HDFC Bank Revises Credit Card Rules From August 1 : మనదేశంలోనే అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఆ కొత్త నిబంధనలు, షరతులు అమల్లోకి వస్తాయి. వాటికి సంబంధించిన వివరాలివీ.
- థర్డ్ పార్టీ యాప్స్‌తో అద్దెల పేమెంట్స్‌పై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, క్రెడ్, మొబీ క్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే రెంటల్ పేమెంట్స్‌పై 1 శాతం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరహా అద్దె చెల్లింపుల లిమిట్‌ను ఒక్కో లావాదేవీకి రూ.3వేలకు పరిమితం చేశారు. - యుటిలిటీ బిల్స్‌పై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్ రూ.50వేలలోపు ఉన్నంత వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. రూ.50వేలు దాటిన సందర్భాల్లో 1 శాతం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ట్రాన్సాక్షన్‌లో గరిష్ఠంగా రూ.3వేల యుటిలిటీ బిల్ మాత్రమే చెల్లించగలుగుతాం. బీమా లావాదేవీలకు ఈ విభాగం నుంచి మినహాయింపు కల్పించారు. - ఇంధన లావాదేవీలపై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో చాలా మంది ఇంధన (గ్యాస్, పెట్రోల్, డీజిల్) బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ బిల్లు రూ.15వేలు దాటితే 1 శాతం ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇంధన బిల్లులను ఒక్కో ట్రాన్సాక్షన్‌లో రూ.3వేల వరకు మాత్రమే చెల్లింపు చేయగలుగుతాం. - విద్యా లావాదేవీలపై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి క్రెడ్, పేటీఎం మొదలైన థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపులపై 1 శాతం ఛార్జీని వసూలు చేస్తారు. ఒక్కో లావాదేవీకి రూ.3,000 పరిమితి ఉంటుంది. అయితే అంతర్జాతీయ విద్యా చెల్లింపులకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు కల్పించారు. కళాశాల లేదా పాఠశాల వెబ్‌సైట్‌లు, వాటి పీఓఎస్ మెషీన్‌ల ద్వారా నేరుగా చేసే లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు. - అంతర్జాతీయ లావాదేవీలపై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా చేసే అన్ని అంతర్జాతీయ లేదా క్రాస్ కరెన్సీ లావాదేవీలకు 3.5 శాతం మేర మార్కప్ ఛార్జీని విధిస్తారు. - లేట్ పేమెంట్ ఛార్జీల సవరణ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన బకాయి మొత్తాల ఆధారంగా లేట్ పేమెంట్ ఫీజును నిర్ణయిస్తారు. లేట్ పేమెంట్ ఫీజు రూ.100 నుంచి రూ.300 దాకా ఉంటుంది. - రివార్డ్‌ల రీడీమ్‌పై ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన స్టేట్‌మెంట్ క్రెడిట్ లేదా క్యాష్‌బ్యాక్‌పై రివార్డ్‌లను రీడీమ్ చేసుకునే కస్టమర్ల నుంచి రూ.50 రీడీమ్ ఫీజు వసూలు చేస్తారు. - బాకీ మొత్తంపై ఫైనాన్స్ ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యాలను ఉపయోగించుకునే కస్టమర్ల నుంచి నెలకు 3.75 శాతం మేర ఛార్జీ వసూలు చేస్తారు. లావాదేవీ జరిగిన తేదీ నుంచి బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు ఈ ఛార్జీయే వర్తిస్తుంది. - ఈజీ ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ ఈఎంఐ సౌకర్యాన్ని పొందితే గరిష్ఠంగా రూ.299 ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. - టాటా క్రెడిట్ కార్డులతో లావాదేవీలపై న్యూకాయిన్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌ల కోసం నిబంధనలను మార్చింది. ఈ కార్డుల వినియోగదారులు అర్హత కలిగిన యూపీఐ లావాదేవీలపై 1.5 శాతం దాకా ‘న్యూ’(Neu) కాయిన్‌లను అందుకుంటారు. టాటా న్యూ యూపీఐ ఐడీ, ఇతర అర్హత కలిగిన యూపీఐ ఐడీల ద్వారా చేసే లావాదేవీలకు 0.50 శాతం దాకా న్యూ కాయిన్స్ లభిస్తాయి. టాటా న్యూ ప్లస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు టాటా న్యూ యూపీఐ ఐడీని ఉపయోగించి చేసే లావాదేవీలపై 1% న్యూ కాయిన్స్ లభిస్తాయి. ఇతర అర్హత కలిగిన యూపీఐ ఐడీలతో లావాదేవీలు చేస్తే 0.25 శాతం దాకా న్యూకాయిన్స్ వస్తాయి.
ప్రపంచంలో కాస్ట్లీ మెటల్ ఏంటి? బంగారం, ప్లాటినమ్ అస్సలు కాదు! - Most Expensive Metal in the World