ETV Bharat / business

మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారా? మరి CC, EC, 3E, EA క్లాస్​ల గురించి తెలుసా? - Indian Train Classes - INDIAN TRAIN CLASSES

Travel Classes In Indian Trains : మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారా? అయితే మీకు స్లీపర్​, 3A, 2A క్లాస్​లు గురించి తెలిసే ఉంటుంది. మరి మీకు CC, EC, 3E, EA, విస్టాడోమ్‌ క్లాస్​ల గురించి తెలుసా?

Ultimate Guide to Indian Train Classes and Types
Classes Of Travel On Indian Railways (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 12:38 PM IST

Travel Classes In Indian Trains : రైలు ప్రయాణం చేసేవారు, వాటిలోని తరగతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా రైళ్లలో ప్రయాణించే వారికి ఏసీ, నాన్‌ ఏసీ క్లాసుల (ట్రావెల్ క్లాసుల) గురించి తెలిసే ఉంటుంది. ఏసీలో కూడా మళ్లీ వివిధ తరగతులు ఉంటాయి. ట్రైన్​లో స్లీపర్​ (SL), థర్డ్ ఏసీ (3A), సెకండ్ క్లాస్​ ఏసీ (2A), ఫస్ట్ క్లాస్​ ఏసీ (1A) ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్రైన్​ టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు CC, EC, 3E, EA లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ కోడ్‌లు ఏ తరగతుల(ట్రావెల్ క్లాస్​)ను సూచిస్తాయి? మొత్తంగా ట్రైన్​లో ఎన్ని రకాల తరగతులు ఉంటాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఫస్ట్‌ ఏసీ (1A) : ఇండియన్‌ రైల్వేస్‌లో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్‌ను 1Aగా పిలుస్తారు ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్‌మెంట్లు మాత్రమే ఉంటాయి. వీటిలో సైడ్‌ అప్పర్‌, సైడ్‌ లోయర్‌ బెర్తులు ఉండవు. 2 బెర్తులు ఉండే కంపార్ట్‌మెంట్‌ను 'కూప్‌' అని, 4 బెర్తులు ఉంటే, దానిని 'క్యాబిన్‌' అని అంటారు. ప్రయాణికులు తమ కంపార్ట్‌మెంట్‌కు లాక్‌ వేసుకోవచ్చు. ఒక్కో బోగీలో మొత్తంగా 18-24 బెర్తులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ఫస్ట్​ క్లాస్​ ఏసీ టికెట్‌ ఖరీదు ఇంచుమించు విమానం టికెట్​ ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2, HA1, HA2, HB1, HB2 లాంటి నంబర్లతో సూచిస్తారు.
  • సెకండ్‌ ఏసీ (2A) : సెకండ్‌ ఏసీని 'టూ-టైర్‌ ఏసీ' అని కూడా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లలో 45- 54 సీట్లు వరకు ఉంటాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 6 సీట్లు ఉంటాయి. దీనిలో మిడిల్‌ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్‌లను A అక్షరంతో సూచిస్తారు. కోచ్‌ పొజిషన్‌ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు.
  • థర్డ్‌ ఏసీ (3A) : భారతీయ రైల్వేలో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్‌ ఇది. స్లీపర్‌ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా ఈ థర్డ్ ఏసీని ఎంచుకుంటారు. ఒక్కో కోచ్‌లో మొత్తం 64-72 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను B అనే అక్షరంతో సూచిస్తారు.
  • థర్డ్‌ ఎకానమీ (3E) : ఇటీవలి కాలంలో కొన్ని రైళ్లలో 3E తరగతి కనిపిస్తోంది. థర్డ్‌ ఏసీ కంటే దీని టికెట్‌ ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఈ తరహా కోచ్‌లలో 72-81 బెర్తులు ఉంటాయి. థర్డ్‌ ఏసీతో పోల్చినప్పుడు, వీటిలో సైడ్‌ మిడిల్‌ బెర్తు అదనంగా ఉంటుంది. గరీబ్‌రథ్‌ లాంటి రైళ్లలో ఈ తరహా కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లను Mతో సూచిస్తారు.
  • స్లీపర్‌ క్లాస్ (SL) : సాధారణ ప్రజలు ఎక్కువగా స్లీపర్‌ కోచ్‌ల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు ఈ స్లీపర్ క్లాస్​ను ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72-81 బెర్తులు ఉంటాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో మొత్తం 8 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను S అనే అక్షరంతో సూచిస్తారు. కొన్నిసార్లు రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్‌ ఇస్తుంటారు.
  • ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ (EC) : ఇది విమానాల్లో ఉండే బిజినెస్‌ క్లాస్‌ను పోలి ఉంటుంది. దీనిలో ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది. కానీ స్లీపర్‌ బెర్తులు ఉండవు. వందేభారత్‌ రైళ్లలో ఈ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కోచ్‌లను E అనే అక్షరంతో సూచిస్తారు.
  • ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి క్లాస్‌ (EA) : శతాబ్ది లాంటి రైళ్లలో 'ఎగ్జిక్యూటివ్‌ అనుభూతి' క్లాస్‌లు ఉంటాయి. ఈ కోచ్​లో ఏసీతో కూడిన 56 ఛైర్లు ఉంటాయి. సినిమాలు చూడడానికి, సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఇందులో ఎల్‌సీడీ స్క్రీన్లు ఉంటాయి. హెడ్‌ఫోన్లు కూడా ఇస్తారు. ఈ కోచ్​కు ఆటోమేటిక్‌ డోర్స్‌ ఉంటాయి. ఈ కోచ్‌లను K అనే అక్షరంతో సూచిస్తారు.
  • ఏసీ ఛైర్‌ కార్‌ (CC) : ఒకవైపు 3 వరుసలు, మరో వైపు 2 వరుసలతో కూడిన ఛైర్లు ఉంటాయి. పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం వందే భారత్‌ ట్రైన్లలో ఉన్న కోచ్‌లు ఇవే. ఈ కోచ్‌లను C అనే అక్షరంతో సూచిస్తారు.
  • విస్టాడోమ్‌ (EV) : పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్‌ కోచ్​లు ఉంటాయి. ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ఈ కోచ్‌లలో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది. ఇందులోని నాన్‌ ఏసీ కోచ్‌లను DV అని, ఏసీ కోచ్‌లను EV అని పిలుస్తారు.
  • సెకండ్‌ సిట్టింగ్‌ (2S) : కొన్ని ట్రైన్లలో సెకండ్‌ సిట్టింగ్‌ (2S) క్లాసులు కూడా ఉంటాయి. అయితే వీటిల్లో కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.
  • అన్​రిజర్వ్​డ్​ కోచ్​ (UR) : రైళ్లలో అన్​రిజర్వ్​డు కోచ్‌లు (UR) కూడా ఉంటాయి. వీటినే 'సెకండ్‌ క్లాస్‌' అని కూడా అంటారు. అయితే వీటికి ముందుస్తు రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదు.

ప్రీమియం ఎకానమీ సీట్లతో Air India కొత్త విమానం - త్వరలోనే A320neo సర్వీస్ ప్రారంభం!

మీ పేరున బోలెడు సిమ్ కార్డులు ఉన్నాయా? రూ.2 లక్షలు పెనాల్టీ, జైలు శిక్ష ఖాయం! - SIM Card Limit Per Person In India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.