ETV Bharat / business

ఫారిన్​లో చదువుకునేందుకు వెళ్తున్నారా? మీ 'బడ్జెట్' ప్లాన్ ను ఇలా వేసుకుంటే అంతా సాఫీగా! - Foreign Students Budget Plan - FOREIGN STUDENTS BUDGET PLAN

Foreign Students Budget Plan : ఫారిన్​లో చదువుకునేందుకు వెళ్తున్నారా? బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసా? పక్కా ప్లాన్​తో విదేశీ విద్య కోసం వెళ్తే ఎలాంటి ఇబ్బందుల రావు. మరి ఎలా ప్లాన్ చేయాలంటే?

Foreign Students Budget Plan
Foreign Students Budget Plan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 1:00 PM IST

Foreign Students Budget Plan : విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. విదేశీ విద్యనభ్యసించిన వారికి కెరీర్‌ బాగుండడం విదేశీ విద్యకు అదనపు ఆకర్షణగా మారింది. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే విదేశీ విద్యలో ముందంజలో ఉంటే, ప్రస్తుతం ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి వర్గాలు కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి విద్యకు ఖర్చులు కూడా భారీగానే అవుతాయి. ఇవి విద్యార్థులకు కొంతవరకు భారమనే చెప్పొచ్చు.

అందుకే విద్యార్థిగా విదేశాల్లో మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించడం చాలా కీలకం. తెలియని ప్రదేశంలో ట్యూషన్‌ ఫీజులు, ప్రయాణం, జీవన వ్యయాల మధ్య విద్యార్థులు జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థిక భారం తప్పదు. అయితే, కొన్ని వివేకవంతమైన ప్రణాళికలతో, తెలివైన అలవాట్లతో ఖర్చులపై నియంత్రణను పొందొచ్చు. కాబట్టి, విద్యార్థులు విదేశాల్లో తమ బడ్జెట్‌ను ఎలా నిర్వహించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం.

స్కాలర్‌షిప్‌/గ్రాంట్స్‌
విదేశాలలో చదువుతున్నప్పుడు బడ్జెట్‌ను నిర్వహించడానికి మరొక మార్గం స్కాలర్‌షిప్‌లు లేదా ఇతర ఆర్థిక సహాయాల లభ్యతను కనుగొనడం. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు ఉన్నత విద్యను పొందేందుకు అనేక సంస్థలు వివిధ స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లను అందిస్తాయి. ఇలాంటి వాటి కోసం శోధించండి. ఇలాంటి ఆర్థిక సహాయాన్ని పొందడానికి విద్యార్థులకు తగిన విద్యార్హతలు, ఇతర శ్రేష్ఠతలు ఉన్నాయో లేదో విశ్లేషించండి. విదేశీ విద్యకు ట్యూషన్‌ ఫీజులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వ/ప్రైవేట్‌ సంస్థలు, విద్యా సంస్థలు కూడా అందిస్తాయి, ఇవి ట్యూషన్‌ ఫీజును కవర్‌ చేస్తాయి. వీటితో పాటు, కొన్ని స్కాలర్‌షిప్‌లు ఇంటి అద్దెను కూడా కవర్‌ చేస్తాయి. ఇటువంటి ఆర్థిక సహాయం విదేశాల్లో చదువుతున్న సమయంలో బడ్జెట్‌ను నిర్వహించడంలో విద్యార్థులకు బాగా సహాయపడుతుంది.

వసతి
ప్రస్తుత రోజుల్లో ఎక్కడైనా నెల మొదట్లోనే పెద్ద ఖర్చు అద్దె చెల్లింపు. ఇది స్వదేశంలో కూడా ముఖ్యమైన ఖర్చే. అదే విదేశంలో అయితే పెద్ద ఖర్చు కింద చెప్పొచ్చు. విదేశాలలో వివిధ రకాల విద్యార్థుల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. యజమాని అందించే సౌకర్యాలను బట్టి అద్దె మారుతుంది. వీలైతే మీ విద్యా సంస్థకు సమీపంలో వసతి కోసం చూడండి. దీంతో ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. ఇతర విద్యార్థులతో వసతిని పంచుకోవడం వల్ల ఖర్చులు కొంత వరకు తగ్గుతాయి.

