ETV Bharat / business

PPF, SSY ఖాతాదారులకు అలర్ట్​ - కనీస మొత్తం జమ చేయడానికి డైడ్​లైన్​ ఇదే! - Financial Deadlines In March 2024

Financial Deadlines In March 2024 : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్​ (పీపీఎఫ్​), సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు ఖాతాలు స్తంభించిపోతాయి. ఎస్​బీఐ అమృత్ కలశ్​ స్కీమ్​లో చేరడానికి కూడా మార్చి 31 ఆఖరు తేదీ.

PPF Deadline In March 2024
Financial Deadlines In March 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 5:18 PM IST

Financial Deadlines In March 2024 : మీరు సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్‌ ప్రావిడెంట్​ ఫండ్‌ (PPF) పథకాల్లో మదుపు చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఏడాది మార్చి 31లోపు ఈ పథకాల్లో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేదంటే సదరు ఖాతాలు స్తంభించిపోతాయి. తరువాత ఆ అకౌంట్​లు పునరుద్ధరణ చేసుకోవాలంటే, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పైగా పలు ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ 'అమృత్ కలశ్' పేరుతో​ స్పెషల్ ఎఫ్​డీ స్కీమ్​ను అందిస్తోంది. దీనిలో చేరడానికి చివరి తేదీ ఈ మార్చి 31. కనుక ఆసక్తి ఉన్నవారు వీలైనంత త్వరగా ఈ అమృత్ కలశ్​ స్కీమ్​లో చేరడం మంచిది.

Public Provident Fund : ప‌బ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్ అకౌంట్​లో​ ప్రతి సంవత్సరం కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఒకవేళ గడువులోగా కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఖాతా పునరుద్ధరణ చేయాలంటే, రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణంగా పీపీఎఫ్‌ అకౌంట్​ తెరిచిన మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకోవచ్చు. ఆరో సంవత్సరం నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒక వేళ అకౌంట్‌ స్తంభించిపోతే ఈ లోన్‌, విత్‌డ్రా సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ స్తంభించిన పీపీఎఫ్‌ ఖాతాను పునరుద్ధరించాలంటే, జరిమానా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.550 చొప్పున చెల్లించాల్సి వస్తుంది.

Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం ఆడ‌పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే సుక‌న్య సమృద్ధి యోజన. ఈ పథకంలో ఏటా కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్​ స్తంభించిపోతుంది. మళ్లీ రూ.50 జరిమానా చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే కనీస డిపాజిట్‌ మొత్తం + జరిమానా రూ.50 కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా కారణంతో ఖాతాను పునరుద్ధరించకపోతే, ఖాతాలోని మొత్తం డబ్బు మెచ్యూరిటీ తరువాత మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత ఈ అకౌంట్‌ మెచ్యూర్ అవుతుంది.

Amrith Kalash Scheme Deadline : మనదేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్ల కోసం 'అమృత్ కలశ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2024 మార్చి 31.

Amrith Kalash Scheme Interest Rates : ఎస్​బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్​బీఐ ఈ స్కీమ్​ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్​ కలశ్​ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.

2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని మార్చి 31 వరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో రెండు సార్లు ఈ పథకం​ గడువును పెంచారు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు కూడా ఈ స్కీమ్​లో చేరడానికి అర్హులే.

ఈ పథకంలో చేరినవారు వడ్డీ చెల్లింపునకు నెల, ఆరు నెలల, లేదా సెమీ యాన్యువల్ కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని ఆధారంగా నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇన్​కమ్​ టాక్స్ చట్టం ప్రకారం, ఈ పథకం కింద వచ్చిన ఆదాయంపై టీడీఎస్ కట్ అవుతుంది. ఈ అమృత్​ కలశ్​ పథకంలో రుణం సదుపాయంతోపాటు, ముందే డబ్బులు విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

అమృత్​ కలశ్​ పథకంలో ఎలా చేరాలి?
మీ దగ్గర్లోని ఎస్​బీఐ బ్రాంచ్​కు నేరుగా వెళ్లి అమృత్ కలశ్​ స్కీమ్​లో చేరవచ్చు. లేదా ఆన్​లైన్​లోనే నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండూ కాకుండా, ఎస్​బీఐ యోనో అప్లికేషన్ ద్వారా కూడా ఈ స్కీమ్​లో చేరవచ్చు.

మార్చి డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే!

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.