How To Unblock EPF Account : నెలవారీ జీతం పొందే ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను కలిగి ఉంటారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఇది ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు పథకం. ఈపీఎఫ్ పథకం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకం కోసం, ఉద్యోగుల నెలవారీ జీతం నుండి ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే, కొన్నిసార్లు ఉద్యోగి పదవీ విరమణ, మరణం లేదా మరేదైనా కారణాల వల్ల వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈపీఎఫ్ కు సహకరించని యెడలా...అలాంటి ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. అలాంటి ఖాతాలు బ్లాక్ అవుతాయి. ఇందులో డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉండదు. అయితే అలాంటి బ్లాక్ చేసిన ఇన్‌యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా యాక్టివేట్ చేయవచ్చు.
అన్‌బ్లాక్ చేయడం ఎలా?
ఇటీవల ఈపీఎఫ్ఓ, పీఎఫ్ ఖాతాలను అన్‌బ్లాక్ చేయడానికి కొత్త SOPని అమల్లోకి తెచ్చింది. ఈ ఎస్ఓపీ ప్రకారం, వినియోగదారులు తమ ఈపీఎఫ్ ఖాతాను అన్‌బ్లాక్ చేయడానికి ముందు వారి కేవైసీ వివరాలను వెరిఫై చేసుకోవాలి. అంటే ఖాతాదారుడి గుర్తింపు ధృవీకరణ పత్రాలైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలను ధృవీకరించాలి. యూజర్ ఈపీఎఫ్ ఖాతా భద్రతను నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యమైన దశ. కేవైసీ పూర్తయిన తర్వాత కింద చెప్పిన విధంగా ఫాలో అవి ఈపీఎఫ్ ఖాతాను అన్‌బ్లాక్ చేయవచ్చు.
- www.epfindia.gov.in లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అక్కడ ఇచ్చే వివరాలు ఆధారాలను ఉపయోగించి ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత 'హెల్ప్ డెస్క్'కు వెళ్లాలి.
- 'ఇన్‌ఆపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్'పై క్లిక్ చేయాలి.
- వెబ్సైట్ ఇచ్చే సూచనలు ఆధారంగా మీ గుర్తింపును వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అన్‌బ్లాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టాలి.
అప్పటి వరకు వడ్డీ
ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో అధికారిక పోర్టల్ లేదా ఉమంగ్ అప్లికేషన్లో చేక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడానికి, పాస్ బుక్ వివరాలను చూసుకోవడానికి ఈపీఎఫ్ ఇప్పుడు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో సహాయపడుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులందరూ 58 సంవత్సరాల వయస్సు వరకు నగదుపై వడ్డీని పొందుతారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్- EPF గరిష్ఠ వేతన పరిమితి పెంపు! - EPFO Maximum Salary Limit
మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check PF Balance