ETV Bharat / business

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్​ - KYC గడువు పెంపు - కొత్త తేదీ ఇదే! - how to update FASTag KYC

FASTag KYC Deadline Extended : ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్. NHAI ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29 వరకు గడువు పొడిగించింది. ఈ గడువులోగా కేవైసీ కంప్లీట్ చేయని ఫాస్టాగ్​లను డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది. అందుకే ఈ ఆర్టికల్​లో ఫాస్టాగ్ ఈ-కేవైసీ ప్రాసెస్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

FASTag KYC deadline extended
FASTag KYC update process
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 5:58 PM IST

FASTag KYC Deadline Extended : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 29లోపు కచ్చితంగా ప్రతిఒక్కరూ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ గడువులోగా కేవైసీ కంప్లీట్ చేయని ఫాస్టాగ్​లను డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది.

ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌లో లేదా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (NETC) వెబ్‌సైట్‌లో KYC ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని NHAI తెలిపింది. ఇంతకు ముందు జనవరి 31 వరకు ఫాస్టాగ్ కేవైసీ డెడ్​లైన్ విధించింది. కానీ వాహనదారుల సౌలభ్యం కోసం మరలా ఆ గడువును నెల రోజులపాటు పొడిగించింది. అందుకే ఇప్పుడు వాహనదారులు తమ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి? అలాగే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను ఎలా కంప్లీట్ చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://fastag.ihmcl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్​లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ అది ఇన్​కంప్లీట్​గా ఉంటే, అక్కడే కేవైసీని అప్​డేట్ కూడా చేసుకోవచ్చు.

సాధారణంగా వివిధ బ్యాంకులు ఫాస్టాగ్​లు జారీ చేస్తుంటాయి. అందువల్ల మీరు https://www.netc.org.in/request-for-netc-fastag లింక్​ను ఓపెన్ చేయాలి. మీకు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్​ను ఎంచుకోవాలి. అక్కడే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ఆన్​లైన్​లో ఫాస్టాగ్ అప్​డేట్ చేయడం ఎలా?

  • ముందుగా FASTag అధికారిక వెబ్‌సైట్‌ https://fastag.ihmcl.com ఓపెన్ చేయాలి.
  • మై ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లి, KYC అనే సబ్-​సెక్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అందులో మీ ఫాస్టాగ్ కేవైసీ వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమనై ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
  • మీ పాస్​పోర్ట్ సైజ్ ఫొటోను అప్లోడ్ చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకొని, డిక్లరేషన్​ను కన్ఫార్మ్ చేయాలి.
  • తరువాత అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.
  • అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత KYC ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
  • 7 పని దినాల్లో మీ ఫాస్టాగ్​ కేవైసీ అప్​డేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

వన్ వెహికల్ - వన్ ఫాస్టాగ్
వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ విధానం ప్రకారం ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఎక్కువ ఫాస్టాగ్​లు ఉంటే, వాటిలోని లేటెస్ట్​ది తప్ప, మిగతావన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి. రీఛార్జ్ విషయానికి వస్తే BBPS, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫాస్టాగ్​ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

వాహన బీమా తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా!

క్రెడిట్​ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.