ETV Bharat / business

దేశంలో 1.4లక్షల స్టార్టప్స్ - నంబర్ 1 స్థానంలో మహారాష్ట్ర - టాప్ 5 లిస్టు ఇదే! - Registered Startups In India - REGISTERED STARTUPS IN INDIA

Registered Startups In India : దేశంలోనే అత్యధికంగా స్టార్టప్స్ ఉన్న రాష్ట్రాలు ఏవో తెలుసా? దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ప్రస్తుతం మన దేశంలో 1.4 లక్షలకుపైగా స్టార్టప్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు మీ కోసం.

Registered Startups In India
INDIAN STARTUPS (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 2:06 PM IST

Registered Startups In India : ప్రస్తుతం మన దేశంలో 1.4 లక్షలకుపైగా స్టార్టప్స్ ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ఇవన్నీ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నుంచి గుర్తింపు పొందిన నమోదిత సంస్థలని ఆయన తెలిపారు. ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో మహారాష్ట్ర ఉందని, అక్కడ అత్యధికంగా 25,044 నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. రెండో స్థానంలో కర్ణాటక (15,019 స్టార్టప్స్), మూడో స్థానంలో దిల్లీ (14,734 స్టార్టప్స్), నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ (13,299 స్టార్టప్స్), ఐదో స్థానంలో గుజరాత్ (11,436 స్టార్టప్స్) ఉన్నాయి. ఈ మేరకు వివరాలతో రాజ్యసభకు జితిన్ ప్రసాద రాతపూర్వక సమాచారాన్ని అందించారు.

స్వదేశీ మూలధనమే లభించేలా!
‘‘స్టార్టప్‌లకు ప్రారంభ దశ, విత్తన దశ, వృద్ధి దశలో ప్రభుత్వం మూలధనాన్ని అందిస్తోంది. వాటికి దేశీయ మూలధనం లభించేలా చేయడం, విదేశీ మూలధనంపై అవి ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్వదేశీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మద్దతుతో స్టార్టప్స్ వికసించాలనేది మా ప్రణాళిక’’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. 2016 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ఎన్నో అంకుర సంస్థలకు దన్నుగా నిలిచిందన్నారు. ఇన్నోవేషన్ చేసే విషయంలో, పెట్టుబడులను సమీకరించే విషయంలో స్టార్టప్స్‌కు అండగా నిలబడిందని తెలిపారు. 19 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తూ స్టార్టప్‌ల వికాసానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోందని జితిన్ అన్నారు. ఈ క్రమంలోనే స్టార్టప్‌ల కోసం రాయితీల కల్పన, ప్రోత్సాహకాల పంపిణీ, పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమ వర్గాల సహకారం లభించేలా ఏర్పాట్లు చేయడం వంటివన్నీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

రూ.10వేల కోట్ల కార్పస్
‘‘స్టార్టప్ ఇండియా: ది వే ఎహెడ్ అనే మరో స్కీంను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. స్టార్టప్‌ల వ్యాపార సామర్థ్యాలను పెంచడమే దీని ప్రధాన టార్గెట్’’ అని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభకు తెలిపారు. డిజిటల్ ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా స్టార్టప్‌లను సమాయత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల కార్పస్‌తో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (FFS) పేరుతో ఒక స్కీమ్‌ను ప్రకటించిందన్నారు. ఈ స్కీంకు పర్యవేక్షణ ఏజెన్సీగా DPIIT వ్యవహరిస్తుండగా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అనేది ఆపరేటింగ్ ఏజెన్సీగా ఉందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ స్కీం కోసం అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ల ద్వారా మొత్తం రూ.10,000 కోట్ల కార్పస్ ఫండ్‌ను స్టార్టప్‌లకు అందిస్తామని వెల్లడించారు.

'ITR ఫైలింగ్ గడువు పొడిగించలేదు - జులై 31లోగా రిటర్నులు సమర్పించాల్సిందే' - ఐటీ డిపార్ట్​మెంట్​ - ITR Filing Last Date 2024

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.