ETV Bharat / business

హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Home Loan Tips - HOME LOAN TIPS

Things To Know Before Taking A Home Loan : చాలా మంది వ్యక్తులు హోమ్‌ లోన్‌ ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలా గృహ రుణం తీసుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Things to consider while taking a home loan
Key Facts and Information About Home Loans (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 3:42 PM IST

Things To Know Before Taking A Home Loan : సొంతింటి కల అందరికీ ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునేందుకు చాలా మంది ఎంతో శ్రమిస్తుంటారు. పొదుపు చేసినా, ఖర్చులు తగ్గించుకున్నా, లోన్ తీసుకున్నా అంతా దాని కోసమే. ఇంటిని కొనేందుకు మనం బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. అయితే అది అంత ఈజీ ప్రక్రియ కాదు. బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లను సమర్పించడం ఎంత ముఖ్యమో, మన క్రెడిట్ స్కోరు బాగుండటమూ అంతే ముఖ్యం. వీటికంటే ముఖ్యంగా సరైన ఆఫర్లు ఇచ్చే బ్యాంకును మనం ఎంపిక చేసుకోవాలి. అయితే ఆ బ్యాంకు ఇచ్చే హోం లోన్ ఆఫరుకు ఓకే చెప్పేముందు కొన్ని అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్‌ స్కోరు
క్రెడిట్‌ స్కోరు చూడనిదే బ్యాంకులు హోం లోన్ ఇవ్వవు. క్రెడిట్‌ స్కోర్‌ అనేది మీరు లోన్‌ను ఎంత బాగా తిరిగి చెల్లించగలరో చెప్పే రేటింగ్‌. మీ మునుపటి అప్పులు, క్రెడిట్‌ కార్డు చెల్లింపుల్లో మీరు ఎంత బాగా ఉన్నారో ఇది చూపిస్తుంది. క్రెడిట్ స్కోరు బాగుంటే హోం లోన్ పొందేందుకు లైన్ క్లియర్ అయినట్టే. తక్కువ వడ్డీ రేటుతో అధిక ఇంటి రుణ అర్హత కావాలంటే సిబిల్‌ స్కోరు 750 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

డాక్యుమెంటేషన్‌
హోం లోన్ కోసం మనం అప్లై చేశాక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని డాక్యుమెంట్స్‌ అడుగుతాయి. వీటిని కేవైసీ పత్రాలు, ఆదాయ పత్రాలు, ఆస్తి పత్రాలు అనే కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. వీటన్నింటి కంటే ముందు, బ్యాంకువాళ్లు దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోరును చెక్ చేస్తారు. ఆ తర్వాతే కేవైసీ పత్రాలు (పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ) అడుగుతారు. వీటిని మీ గుర్తింపు, చిరునామా రుజువులుగా బ్యాంకు పరిగణిస్తుంది. మీ ఆదాయ పత్రాలను అడుగుతుంది. 3 నెలల సాలరీ స్లిప్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, గత మూడు సంవత్సరాల ఆదాయ అసెస్‌మెంట్‌ మొదలైనవాటిని బ్యాంకులు అడుగుతాయి.

ప్రాసెసింగ్‌ ఫీజు
మన హోం లోన్ అప్లికేషన్‌ను ఆమోదించిన తర్వాత బ్యాంకుకు చెల్లించే ఛార్జీని ప్రాసెసింగ్‌ ఫీజు అంటారు. సాధారణంగానైతే పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు హోం లోన్ మొత్తంలో 0.50 నుంచి 1 శాతం వరకు లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు లోన్ అమౌంటుతో సంబంధం లేకుండా నిర్దిష్ట మొత్తంలో ప్రాసెసింగ్‌ ఫీజును తీసుకుంటాయి. హోం లోన్ చాలా పెద్ద మొత్తం. అందుకే ప్రాసెసింగ్ ఫీజు పర్సంటేజీలో కొంచెం తగ్గింపు లభించినా మనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈ ఫీజు తక్కువగా తీసుకునే బ్యాంకు ఆఫరుకు ప్రయారిటీ ఇవ్వాలి. లోన్ డాక్యుమెంట్స్‌పై సంతకం చేసే ముందు బ్యాంకుకు సంబంధించిన రూల్స్‌ను చదవాలి. వివిధ ఛార్జీలు, ఫీజులు, పెనాల్టీల గురించి తెలుసుకోవాలి.

డౌన్‌ పేమెంట్‌
మనం ఎంతైతే హోం లోన్ తీసుకుంటామో దానిలో దాదాపు 10 నుంచి 15 శాతం మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాలి. మిగిలిన హోం లోన్ అమౌంటును ఈఎంఐలుగా మారుస్తారు. ఈఎంఐ భారం తక్కువ ఉండాలని భావిస్తే, డౌన్‌ పేమెంట్‌ అనేది సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి. లోన్ అమౌంట్ ఎంత తగ్గితే, మనం చెల్లించే వడ్డీ అంతగా తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు దరఖాస్తుదారుడి అర్హత ఆధారంగా ఆస్తి విలువలో 100% రుణ మొత్తాన్ని కూడా అందిస్తుంటాయి.

