Gold Rate Today September 6, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,570 ఉండగా, శుక్రవారం నాటికి రూ.475 పెరిగి రూ.74,045కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.84,260 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1180 పెరిగి రూ.85,440కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 6, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,045గా ఉంది. కిలో వెండి ధర రూ.85,440గా ఉంది.
- Gold Price In Vijayawada September 6, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,045గా ఉంది. కిలో వెండి ధర రూ.85,440 ఉంది.
- Gold Price In Visakhapatnam September 6, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,045గా ఉంది. కిలో వెండి ధర రూ.85,440గా ఉంది.
- Gold Price In Proddatur September 6, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,045గా ఉంది. కిలో వెండి ధర రూ.85,440గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 6, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2495 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 23 డాలర్లు పెరిగి 2518 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.79 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 6, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,60,000 |
ఇథీరియం | రూ.2,00,200 |
టెథర్ | రూ.77.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.38,901 |
సొలోనా | రూ.9,800 |
Stock Market Today September 6, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, గ్లోబల్ మార్కెట్లలో వీక్ ట్రెండ్ నడుస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 563 పాయింట్లు నష్టపోయి 81,646 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 24,979 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open September 6, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.95గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices September 6, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices September 6, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 72.64 డాలర్లకు చేరింది.