Hyundai Creta N Line India Launch Date : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ తమ లేటెస్ట్ క్రెటా ఎన్ లైన్ కారును మార్చి 11న లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఎస్యూవీ కారులో పలు కాస్మొటిక్, మెకానికల్ అప్డేట్స్ చేసినట్లు పేర్కొంది. త్వరలోనే కంపెనీ అధికారిక వెబ్సైట్లు, డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ ఓపెన్ చేస్తామని కూడా తెలిపింది. ప్రస్తుతానికి మార్కెట్లో క్రెటా ఎన్ లైన్ కారుకు పోటీ ఇచ్చే కార్లు ఏవీ లేకపోవడం విశేషం.
కాస్మొటిక్ అప్డేట్స్ : హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కార్ బంపర్లను మార్చారు. రెగ్యులర్ క్రెటాలో 17 అంగుళాల వీల్స్ ఉంటే, ఈ అప్డేటెడ్ క్రెటాలో 18 అంగుళాల చక్రాలను అమర్చారు. అంతేకాదు మాట్ గ్రే, బ్లూ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలోనూ దీనిని తీసుకువస్తున్నారు.
ఇంటీరియర్ డిజైన్ : హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు లోపల ఇప్పటి వరకు డ్యూయల్-టోన్ కలర్స్ ఉండేవి. కానీ అప్డేటెడ్ వెర్షన్లో ఇంటీరియర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎన్ లైన్ బ్యాడ్జింగ్, స్పోర్టీ ఆప్పీల్‌ను పెంచడానికి సీట్లపై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ చేశారు. గేర్ లివర్‌ను కూడా ఏర్పాటు చేశారు. బహుశా డ్యాష్-కామ్ కూడా ఉండే అవకాశం ఉంది.
మెకానికల్ అప్డేట్స్ : ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారులో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచడానికి అనేక మెకానికల్ అప్డేట్స్ చేశారు. అప్డేటెడ్ స్టీరింగ్, స్పోర్టియర్ ఎగ్జాస్ట్ సహా ట్యూన్డ్ సస్పెన్షన్ దీనిలో ఏర్పాటు చేశారు. ఈ కారులో 1.5 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 158 bhp పవర్, 253 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంది. అయితే 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
Hyundai Creta N Line Price : రెగ్యులర్ హ్యుందాయ్ క్రెటా కారు కంటే ఈ అప్డేటెడ్ వెర్షన్ ధర రూ.50,000 నుంచి రూ.60,000 ఎక్కువ ఉండవచ్చు.
Kia Seltos Recall : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా తమ సెల్టోస్ కార్లను రీకాల్ చేసింది. ముఖ్యంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య తయారు చేసిన 4358 కార్లను రీకాల్ చేసింది.
కియా కంపెనీ రూపొందించిన ఈ సెల్టోస్ కార్లలో 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ విత్ సీవీటీ ట్రాన్స్మిషన్ మోడల్స్‌లో లోపాలు ఉన్నట్లు తేలింది. అందువల్ల ఈ ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్లోని లోపాలను సరిదిద్దడానికి కియా కంపెనీ స్వచ్ఛందంగా ఈ రీకాల్‌ను ప్రకటించింది. పైగా దీనిని పూర్తి ఉచితంగా సరిదిద్ది కస్టమర్లకు అందజేస్తామని స్పష్టం చేసింది.
Kia Seltos Price : కియా సెల్టోస్‌లో ప్రధానంగా 7 వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధర సుమారుగా రూ.10.90 లక్షలు - రూ.20.30 లక్షల వరకు ఉంటుంది.
Toyota India Recalls Land Cruiser 300 : టయోటా ఇండియా కంపెనీ మొత్తంగా 269 ల్యాండ్ క్యూయిజర్ 300 కార్లను రీకాల్ చేసింది. 'ఈ లగ్జరీ కారులోని ఆటోమేటిక్ టాన్స్మిషన్కు సంబంధించిన ఈసీయూ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసేందుకే రీకాల్ నిర్ణయం తీసుకున్నామని' టయోటా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతానికి ల్యాండ్ క్యూయిజర్ 300 కార్ల బుకింగ్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను పూర్తి ఉచితంగా సరిచేస్తున్నట్లు తెలిపింది.
Toyota Land Cruiser Price : మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ధర సుమారుగా రూ.2.10 కోట్లు ఉంటుంది. ఈ కారులో 3.3 లీటర్ వీ6 డీజిల్ మిల్ ఉంటుంది. ఇది 305 bhp పవర్, 700 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది.
ABS ఫీచర్‌తో బైక్ కొనాలా? ఈ టాప్-5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!