How To Withdraw PF Balance From UMANG App : ప్రస్తుతం ప్రతి ఒక్క ఉద్యోగికి దాదాపుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ప్రతినెలా వారి ప్రాథమిక జీతంలో కొంత శాతం మేర పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తుంటారు. అలాగే వారు పని చేస్తున్న సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఆ ఉద్యోగుల అకౌంట్‌కు జమ చేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ డబ్బు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అయితే, కొంతమందికి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరమవుతుంది. దీంతో చాలా మంది EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటారు. అయితే, ఈ విధంగా డబ్బులను విత్‌డ్రా చేయడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈపీఎఫ్‌ఓ వినియోగదారుల కోసం ఉమాంగ్ యాప్ (UMANG app) ద్వారా క్షణాల్లోనే డబ్బులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. మరి ఉమాంగ్ యాప్ ద్వారా ఏ విధంగా డబ్బులను విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉమాంగ్ యాప్ ఉపయోగించి పీఎఫ్ డబ్బులను ఎలా విత్‌డ్రా చేయాలి ?
- ముందుగా ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ (UMANG App)ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసిన అనంతరం అవసరమైన వివరాలతో లాగిన్ అవ్వాలి.
- తర్వాత సర్వీస్ సెక్షన్లో EPFO ఆప్షన్‌ను ఎంచుకోండి.
- తర్వాత 'Employee Centric Services' సెక్షన్లో Raise Claim ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఇప్పుడు UAN నెంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.
- తర్వాత కావాల్సిన వివరాలు నమోదు చేసి మీరు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి.. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఈ ప్రాసెస్ మొత్తం పూర్తైన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది.
- ఈ రెఫరెన్స్ నెంబర్‌ను ఉమాంగ్ యాప్‌లో ఎంటర్ చేసి.. మీ అమౌంట్ విత్‌డ్రా రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
- ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా ఉమాంగ్ యాప్ ద్వారా క్షణాల్లోనే పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
How To Check PF Balance In UMANG App : ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చు ?
- మీ ఫోన్లో ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి EPFO ఆప్షన్‌ను ఎంచుకోండి.
- తర్వాత 'Employee Centric Services' సెక్షన్లో 'View Passbook' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- తర్వాత మీ UAN నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని అక్కడ ఎంటర్ చేయండి.
- అంతే ఇప్పుడు మీ బ్యాలెన్స్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ - అడ్వాన్స్ విత్డ్రావెల్ లిమిట్ 'డబుల్'! - EPF Advance Claim Limit