ETV Bharat / business

ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ తగ్గదు! అసలు ఎలా లెక్కిస్తారో తెలుసా? - how to check cibil score

Credit Score Tips And Tricks : లోన్ తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోర్​ తప్పనిసరి. ఈ స్కోర్​ను చూసే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మరి ఇంతటి కీలకమైన క్రెడిట్​ స్కోర్​ను బ్యాంకులు ఏవిధంగా లెక్కిస్తాయి? క్రెడిట్​ స్కోర్​ను ఏవిధంగా తెలుసుకోవచ్చు? క్రెడిట్​ కార్డు విషయంలో ముఖ్యమైన అంశాలేంటి? తదితర వివరాలు మీ కోసం.

credit score improve tips
Credit Score Tips And Tricks
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 8:07 PM IST

Credit Score Tips And Tricks : ఒక వ్యక్తి తాను తీసుకున్న లోన్​ను ఎలా తీరుస్తున్నారు అనేది తెలియజేసేది క్రెడిట్‌ స్కోరు. లోన్​ చెల్లింపు వాయిదాలు సకాలంలో చెల్లించకపోయినా, కార్డు బిల్లు తీర్చకపోయినట్లయితే క్రెడిట్​ స్కోర్​పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయితే చాలా మందికి ఈ క్రెడిట్​ స్కోరు, క్రెడిట్​ హిస్టరీ గురించి కొన్ని సందేహాలుంటాయి. వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప కొత్త లోన్​లను తీసుకోవడం అంత సులువు కాదు.

క్రెడిట్​ చరిత్ర
ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ అతి ముఖ్యం. ప్రధానంగా తీసుకున్న లోన్​ను క్రమం తప్పకుండా తీర్చాలి. ఇది రుణగ్రహీతల ప్రధాన బాధ్యత. ప్రతి రుణ గ్రహీతకు సంబంధించిన సమాచారాన్ని రుణదాతలు క్రెడిట్​ బ్యూరోల వద్ద నమోదు చేస్తుంటారు. వారి ప్రతి అంశాన్నీ క్రెడిట్​ హిస్టరీలో పేర్కొంటారు. కొత్తగా లోన్ కావాలని దరఖాస్తు చేసినప్పుడు, ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారమంతా ఒక్క చోటే లభించేలా ఈ నివేదికలు ఉంటాయి. రుణం ఇవ్వాలా? వద్దా? అనేది ఇక్కడే సగం నిర్ణయం అవుతుంది.

క్రెడిట్​ స్కోరును ఈ విధంగా తెలుసుకోండి
రుణ గ్రహీతలు తమ క్రెడిట్​ స్కోరును తెలుసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు, రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం ఉండదు. సిబిల్‌ వంటి పేరుపొందిన, విశ్వసనీయమైన క్రెడిట్‌ బ్యూరోల నుంచి ఏడాదికోసారి ఉచితంగానే పూర్తి నివేదికను పొందవచ్చు. ఇప్పుడు చాలా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఈ క్రెడిట్​ హిస్టరీలను అందిస్తున్నాయి. మీరు స్వయంగా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, రుణదాత మీ క్రెడిట్ స్కోరును తనిఖీ చేస్తే కొంచెం ఇబ్బందే. మీరు లోన్​ కోసం దరఖాస్తు చేసినట్లు నమోదవుతుంది. కొత్తగా లోన్​ తీసుబోయే ముందు మీరే సొంతంగా నివేదికను పరిశీలించడం ఉత్తమం.

  1. సకాలంలో చెల్లించారా అన్న విషయమే కీలకం
    మీకు ఎంత ఆదాయం వస్తుందనే సంగతిని క్రెడిట్​ బ్యూరోలు పట్టించుకోవు. కేవలం మీరు తీసుకున్న లోన్​లు వాటిని సకాలంలో చెల్లించారా లేదా అన్న విషయం ఆధారంగానే క్రెడిట్​ స్కోర్​ను లెక్కిస్తాయి. క్రెడిట్​ చెల్లింపులు సకాలంలో ఉంటే స్కోరు బాగుంటుంది.
  2. క్రెడిట్​ స్కోర్​ ఎలా లెక్కిస్తారు?
    క్రెడిట్‌ స్కోరును ఒక వ్యక్తి పాన్‌ ఆధారంగా లెక్కిస్తారు. కాబట్టి, ఈ స్కోరు వ్యక్తిగతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల లోన్​లతో సంబంధం
    ఉండదు. కాకపోతే వేరొకరి లోన్​కు హామీ ఉన్నా, కో అప్లికెంట్​గా ఉన్నా మీరూ రుణం తీసుకున్నట్లే. ఆ లోన్​ను తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను మీరు పంచుకున్నట్లే. వాస్తవంగా లోన్​ తీసుకున్న వ్యక్తి ఆయా వాయిదాలలో సరిగా చెల్లించకపోతే ఆ బాధ్యత మీపై పడుతుంది. మీరూ బాకీలను చెల్లించడంలో విఫలమైనట్లయితే క్రెడిట్​ స్కోరుపై ప్రభావం పడుతుంది.
  3. మంచి క్రెడిట్​ స్కోర్​ అంటే?
    రుణం తీసుకోకుంటే ఏ ఇబ్బందులూ రావు కదా అని అనుకోవచ్చు. అది నిజమే అయినప్పటికీ మీకు లోన్​ తీసుకోవాల్సిన అవసరం రాకపోవడం మంచి విషయమే. కానీ, జీవితంలో వివిధ లక్ష్యాల సాధనలో, అనుకోని సందర్భాల్లో రుణాల అవసరం తప్పకపోవచ్చు. ఇల్లు, కారు కొనుగోలు, పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్​ లోన్​ ఇందులో ఉంటాయి. మంచి క్రెడిట్‌ స్కోరు అంటే 750 మించి ఉంటే వడ్డీ రేట్లలో రాయితీలూ పొందే అవకాశం కూడా ఉంటుంది. స్కోరు లేకుంటే అధికంగా రేట్లను చెల్లించాల్సి రావచ్చు.
  4. ఆలస్యంగా చెల్లిస్తే
    ఒక నెల ఆలస్యంగా క్రెడిట్​ కార్డు బిల్లును చెల్లిస్తే అది మీ స్కోరులో 100 పాయింట్లను తగ్గించే అవకాశముంది. కోల్పోయిన ఈ పాయింట్లను పొందడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. ఈ కాలంలో మీరు లోన్​ కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణ ఎదురయ్యే అవకాశం ఉంది. లేదా ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. గడువు తేదీలోగా చెల్లించడం చాలా కీలకమైన అంశం.
  5. లోన్ తీసుకోకుంటే
    లోన్​ తీసుకోకపోతే ఎలాంటి క్రెడిట్‌ స్కోరూ ఉండదు. కనుక, క్రెడిట్​ హిస్టరీని గమనించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఎంతోమంది అనధికార లోన్​ మోసాల బారిన పడిన సంగతి చూస్తూనే ఉంటాం. మన ధ్రువీకరణలతో ఎవరైనా రుణం పొందారా? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ నివేదిక వివరాలు పరిశీలించాలి.

పర్ఫెక్ట్​ క్రెడిట్​ స్కోర్ ఉండాలా?- అయితే ఈ తప్పులు చేయొద్దు!​

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్​ కార్డ్​తో సింపుల్​గా చెక్​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.