ETV Bharat / business

హోమ్ ​లోన్ త్వరగా తీర్చేయాలా? ఈ టాప్​-5 టిప్స్​ మీ కోసమే! - How to pay home loan faster

How to pay home loan faster : సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహరుణం తీసుకోవటం సాధారమైన విషయమే. కానీ రెపో రేటు స్థిరంగా ఉన్నా, బ్యాంకులు హోమ్​ లోన్ వడ్డీ రేట్లును సవరిస్తూ ఉన్నాయి. పైగా ఇకపై వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. అందుకే మనపై భారం పడకుండా తొందరగా హోమ్​లోన్​ను ఎలా తీర్చుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

How to pay home loan faster
How to pay home loan faster (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 12:17 PM IST

How to pay home loan faster : సొంతిల్లు ఉండాలనే కల ఎంతో మందికి ఉంటుంది. దీన్ని నిజం చేసుకునేందుకు చాలా మంది గృహరుణం తీసుకుంటూంటారు. అయితే కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు మాత్రం గృహరుణ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో గృహరుణాన్ని తొందరగా తీర్చేందుకు ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం.

1. ముందే అంచనా వేసుకోవాలి!
దాదాపు 15-20 ఏళ్ల వ్యవధికి తీసుకున్న గృహరుణాన్ని వీలైనంత తొందరగా తీర్చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆర్థికంగా మిగతా విషయాలపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. కొంతమంది నెలవారీ వాయిదాలు తక్కువగా ఉండేలా చూసుకోవడం కోసం వ్యవధిని పెంచుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం అధికం అవుతుంది. ఇంటి రుణం తీసుకునేటప్పుడే మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎంత మేరకు ఈఎంఐ చెల్లించగలను? దీని ప్రభావం నా ఆర్థిక పరిస్థితిపై ఎలా ఉంటుంది? అని ముందుగానే ఆలోచించుకోవాలి.

ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వ్యవధికి 8.5 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహరుణాన్ని తీసుకుంటే, మీ నెలవారీ ఈఎంఐ సుమారు రూ.43,237 వరకు ఉంటుంది. దీనికి మొత్తం వడ్డీ దాదాపు రూ.54.13 లక్షల వరకు అవుతుంది. అంటే 20 ఏళ్లలో అసలు, వడ్డీ కలిపితే సుమారుగా మీరు రూ.1.04 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

ఒకవేళ ఈ రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చుకోవాలని అనుకుంటే, నెలవారీ వాయిదా మొత్తాన్ని కాస్త పెంచుకోవాలి. అంటే రూ.43,237కు బదులుగా రూ.49,237 చెల్లిస్తే, అప్పుడు వడ్డీ మొత్తం రూ.36.62 లక్షలే అవుతుంది. అప్పుడు మీరు చెల్లించే మెత్తం రూ.86.62 లక్షలు మాత్రమే. అంటే మీరు సుమారు రూ.6,000 అధికంగా చెల్లించడం వల్ల గృహరుణం తొందరగా తీరడమే కాకుండా, దాదాపు రూ.15.38 లక్షల వరకు ఆదా అవుతుంది. మీరు అధికంగా చెల్లించే ప్రతి రూపాయీ గృహరుణం అసలుకు జమ అవుతుంది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. అయితే ఇదంతా లెక్కలు వేసేటప్పుడు మాత్రమే బాగుంటుంది. కానీ, నిజ జీవితంలో ఆచరణ సాధ్యం అవుతుందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే, ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతల వల్ల అధిక ఈఎంఐ చెల్లించేందుకు కుదరకపోవచ్చు. కాకపోతే, కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం వల్ల దీన్ని సాధ్యం చేయొచ్చు.

2. రుణం వీలైనంత తక్కువగా!
ఇల్లు కొనాలనుకున్నప్పుడు వీలైనంత వరకు మీ చేతి నుంచే చెల్లించేందుకు ప్రయత్నం చేయాలి. దీనివల్ల అధిక రుణం తీసుకునే అవసరం తప్పుతుంది. అందుకే మీకు అవసరమైన మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. ఒకవైపు 8.5 - 9 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తూ, మీ దగ్గరున్న మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చేదేమి ఉండదు. రుణం తక్కువగా తీసుకోవడం వల్ల ఈఎంఐలు చెల్లించడం తేలిక అవుతుంది. పైకా వడ్డీ మొత్తం కూడా ఆదా అవుతుంది. ఇలా మిగిలిన డబ్బును పెట్టుబడులకు మళ్లించే ప్రయత్నం చేసుకోవచ్చు. లేదంటే ఈఎంఐ అధికంగా చెల్లిస్తూ తొందరగా రుణాన్ని తీర్చేయవచ్చు.

3. వాయిదా మొత్తాన్ని పెంచుకుంటూ ఉండాలి!
ఏటా వేతనంలో ఎంతో కొంతమేర వృద్ధి ఉంటుంది. ఇలా ఆదాయం పెరిగినా ప్రతిసారీ వాయిదా మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సంవత్సరానికి కనీసం 5 శాతం చొప్పున అధికంగా ఈఎంఐ చెల్లించే దిశగా ప్రణాళిక వేసుకోవాలి. దీనివల్ల 3-4 ఏళ్ల ముందుగానే రుణం తీరిపోతుంది. వడ్డీ రేట్లు పెరిగినా ఇబ్బంది ఉండదు.

4. అసలు తీర్చేయాలి!
హోమ్​ లోన్​ తీసుకున్న తర్వాత, ఏటా అసలులో 5-10 శాతం మేరకు చెల్లించేలా చూడాలి. చాలా బ్యాంకులు కనీసం రూ.25వేల నుంచి చెల్లించేందుకూ అనుమతిస్తున్నాయి. వీలైనప్పుడల్లా అసలు మొత్తంలో ఎంతో కొంత తీర్చాలని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇతర బ్యాంకులేమైనా తక్కువ వడ్డీకి రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తే, వాటికి మారిపోవడమూ మంచిదే. కనీసం 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకూ తగ్గితేనే వేరే బ్యాంకును చూసుకోవాలి.

5. అదనంగా వచ్చిన డబ్బు రుణానికే!
పెట్టుబడులు, బోనస్‌లు, పాలసీల ద్వారా వచ్చే రాబడిని ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా, ఇంటి రుణం తీర్చేందుకే ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చేస్తే చాలా త్వరగానే గృహ రుణం తీరిపోతుంది. మీపై అధిక వడ్డీల భారం తగ్గిపోతుంది.

అంబానీ నుంచి అదానీ వరకు - గొప్ప వ్యాపారవేత్తలు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? - Successful Indian Businessman Story

రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా గడపాలా? అయితే ఈ ప్రణాళికలు తప్పనిసరి! - RETIREMENT PLANNING TIPS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.