ETV Bharat / business

బ్యాంక్​ కస్టమర్లకు అలర్ట్​- 13గంటల పాటు సేవలు బంద్! ఎప్పుడో తెలుసా? - hdfc bank services down - HDFC BANK SERVICES DOWN

HDFC Bank Services Down : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్​ సెక్టార్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ నేపథ్యంలో జులై 13న శనివారం బ్యాంక్ సేవలు కొన్నింటికి అంతరాయం కలగనుందని వినియోగదారులను అప్రమత్తం చేసింది. వినియోగదారులకు బ్యాకింగ్​ సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించింది.

hdfc bank services down
hdfc bank services down (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 2:29 PM IST

HDFC Bank Services Down : భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లను అలర్ట్ చేసింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సర్వీసుల్లో అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. ఈ మేరకు కస్టమర్లకు ఇ-మెయిల్స్ ద్వారా ముందుగానే సమాచారాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా 93మిలియన్ల మంది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. జులై 13న శనివారం బ్యాంక్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు చెప్పింది. ఈ మొత్తం ప్రక్రియ శనివారం తెల్లవారుజామున 3 నుంచి సాయంత్రం 4.30 వరకు దాదాపు 13 గంటలకుపైనే కొనసాగుతుందని ప్రకటనలో తెలిపింది. "పెర్ఫామెన్స్ స్పీడ్, హై ట్రాఫిక్ మెయింటెయిన్ చేసేందుకు కెపాసిటీ పెంచడం కోసం బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్​ను(CBS) కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేస్తున్నాం. కస్టమర్లకు అసౌకర్యాన్ని తగ్గించడానికి సెలవు రోజు అప్‌గ్రేడ్‌ చేస్తున్నప్పటికీ కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఆన్‌లైన్ సేవలు చేసుకోవాలనుకునేవారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి." అని సూచించింది. ఈ నేపధ్యంలోనే అందుబాటులో ఉండే సేవలు ఏంటో ఒకసారి చూద్దాం

నగదు ఉపసంహరణ
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సేవలు : HDFC డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి నిర్ణీత పరిమితి మేరకు ఏటీఎంల్లో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

స్టోర్‌లో: స్వైప్ మెషీన్‌లపై పరిమిత లావాదేవీలకు అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించిన అలర్ట్​లు మాత్రం తరువాత రోజుకే అందుతాయి.

ఆన్‌లైన్: నిర్ణీత పరిమితిలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసుకోవచ్చు.

యూపీఐ సేవలు : శనివారం తెల్లవారుజామున 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలకు అంతరాయం కలుగనుంది. ఈ సమయంలో డబ్బులు పంపడం, స్వీకరించడం కుదరదు. మిగిలిన సమయాల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ సెట్ చేసుకోవడం లేదా మార్చుకోవడం వీలవుతుంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవు.

డీమ్యాట్, కార్డ్‌లు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, WealthFy నివేదికలు అందుబాటులో ఉంటాయి. అలాగే కస్టమర్లకు ఎలాంటి అంతరాయాలు కలుగకుండా ఉండేందుకు 2024 జులై 12న శుక్రవారం రాత్రి 7:30 గంటల్లోపు అవసరమైన నగదును ముందే విత్‌డ్రా చేసుకోవాలని సూచించింది. అన్ని ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని హెచ్​డీఎఫ్​సీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.