ETV Bharat / business

బంగారు ఆభరణాలు కొంటున్నారా? గోల్డ్ ప్యూరిటీ గురించి తెలుసుకోండిలా! - How To Check Gold Purity - HOW TO CHECK GOLD PURITY

Gold Purity Check In Telugu : ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్​ నడుస్తోంది. అందుకే చాలా మంది బంగారు ఆభరణాలు కొంటున్నారు. మరి మీరు కూడా బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బంగారం కొనేముందు దాని స్వచ్ఛతను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Purity Check
How To Check Gold Purity
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 5:03 PM IST

Gold Purity Check : భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ. ఇంట్లోని ప్రతి శుభకార్యానికీ పసిడి ఆభరణాలు ధరించాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. పైగా ఇది పెళ్లిళ్ల సీజన్​. దీనితో బంగారానికి అమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. బంగారం కొనడం వరకు ఓకే. మరి దాని స్వచ్ఛతను గుర్తించడం ఎలానో మీకు తెలుసా?

బంగారం స్వచ్ఛత ప్రమాణాలు!
Gold Purity Standards In India : బంగారం కొనేముందు దాని స్వచ్ఛత గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును పసిడి ఆభరణాలు కొనేందుకు ఉపయోగిస్తాం. వీటిని మనం జీవితాంతం ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే బంగారం స్వచ్ఛత తెలుసుకొనే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు.

బీఐఎస్​ హాల్​మార్క్​
Bis Hallmark Check : బ్యూరో ఆఫ్ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఎస్​ఐ) చట్టం ప్రకారం, బంగారు ఆభరణాలపై కచ్చితంగా హాల్​మార్కింగ్ ఉండాలి. ఈ హాల్​మార్కింగ్​లో 5 భాగాలు ఉంటాయి. వాటి గురించి కూడా మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

1. హాల్​మార్క్​ గుర్తు :
Hallmark Logo : మనలో చాలా మందికి బంగారంపై హాల్​మార్క్ ఉంటుందని తెలుసు. కానీ ఆ హాల్​మార్క్​ గుర్తు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే హాల్​మార్క్​ గుర్తు గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

BIS Hall mark
BIS హాల్​ మార్క్​

2. బంగారంలో రకాలు
Gold Carat Table :

  • 999 - 24 క్యారెట్స్​ (ఇది పూర్తిగా స్వచ్ఛమైన బంగారం. అయితే ఈ స్వచ్ఛమైన పసిడితో ఆభరణాలు చేయలేము.)
  • 958 - 23 క్యారెట్స్​
  • 916 - 22 క్యారెట్స్​
  • 875 - 21 క్యారెట్స్​
  • 750 - 18 క్యారెట్స్​
  • 708 - 17 క్యారెట్స్​
  • 585 - 14 క్యారెట్స్​
  • 417 - 10 క్యారెట్స్
  • 375 - 9 క్యారెట్స్​
  • 333 - 8 క్యారెట్స్​

3. హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ : ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా హాల్​మార్కింగ్​ సెంటర్​ లోగోను తనిఖీ చేయాలి. హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితాను https://www.bis.gov.in/ వెబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు.

4. మార్కింగ్ సంవత్సరం : ఆభరణాలను తయారుచేసిన సంవత్సరాన్ని ఇంగ్లీష్​ ఆల్ఫాబెట్ రూపంలో తెలియజేస్తారు. ఉదాహరణకు ​‘A’ అక్షరం 2000 సంవత్సరాన్ని సూచిస్తుంది. అలాగే ‘J’ -2008, ‘N-2010, ‘M’- 2011 సంవత్సరాన్ని సూచిస్తుంది.

5. జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ :
Jeweler Identification Mark : బంగారం వ్యాపారులు బీఐఎస్ సర్టిఫైడ్ ఐడెంటిఫికేషన్ మార్క్​ను కలిగి ఉండాలి. అందుకే బంగారం కొనేముందు కచ్చితంగా ఆ షాప్​ గుర్తింపు మార్క్​ను కూడా చూసుకోవాలి.

