Highest Earning Temple In India : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏడాదికి రూ.1,600 కోట్ల మేర వడ్డీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీలే ఇంత భారీ మొత్తంలో దేవాలయానికి వస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఇప్పటివరకు ఎంత మేర ఫిక్స్డ్ డిపాజిట్లను చేసింది? ఏ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది(2024) అత్యధికంగా రూ.1,161 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దేవస్థానం బలమైన ఆర్థిక నిర్వహణ వల్ల ఈ ఏడాది డిపాజిట్లు గత సంవత్సరాలతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. భారత్‌లో గత 12 సంవత్సరాలుగా ఏటా రూ.500 కోట్లు కంటే ఎక్కువ డిపాజిట్లు చేస్తున్న హిందూ ధార్మిక సంస్థల్లో టీటీడీ ఒకటి. టీటీడీ 2013 నుంచి 2024 మధ్య రూ.8,467 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి బలమైన ఆర్థిక పథాన్ని కొనసాగించింది. 2013లో రూ.608 కోట్లు, 2024లో రికార్డు స్థాయిలో రూ.1,161 కోట్లు ఎఫ్డీ చేసింది.
కొవిడ్ ప్రభావం
కొవిడ్ మహమ్మారి సమయంలో టీటీడీ సైతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. 2021, 2022లో దేవస్థానానికి ఆదాయం తగ్గింది. దీంతో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆశించిన మేర చేయలేకపోయింది. మళ్లీ పుంజుకుని ఈ ఏడాది రూ.1,161 కోట్ల ఎఫ్డీలను చేసింది.
Tirumala Tirupati Diverse Trust Funds : శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నప్రసాదం, శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌లకు కూడా భారీ స్థాయిలో భక్తుల నుంచి నిధులు అందుతూ ఉంటాయి. ఈ ట్రస్టులు మొత్తంగా రూ.5,529 కోట్ల నిధులను సేకరించాయి.
రికార్డు స్థాయిలో నగదు నిల్వలు, బంగారం డిపాజిట్లు
Tirumala Tirupati Gold Deposits : 2024 ఏప్రిల్ నాటికి బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.18,817 కోట్లకు చేరుకున్నాయి. ఇదే టీటీడీ చరిత్రలో అత్యధిక మొత్తం. టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కిలోలకు పెరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఏటా రూ.1,600 కోట్లు సంపాదిస్తోంది.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు