశలోనే ఉన్నా, విస్తృతి మాత్రం ఇంకా చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సాధారణ బీమా విస్తృతి 1 శాతం మేరకు ఉండగా, జీవిత బీమా పరిధిలో 3 శాతం మందే ఉన్నారు. మొత్తంగా చూసినా బీమా రంగం విస్తృతి నాలుగు శాతం వరకే ఉంది.

అందరికీ బీమా- ఇదే లక్ష్యం!
ఐఆర్‌డీఏఐ 2047 నాటికి అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా విధించుకుంది. ఇది సాధ్యం కావాలంటే బీమా పాలసీలను ప్రజలకు మరింత దగ్గర చేయాలి. వీటిని అందుబాటు ధరల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా బీమా ప్రీమియంపై ఉన్న 18 శాతం జీఎస్‌టీని తగ్గించి, 5 శాతానికి చేయాలనే డిమాండు ఉంది. మధ్యంతర బడ్జెట్‌ వేళ దీన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని బీమా రంగం కోరుకుంటోంది.

ఆదరణ పెరగాలంటే ఇలా చేయాలి!
బీమా పాలసీలకు ఆదరణ పెరగాలంటే జీవిత బీమా పాలసీ ప్రీమియానికి ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బీమా రంగం నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో రూ.50వేల వరకూ మదుపు చేసి, సెక్షన్‌ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్నుల విధానంలోనూ ప్రామాణిక తగ్గింపుతోపాటు, ఆరోగ్య, టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికి ప్రత్యేక మినహాయింపు కల్పిస్తే, పాలసీదారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌లో బీమా రంగాన్ని ఎలా కరుణిస్తారన్నది వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.