Basic Signs Of Hallmarking : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, హాల్​మార్క్​డ్​ ఆభరణాల్లో 3 గుర్తులు కచ్చితంగా ఉండాలి. అవి :

  • 1. బీఐఎస్​ లోగో
  • 2. ప్యూరిటీ/ ఫిట్​నెస్​ గ్రేడ్​
  • 3. ఆరు అంకెల ఆల్ఫాన్యూమెరిక్​ కోడ్​ ( HUID)

నోట్​: బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే, హాల్‌మార్క్ గుర్తు పసిడి స్వచ్ఛతకు భరోసా ఇస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా క్యాష్ మెమోను అడిగి తీసుకోవాలి. ఒకవేళ మీకు భవిష్యత్​లో ఏదైనా సమస్య వచ్చి, ఫిర్యాదు చేయాల్సి వస్తే ఈ క్యాష్ మెమో మీకు సహాయపడుతుంది.

KDM Gold Purity : చాలా మంది KDM ఆభరణాలు కొంటూ ఉంటారు. కానీ కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధరణ చేయదు. అందుకే హాల్​మార్కింగ్ ఉన్న గోల్డ్ కొనడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ప్రస్తుతం హాల్​మార్కింగ్​ ధర కేవలం రూ.35+ జీఎస్​టీ మాత్రమే. వాస్తవానికి మీరు ఎంత ఎక్కువ పరిమాణంలో బంగారం కొన్నప్పటికీ, ఈ హాల్​మార్కింగ్ ఛార్జ్​ అనేది ఫిక్స్​డ్​గా ఉంటుంది. గోల్డ్​ స్వచ్ఛత విషయంలో మరింత సమాచారం కావాలంటే బీఐఎస్ వెబ్​సైట్ www.bis.org.in ను సందర్శించండి.

పాత బంగారం సంగతి ఏమిటి?
Old Gold Ornaments Purity Test : మన ఇంట్లో తరతరాలుగా వస్తున్న పాత బంగారం ఉంటుంది. మరి అలాంటి బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఆనేక ఆధునిక పద్ధతులు నేడు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఫైర్​ అండ్​ ఫ్లోరోసెన్స్ టెస్ట్​
  2. ఎక్స్​-రే ఫ్లోరోసెన్స్​ టెస్ట్​
  3. యాసిడ్​ టెస్ట్​
  4. డెన్సిటీ టెస్ట్​
  5. ప్లాస్మా మాస్​ స్పెక్ట్రోమెట్సీ

పైన పేర్కొన్న టెస్ట్​లు మనం ఇంట్లో చేసుకునేవి కాదు. బంగారం పనిచేసే వాళ్లు ఈ టెస్టులు చేస్తారు. అందుకే మీకు నమ్మకమైన కంసాలుల వద్ద లేదా నిపుణుల వద్ద ఈ టెస్ట్​లు చేయించుకుని, మీ దగ్గర ఉన్న బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.

గోల్డ్​ టెస్ట్​ కిట్ :
Gold Test Kit : ప్రస్తుతం మార్కెట్​లోకి అనేక గోల్డ్ టెస్టింగ్​ కిట్​లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి, ఇంట్లోనే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఈ గోల్డ్ టెస్ట్ కిట్​లో ఒక ప్రత్యేకమైన రాయి, టెస్టింగ్​ సొల్యూషన్, ఛార్ట్​​ ఉంటాయి. మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఈ రాయిపై కాస్త రుద్దిన తరువాత, దానిపై టెస్టింగ్ సొల్యూషన్​ వేయాలి. దీనితో బంగారం రంగులో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. వాస్తవానికి బంగారం స్వచ్ఛతను అనుసరించి, బంగారం రంగుల్లో మార్పులు ఉంటాయి. ఛార్ట్​లో ఈ రంగులు - స్వచ్ఛత జాబితా ఉంటుంది. దీని ఆధారంగా మీ దగ్గర ఉన్న బంగారం స్వచ్ఛత తెలుసుకోవచ్చు.

How To Check Gold Purity
బంగారం స్వచ్ఛత తెలుసుకునే మార్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.