డిస్కౌంట్స్‌
విదేశాల్లో పొదుపు చేయడానికి స్టూడెంట్‌ యాక్సెస్‌ కార్డులు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ కార్డు ద్వారా డిస్కౌంట్‌లో పుస్తకాలు, కిరాణా సామాగ్రి, ఆహార వస్తువులు, గాడ్జెట్స్‌, ప్రయాణ సౌకర్యాలు మొదలైనవి పొందొచ్చు. విద్యార్థులు విదేశాల్లో ఉన్నంతకాలం విద్యార్థి యాక్సెస్‌ కార్డును తమ దగ్గర ఉండేలా చూసుకోవాలి. విద్యార్థి యాక్సెస్‌ కార్డుతో ఎలాంటి సౌకర్యాలు పొందొచ్చో తెలియకుంటే, సీనియర్లు/తోటి విద్యార్థులను అడగవచ్చు. స్టోర్స్‌, రెస్టారెంట్స్‌, వినోద వేదికల వద్ద ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌ను యాక్సెస్‌ చేయడానికి ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఐడీ కార్డు(ISIC)ను ఉపయోగించొచ్చు. ఈ కార్డు తక్కువ రుసుముతో 135 దేశాల్లో 1,50,000 పైగా తగ్గింపులకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇలాంటి సౌకర్యాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు తమ బడ్జెట్‌ను మెరుగ్గా నిర్వహించొచ్చు.

ఫీజు వాయిదాలు
విదేశాల్లో చదువుకోవడం చాలా మందికి ఆర్థికంగా అంత సులభం కాదు. ఎందుకంటే, అనేక ఖర్చులను తీర్చడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. దానిలో ఎక్కువ భాగం ట్యూషన్‌ ఫీజులకే అవుతుంది. ఈ ఫీజును కనీసం ఒక విద్యా సంవత్సరానికి ముందే చెల్లించాలి. అయితే, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన విద్యాలయాలు ఫీజులు వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తున్నాయి. నగదు తక్కువున్న వారు ట్యూషన్‌ ఫీజుపై వాయిదాల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక రుసుములతో పోలిస్తే ప్రతి సెమిష్టర్‌కు ఫీజు చెల్లించడం ఆర్థికంగా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి.

పార్ట్‌-టైం జాబ్‌
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు ఉత్తమ ఆదాయ వనరు. ఇటువంటి ఆదాయం జీవన వ్యయాలకు మద్దతుగా ఉంటుంది. విద్యార్థులు వారానికి 20 గంటల వరకు పనిచేయొచ్చు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం వల్ల విదేశంలో వర్క్‌ కల్చర్‌, పని జీవితం గురించి తెలుసుకోవచ్చు. ఇవి వాస్తవ అనుభవంగా పనికొస్తాయి. విద్యార్థులు, సీనియర్లు లేదా ఇతర తోటి విద్యార్థుల సహాయంతో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం పొందొచ్చు. విదేశాల్లోని చాలా కళాశాలలు/విశ్వవిద్యాలయాలు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాన్ని పొందడంలో తమ విద్యార్థులకు సహాయం చేస్తాయి.

ఆహారం
స్వదేశంతో పోలిస్తే, విదేశాల్లో ఆహార ఖర్చు చాలా ఎక్కువ. అంతేకాకుండా ఇతర దేశాల్లో నాన్‌వెజ్‌ ఆహారం విరివిగా అందుబాటులో ఉంటుంది. వెజ్‌ అన్ని చోట్ల లభించదు. ఇంకా అనేక సొంత కారణాలు, అలవాట్లు, అభిరుచుల వల్ల విదేశంలో ఆహారం బయట తీసుకోవడం కన్నా సొంతంగా ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో చేసుకున్న ఆహరంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా సొంతంగా ఆహారాన్ని చేసుకోవడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గించుకుని బడ్జెట్‌ను నియంత్రించొచ్చు.

ఇతర ఆదా మార్గాలు
పుస్తకాలను కొనడం కన్నా అక్కడ విద్యాలయ లైబ్రరీని ఉపయోగించుకోవచ్చు లేదా సీనియర్లను అడిగి ఉపయోగించిన పుస్తకాలను తీసుకోవచ్చు. ఉపయోగించిన పుస్తకాలు చాలా వరకు ఆన్‌లైన్‌లో కూడా సరసమైన ధరలకు లభిస్తాయి. చదువుకై డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించడం కూడా మంచిది. స్టడీ మెటీరియల్స్‌పై ఆదా చేయడానికి పాఠ్యపుస్తకాల ఉచిత డిజిటల్‌ ఎడిషన్స్‌ కోసం చూడండి. అంతేకాకుండా, చాలా దేశాల్లో ప్రజలకు ఉచితంగా అనేక బహిరంగ ప్రదేశాల్లో వినోద సౌకర్యాలు ఉంటున్నాయి. వినోదం కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆఫర్ల సమయంలో వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం వల్ల ఖర్చును తగ్గించుకుని చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.