ETV Bharat / business

శాలరీ నుంచి ట్యాక్స్​ ఎంత కట్ చేస్తారు? ఎలా లెక్కిస్తారు? - TAX CALCULATED ON EMPOLYEE SALARY

ఉద్యోగుల జీతంలో పన్ను ఎంత కట్​ అవుతుంది? పన్ను మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు?

How Tax Calculated On Empolyee Salary
How Tax Calculated On Empolyee Salary (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 1:38 PM IST

How Tax Calculated On Empolyee Salary : ఉద్యోగుల శాలరీలో ట్యాక్స్​ కట్స్​ వారి ఆదాయం, ట్యాక్స్​ స్లాబ్​లు, వారు ఎంచుకున్న పన్ను విధానంపై(పాత, కొత్త) అధారపడి ఉంటాయి. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద HRA, పెట్టుబడులుపై డిడక్షన్స్​, మినహాయింపులు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో తక్కువ ట్యాక్స్​ రేట్లు ఉన్నాయి. మినహాయింపులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్న్​ ఫైల్​ చేస్తే మీ పన్నుల్లో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా వర్తిస్తే రిఫండ్​లను కూడా క్లెయిమ్​ చేసుకోవచ్చు. అసలు ట్యాక్స్​ను ఎలా లెక్కిస్తారు? ఎలాంటి డిడక్షన్స్​ను పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్​ చేసుకోవచ్చు, దానివల్ల శాలరీపై పడే ప్రభావం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. భారత్​లో అమలవుతున్న ఇన్​కమ్​ ట్యాక్స్​ స్లాబ్​లు
భారత్​లో ప్రోగ్రెసివ్ ట్యాక్స్​ విధానం అమలులో ఉంది. ఇందులో భాగంగా అధిక-ఆదాయ వర్గాల వారికి అధిక పన్ను విధిస్తారు. చెల్లింపుదారులు ఎంచుకున్న పన్ను విధానం ఆధారంగా పన్ను రేట్లు భిన్నంగా ఉంటాయి. 2020 బడ్జెట్​లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు.

పాత పన్ను విధానం (మినహాయింపులు, డిడక్షన్స్​తో కలిపి)

  • రూ.2.5 లక్షల వరకు - పన్ను లేదు
  • రూ.2,50,001 నుంచి రూ.5 లక్షల వరకు - 5 శాతం
  • రూ.5,00,001 నుంచి రూ.10 లక్షలు - 20శాతం
  • రూ.10 లక్షల కంటే ఎక్కువ - 30శాతం

కొత్త పన్ను విధానం (మినహాయింపులు, డిడక్షన్స్​ లేకుండా)

  • రూ.2.5 లక్షల వరకు - పన్ను లేదు
  • రూ.2,50,001 నుంచి రూ.5 లక్షలు - 5శాతం
  • రూ.5,00,001 నుంచి రూ.7.5 లక్షలు - 10శాతం
  • రూ.7,50,001 నుంచి రూ.10 లక్షలు - 15శాతం
  • రూ.10,00,001 నుంచి రూ.12.5 లక్షలు - 20శాతం
  • రూ.12,50,001 నుంచి రూ.15 లక్షలు - 25శాతం
  • రూ.15 లక్షల కంటే ఎక్కువ - 30శాతం

ఈ రెండు పన్ను విధానాలు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి. పన్ను చెల్లింపుదారులు రెండింట్లో ఒకటి ఎంచుకోవచ్చు.

2.శాలరీ కంపోనెంట్స్​
శాలరీలో అనేక కంపోనెంట్స్ ఉంటాయి. వీటిలో కొన్నింటిపై పన్ను విధిస్తారు. మరికొన్నింటిపై మినహాయింపులు ఉంటాయి. శాలరీలో ఉండే కంపోనెంట్స్​ ఇవే.

  • బేసిక్ శాలరీ : దీనిపై పూర్తి పన్ను ఉంటుంది
  • HRA : చెల్లించే అద్దె, నివాసం ఉండే నగరం ఆధారంగా హెచ్​ఆర్​ఏపై పాక్షికంగా లేదా పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
  • స్పెషల్ అలవెన్సులు : వీటిపై సాధారణంగా పన్ను విధిస్తారు. ఒకవేళ నిర్దిష్ట మినహాయింపులు వర్తిస్తే ట్యాక్స్ ఉండదు(ఉదాహరణ : ట్రావెల్, మెడికల్, రియంబర్స్​మెంట్​)
  • బోనస్, ఇంసెంటివ్స్​ : వీటిపై పూర్తిగా పన్ను ఉంటుంది
  • ప్రావిడెంట్​ ఫండ్ : సెక్షన్ 80సీ ప్రకారం ప్రావిడెంట్​ ఫండ్​కు ఉద్యోగులు ఇచ్చే భాగం రూ.1.5 లక్షల వరకు ఉంటే మినహాయింపు ఉంటుంది. ఎంప్లాయిస్​ ఇచ్చే భాగంపై కొన్ని పరిమితులు దాటితే ట్యాక్స్​ విధిస్తారు.