రుణ కాలవ్యవధి
హోం లోన్‌ తిరిగి చెల్లించే కాలపరిమితిని మనమే నిర్ణయించుకోవాలి. దరఖాస్తుదారుడి అర్హతను బట్టి 30 ఏళ్ల వరకు రుణ కాలపరిమితిని బ్యాంకులు అందిస్తాయి. సాధారణంగానైతే సాధ్యమైనంత త్వరగా లోన్ కట్టేందుకు ఇష్టపడే వారికి బ్యాంకులు ప్రయారిటీ ఇస్తుంటాయి. ఈఎంఐలు ఎన్ని పెరిగితే, అంతమేర హోం లోన్ తీసుకునే వారిపై వడ్డీభారం పెరుగుతుంది. తక్కువ రీపేమెంట్‌ వ్యవధిని ఎంచుకుంటే బెటర్. ఒకవేళ అంతగా ఆర్థిక వనరులు లేకుంటే, దీర్ఘకాలిక హోం లోన్ రీపేమెంట్ ప్లాన్‌ను తీసుకోవచ్చు.

ఈఎంఐ
ప్రతినెలా హోం లోన్ ఈఎంఐ ఎంతమేర ఉండాలి? అనేది మనం ఆచితూచి డిసైడ్ చేసుకోవాలి. మన ఆదాయ వనరులు, పొదుపు నిధుల సమాచారం ఆధారంగా దీనిపై నిర్ణయానికి రావాలి. ఈఎంఐకి సరిపడా ఆదాయ వనరులు లేదా నిధులు ప్రతినెలా అందుబాటులో ఉండేలా ప్లానింగ్ చేసుకోవాలి. మీ హోం లోన్ ఈఎంఐ అనేది మీ మొత్తం ఆదాయంలో 45 శాతానికి మించకుండా చూసుకోండి. హోమ్‌ లోన్‌ ఈఎంఐ కాలిక్యులేటర్‌ ద్వారా దీనికి సంబంధించిన లెక్కలను మనం చేయొచ్చు. ఒకవేళ మీరు లోన్ తీసుకొని ప్రాపర్టీని నిర్మిస్తున్నట్లయితే, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం దశలవారీగా లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు ''ప్రీ-ఈఎంఐ వడ్డీ'' అని పిలిచే వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. ఒకవేళ నిధుల లభ్యత ఉంటే మీరు అసలును కూడా అప్పటి నుంచే పే చేయొచ్చు.

వడ్డీ రేటు
హోం లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటు చాలా ముఖ్యమైంది. హోం లోన్ కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయనే వివరాలను తొలుత మనం సేకరించాలి. వాటిని పోల్చి చూసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈక్రమంలో వడ్డీరేటు తక్కువగా విధించే బ్యాంకులకు ప్రయారిటీ ఇవ్వాలి. వడ్డీరేట్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి: ఫిక్స్‌డ్‌ (స్థిర) వడ్డీరేట్లు, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు. స్థిర వడ్డీ రేట్లపై మనం హోం లోన్ తీసుకుంటే రుణ కాలవ్యవధిపై ఈఎంఐలు మారవు. ఒకవేళ మనం ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై హోం లోన్ తీసుకుంటే, రుణంపై విధించే వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతుంటాయి. స్థిర వడ్డీరేటుతో కూడిన లోన్ ఆఫర్లలో నెలవారీ ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు అనేది రెపొరేటును బట్టి మారుతుంటుంది.

ముందస్తు చెల్లింపు
కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వ్యవధి తర్వాత హోం లోన్ ప్రీ-పేమెంట్‌, ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలను వసూలు చేయవు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థ కూడా ముందస్తు చెల్లింపు పెనాల్టీలను వసూలు చేయకూడదు. లోన్ తీసుకున్న తర్వాత మీకు మిగులు నగదు ఉన్నప్పుడు కొంత లోన్‌ మొత్తాన్ని ముందే కట్టేయొచ్చు. ఇలా పే చేసినందుకు ఎలాంటి ఛార్జీలనూ విధించరు. దీనివల్ల వడ్డీభారం తగ్గుతుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో హోం లోన్‌ను తీసుకుంటే బ్యాంకు ఎలాంటి పెనాల్టీని కూడా వసూలు చేయదు.

పన్ను ప్రయోజనాలు
హోం లోన్ తీసుకునేవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 కింద రూ.2 లక్షల వరకు పన్ను రాయితీని క్లెయిం చేసుకోవచ్చు. ఈ రాయితీ అనేది లోన్‌‌పై బ్యాంకు విధించే వడ్డీకి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీ పొందొచ్చు.

గృహ బీమా
హోం లోన్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఈ రుణం తీసుకున్న వారికి అందించే బీమా ప్లాన్‌. ఈ పాలసీ కొనుగోలు చేసిన వ్యక్తికి ఏదైనా జరిగితే, బకాయి ఉన్న రుణ మొత్తాన్ని బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల బకాయి భారం పాలసీదారునికి కుటుంబసభ్యులపై పడకుండా ఉంటుంది.

లోన్ డీఫాల్ట్‌
హోం లోన్ తీసుకున్నాక కట్టకపోతే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఈఎంఐలను తరచూ చెల్లించలేకపోతే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. బకాయిలను రికవరీ చేయడానికి మీ ఆస్తిని విక్రయిస్తుంది. మీరు నగదు కొరతతో ఇబ్బంది పడుతుంటే బ్యాంకుతో మాట్లాడి, రుణ నిబంధనలపై చర్చించాలి. మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటే, రీపేమెంట్ విషయంలో బ్యాంకు మీకు కొంత వెసులుబాటును కల్పించే అవకాశం ఉంటుంది.

అలర్ట్​ - ఆధార్ కార్డ్ ఫ్రీ అప్​డేట్​కు మరో 2 రోజులే ఛాన్స్​! - Aadhaar Card Free Update Deadline

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.