ETV Bharat / business

డెబిట్​ కార్డ్ మర్చిపోయారా? డోంట్ వర్రీ - ATM నుంచి మనీ విత్​డ్రా చేయండిలా! - Cardless Cash Withdrawal From ATM - CARDLESS CASH WITHDRAWAL FROM ATM

Cardless Cash Withdrawal From ATM : మీకు అర్జెంట్​గా డబ్బులు కావాలా? కానీ డెబిట్​ కార్డ్​ను ఇంట్లోనే మరిచిపోయారా? డోంట్ వర్రీ! మీ దగ్గర డెబిట్​ కార్డ్ లేకపోయినా, చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

How to Withdraw Money From an ATM Without a Card
Cardless cash withdrawal from ATMs with UPI (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 12:14 PM IST

Updated : Jul 24, 2024, 12:39 PM IST

Cardless Cash Withdrawal From ATM : బ్యాంకింగ్ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారిపోతోంది. ఇంతకు ముందు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు డెబిట్ కార్డు తప్పనిసరిగా అవసరమయ్యేది. అయితే గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే ఫీచర్స్‌ను వినియోగిస్తూ ప్రజలు ఎంతో కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. ఒకవేళ జేబులో డెబిట్ కార్డు లేకపోయినా, చేతిలో ఉన్న ఫోన్‌‌లోని ఫీచర్స్‌ను వాడుకొని ఏటీఎం నుంచి క్యాష్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కోడ్‌ను స్కాన్ చేసి
డెబిట్ కార్డులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఆ బ్యాంకుకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను మనం యాక్సెస్ చేయాలి. దీనిలోని ప్రాసెస్‌ను ఫాలో అయితే, మన కోసం బ్యాంకు ప్రత్యేక కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అదనంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా క్యాష్‌ను విత్‌డ్రా చేయొచ్చు. ఈ క్రమంలో ఫోన్​లోని పిన్ లేదా బయోమెట్రిక్ ద్వారా బ్యాంకు అకౌంట్ యూజర్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.

యూపీఐతో
ఏటీఎం నుంచి క్యాష్‌ను విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను కూడా మనం వాడుకోవచ్చు. ఇందుకోసం మన స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ను వాడాలి. కార్డ్‌లెస్‌గా నగదును విత్‌డ్రా చేయడానికి అనుసరించే స్టెప్స్‌నే ఇక్కడ కూడా ఫాలో కావాలి. అయితే ఈ పద్ధతిలో విత్​డ్రా చేసేటప్పుడు మన యూపీఐ పిన్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

యూపీఐతో ఏటీఎం లావాదేవీలు - లాభనష్టాలివీ
యూపీఐ పద్ధతిలో ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేసేందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. రోజువారీ యూపీఐ లావాదేవీల లిమిట్ అనేది ఫోన్‌లో ఎంతైతే ఉంటుందో, ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసే సందర్భంలోనూ అంతే ఉంటుంది. డెబిట్ కార్డుతో పోలిస్తే యూపీఐ ద్వారా లావాదేవీలు చాలా సేఫ్. డెబిట్ కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే ఈ రిస్క్ ఉండదు.

కార్డ్‌లెస్‌ ఏటీఎం లావాదేవీల ప్రయోజనాలివీ!

  • సౌలభ్యం : మీ డెబిట్ కార్డును ప్రతిసారీ, ప్రతి చోటుకూ తీసుకెళ్లాల్సిన పనిలేదు.
  • భద్రత : స్కిమ్మింగ్/క్లోనింగ్ రిస్క్‌ నుంచి తప్పించుకోవచ్చు. పైగా మీరు కార్డును పోగొట్టుకునే అవకాశాలు ఉండవు.
  • యాక్సెసిబిలిటీ : డెబిట్ కార్డులను సేఫ్‌‌గా నిర్వహించాల్సి ఉంటుంది. కనుక ఆ నిర్వహణ భారం తప్పుతుంది.

వారసులకు సజావుగా ఆస్తులు బదిలీ చేయాలా? 'ప్రైవేట్‌ ఫ్యామిలీ ట్రస్టు' ఏర్పాటు చేయండిలా! - Business Succession Planning

లోన్‌ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? అయితే ఇలా చేయండి - మీ జోలికి అస్సలు రారు! - Loan Recovery Agents Harassment

Last Updated : Jul 24, 2024, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.