3.శాలరీపై పన్ను ఎలా లెక్కించడం
జీతంపై పన్ను లెక్కించే ప్రక్రియ అనే దశల్లో ఉంటుంది.

గ్రాస్ శాలరీ : అలవెన్సులు, బోనస్​లు ఇతర అదాయాలతో సహా మీ మొత్తం జీతంతో లెక్కింపు ప్రారంభమవుతుంది.

డిడక్షన్స్​, మినహాయింపులు : అందులో నుంచి హెచ్​ఆర్​ఏ, లీవ్​ ట్రావెల్ అలవెన్సులతో పాటు సెక్షన్ 10 కింద మినహాయింపులు తీసివేయండి.
చాప్టర్​ VI-A కింద డిడక్షన్స్​ :

  • సెక్షన్​ 80సీ - ELSS, PPF మొదలైన వాటిలో పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు
  • సెక్షన్ 80డీ - ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గింపులు
  • సెక్షన్ 80ఈ - విద్యా రుణాలపై వడ్డీ

పన్ను విధించదగిన ఆదాయం : మినహాయింపులు, డిడక్షన్స్​ తర్వాత మిగిలిన మొత్తమే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం

పన్ను స్లాబ్​ల అప్లికేషన్ : పన్ను విధించదగిన ఆదాయం, ఎంచుకున్న పన్ను విధానం ఆధారంగా ట్యాక్స్​ స్లాబ్​ను ఉపయోగించి లెక్కించండి.

4. TDS ఎంత కట్​ అయింది?
మీకు వర్తించే ట్యాక్స్​ స్లాబ్​ ప్రకారం ప్రతి నెలా శాలరీ నుంచి మీ యజమాని టీడీఎస్(ట్యాక్స్​ డిడక్టెడ్​ ఎట్ సోర్స్​) కట్ చేసుకుంటారు. యజమానులు మీ వార్షిక ఆదాయం ఆధారంగా టీడీఎస్ కట్​ చేస్తారు. అనంతరం ఇన్​కమ్​ ట్యాక్స్​ శాఖకు ఆ మొత్తాన్ని జమ చేస్తారు.

ఆర్థిక సంవత్సరం చివరిలో మీ యజమాని అందించిన ఫామ్ 16లో TDS డిడక్షన్స్​ను మీరు చూడొచ్చు. ఈ ఫామ్ మీరు ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

5. ట్యాక్స్​ లయబిలిటీని ఎలా తగ్గించాలి?
మినహాయింపులను, డిడక్షన్స్​ను క్లెయిమ్​ చేసుకోవడం ద్వారా చట్టబద్ధంగా ట్యాక్స్​ లయబిలిటీని తగ్గించుకోవచ్చు.

సెక్షన్​ 80సీ పెట్టుబడులు : లైఫ్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు, EPF, PPF, NSC, ELSS వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్​ ఆదా చేసుకోవచ్చు.

హెచ్​ఆర్​ఏ : మీరు అద్దె గృహంలో నివసిస్తున్నట్లయితే హెచ్​ఆర్​ఏ మినహాయింపును క్లెయిమ్ చేసుకోచ్చు.

ఆరోగ్య బీమా : సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తీసేయండి.

హోమ్​ లోన్​పై వడ్డీ : సెక్షన్ 24(బి) ప్రకారం హోమ్​ లోన్​పై చెల్లించే వడ్డీని తీసివేయండి.

NPS కంట్రిబ్యూషన్స్​ : సెక్షన్ 80CCD(1B) కింద నేషనల్ పింఛన్​ స్కీమ్​కు(NPS) కంట్రిబ్యూట్ చేయడం ద్వారా అదనంగా రూ.50,000 ఆదా చేసుకోండి.

6. ట్యాక్స్​ ఫైలింగ్, రిఫండ్స్
మీ యజమాని టీడీఎస్ కట్​ చేసిన తర్వాత, మీరు ఆర్థిక సంవత్సరం చివరలో తప్పనిసరిగా ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్న్​ ఫైల్ చేయాలి. వాస్తవ లయబిలిటీ కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ట్యాక్స్​ రిటర్న్​ ఫైల్​ చేసేటప్పుడు రిఫండ్​ను క్లెయిమ్​ చేసుకోవచ్చు.

ట్యాక్స్​ స్ట్రక్చర్​ను అర్థం చేసుకుని, అందుబాటులో ఉన్న డిడక్షన్స్​ను తెలివిగా ఉపయోగించుకుంటే- పన్ను లయబిలిటీని తగ్గించుకోవడం సహా మీ సేవింగ్స్​ను పెంచుకోవచ్చు.

మీకు ఇంకా ఐటీ రిఫండ్​ రాలేదా? రీ-ఇష్యూ కోరండిలా! - Income Tax Refund Process

'పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ - ఫేక్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జర జాగ్రత్త' - ఐటీ శాఖ హెచ్చరిక - ITR Refund Scam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.