ETV Bharat / business

మీ దగ్గర చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయా? నష్టపోయే ప్రమాదం ఉంది - జర జాగ్రత్త! - Credit Card Usage Tips

Disadvantages Of Multiple Credit Cards : మీరు ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. క్రెడిట్ కార్డులు మీ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ వీటిని సరిగ్గా నిర్వహించలేకపోతే, ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్​లను ఎలా సమర్థవంతంగా, లాభదాయకంగా వాడుకోవాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Is It Bad to Have Too Many Credit Cards
How Many Credit Cards Should You Have (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 12:03 PM IST

Disadvantages Of Multiple Credit Cards : ఈ రోజుల్లో ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. మీ అవసరాలు, సౌలభ్యం మాట ఎలా ఉన్నా, వీటిని నిర్వహించడంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా, రుణాల ఊబిలో చిక్కుకోవడం ఖాయం. అందుకే క్రెడిట్‌ కార్డులను ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పరిమితి మించకుండా!
మీ దగ్గర రెండు, మూడు క్రెడిట్‌ కార్డులు ఉంటే, ఆర్థికంగా కాస్త భరోసా ఉంటుంది. కానీ, వీటితో ఆదాయానికి మించి ఖర్చులు చేయకూడదు. మీ అత్యవసరాల కోసం, కార్డ్​ పరిమితి మేరకు మాత్రమే దానిని వాడుకోవాలి. ప్రధానంగా క్రెడిట్​ కార్డ్​ను ఒక పక్కా ప్రణాళికతో వాడుకోవాలి. సకాలంలోనే ఈఎంఐ బిల్లులు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్​తో బిల్లుల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు లాంటివి చేయవచ్చు. కానీ వాటిని సరదా ఖర్చులు కోసం ఉపయోగించుకోకూడదు.

హెచ్చరిక సందేశం!
మీరు క్రెడిట్ కార్డ్ వాడిన ప్రతిసారీ, జరిగిన లావాదేవీకి సంబంధించిన సందేశం (మెసేజ్) వచ్చేలా చూసుకోవాలి. బిల్లు చెల్లింపు గడువును తెలిపే రిమైండర్​ మెసేజ్​లను ఎనేబుల్ చేసుకోవాలి. అంతేకాదు పరిమితికి మించి క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు హెచ్చరిక సందేశం వచ్చేలా చూసుకోవాలి.

సకాలంలో బిల్లులు చెల్లించాల్సిందే!
మీ దగ్గర చాలా క్రెడిట్ కార్డులు ఉంటే, గడువులోగా బిల్లు చెల్లించడం కష్టమయ్యే అవకాశం ఉంది. లేదా గడువు తేదీలను మరిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ బ్యాంక్​ ఖాతా నుంచి నేరుగా, గడువు తేదీకి ఒక రోజు ముందే బిల్లు చెల్లింపు జరిగేలా ఆటోమేట్ చేసుకోవాలి. దీని వల్ల అదనపు రుసుము, వడ్డీల భారం తగ్గుతుంది. ఒక వేళ సకాలంలో బిల్లు చెల్లించకపోతే, అదనపు వడ్డీలు, రుసుములు చెల్లించాల్సి వస్తుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.

అవసరం లేకపోతే వద్దు!
మీ దగ్గర 2 లేదా 3 క్రెడిట్ కార్డులు ఉన్నా ఫర్వాలేదు. కానీ బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని అదనంగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల అనవసరపు ఖర్చులు, రుసుములు ఎక్కువ అవుతాయి. మీకు తెలియకుండానే రుణాలు పెరిగిపోతాయి. దీని వల్ల మీరు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది.

స్టేట్​మెంట్లను పరిశీలించాల్సిందే!
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్​మెంట్లను కచ్చితంగా క్రమం తప్పకుండా పరిశీలించాలి. ఏవైనా అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు లేదా కార్డ్ జారీ చేసిన సంస్థకు తెలియజేయాలి.

క్రెడిట్ స్కోర్​ తనిఖీ
మీ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పేరుమీద కార్డులు, రుణాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి మోసపూరిత లావాదేవీలు కనిపిస్తే, వెంటనే క్రెడిట్‌ బ్యూరోలకు రిపోర్ట్​ చేయాలి.

నగదు అవసరాలకు వాడుకోవద్దు!
క్రెడిట్ కార్డ్​లు ఉపయోగించి నగదు తీసుకోకూడదు. ఒక వేళ తీసుకుంటే, అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

అత్యవసరమైతేనే రుణం!
క్రెడిట్​ కార్డుపై రుణాలను తీసుకునేటప్పుడూ ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్రెడిట్‌ కార్డు నుంచి రుణం తీసుకున్నప్పుడు దాదాపు 19-24 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

రివార్డుల కోసం ఖర్చు చేయవద్దు!
మీ క్రెడిట్ కార్డ్​ రివార్డులను పరిశీలిస్తూ ఉండాలి. ఈ రివార్డులను సమయానుకూలంగా ఉపయోగించుకోవాలి. క్యాష్​ బ్యాక్​, డిస్కౌంట్‌, రివార్డ్ పాయింట్లు లాంటివి ఏ కార్డుపై ఎలా ఉన్నాయన్న అవగాహన మీకు ఉండాలి. అంతేకాదు కొనుగోళ్లు చేసేటప్పుడు రివార్డు పాయింట్లను చాలా తెలివిగా వినియోగించాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రివార్డ్ పాయింట్లు సంపాదించడం కోసం అనవసర ఖర్చులు చేయకూడదు.

ఫీజుల భారం తప్పదు!
క్రెడిట్‌ కార్డులకు ఫీజులు, వార్షిక రుసుములు లాంటి ఉంటాయి. కనుక మీ దగ్గర ఎన్ని ఎక్కువ కార్డులు ఉంటే, అంత ఎక్కువగా ఆర్థిక భారం మీమీద పడుతుంది. కనుక అవసరమైనంత వరకు, అధిక పరిమితి ఉన్న కార్డులు ఉంచుకుని, మిగతావి రద్దు చేసుకోవడమే చాలా మంచిది. అంతే కాదు మీ దగ్గర ఉన్న కార్డులను 30 శాతం పరిమితికి మించి వాడకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే క్రెడిట్ కార్డు వల్ల మీకు లాభం చేకూరుతుంది. లేకుంటే అప్పుల ఊబిలో చిక్కుకోవడం ఖాయం.

హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Home Loan Tips

టర్మ్ ఇన్సూరెన్స్​ తీసుకోవాలా? వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? - Types Of Term Insurance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.