ETV Bharat / business

ఫ్రీగా ప్రపంచాన్ని చుట్టేయాలా? క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది! అదెలాగంటే?

Credit Card Rewards for Travel in Telugu : ప్రపంచంలోని చాలా ప్రాంతాలు చూడాలనేది దాదాపుగా ప్రతి ఒక్కరి కల. కానీ అందరికీ అది సాధ్యపడదు. కానీ కేవలం మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే చాలు. వాటి రివార్డ్ పాయింట్స్​తో ఉచితంగా ప్రపంచం మొత్తం చుట్టేయవచ్చు. అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవండి.

Credit Card Rewards for Travel in Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 12:22 PM IST

Credit Card Rewards for Travel in Telugu : చాలా మందికి ప్రపంచాన్ని చుట్టిరావాలని ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే, మీ ద‌గ్గ‌ర క్రెడిట్ కార్డు ఉంటే పెద్ద ప‌నేం కాదు. రివార్డ్​ పాయింట్స్ ఉప‌యోగించి ఉచితంగా ప్ర‌పంచ ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. చాలా క్రెడిట్ కార్డులు 'రివార్డు పాయింట్లు', 'ఎయిర్ మైల్స్'​ ఆఫ‌ర్లు చేస్తాయి. వీటిని ఉప‌యోగించి ఉచితంగా విమానంలో ప్ర‌యాణించ‌డం, హోట‌ల్స్ ఉండ‌టం లాంటివి చేయ‌వ‌చ్చు. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం, ఖర్చుల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించడం ద్వారా త‌గిన‌న్ని రివార్డు పాయింట్లు పొంద‌వ‌చ్చు. అయితే ఈ పాయింట్ల‌ను పెంచుకోవ‌డానికి క్రెడిట్ కార్డు వినియోగం, ప్రయాణాలను స‌రిగ్గా ప్లాన్ చేసుకోవ‌డం ముఖ్యం. సరైన ప్రణాళిక ఉంటే ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఎయిర్ మైల్స్ అనేవి ఒక‌ర‌క‌మైన రివార్డు పాయింట్లు. ఇవి కొన్ని నిర్దిష్ట విమాన‌యాన సంస్థ లేదా దాని అనుబంధ సంస్థ‌ల్లో టికెట్ల కొనుగోలు చేయ‌డం ద్వారా పొందే పాయింట్లు. వీటిని ఫ్లైయర్ మైల్స్ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ల‌ను ఉప‌యోగించి ప‌లు రివార్డులు పొంద‌డం సహా ఉచిత విమాన ప్ర‌యాణం లేదా వాటిల్లో డిస్కౌంట్లు పొంద‌వ‌చ్చు. త‌ర‌చూ ఫ్లైట్ జ‌ర్నీ చేసే వారు ప్ర‌యాణ ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోవ‌డానికి ఎయిర్ మైల్స్ ఒక అద్భుత మార్గం. ఈ ఎయిర్ మైల్స్​ని ఎలా పొందాలో తెలుసుకుందాం.

ప్ర‌యాణించి రివార్డులు పొంద‌డం
Fly and Earn : విమాన ప్రయాణాలు చేయటం ద్వారా ఈ ఎయిర్ మైల్స్​ సంపాదించవచ్చు. వీటితో నిర్దిష్టమైన ఎయిర్​లైన్స్​ లైదా దాని అనుబంధ వాటితో ప్రయాణించవచ్చు. ఉదాహరణకు, విస్తారా టికెట్​ను బుక్​ చేసుకుంటే, వాటికి అయిన ఖర్చు ఆధారంగా 'క్లబ్ విస్తారా'కు సంబంధించిన పాయింట్స్ సంపాదించవచ్చు.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు
Co Branded Credit Cards : కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లతో కూడా ఎయిర్ మైల్స్ పొందవచ్చు. వీటిని ప‌లు విమాన‌యాన సంస్థ‌ల‌తోపాటు బ్యాంకులు కూడా అందిస్తాయి. రోజువారీ ఖర్చుల ద్వారా ఈ ఎయిర్ మైల్స్ సంపాదించే అవకాశం ఉంది. ఉదాహరణకు, యాక్సిక్​ క్రెడిట్​ కార్డ్​ని ఉపయోగించి విస్తార ఎయిర్​లైన్స్​ టికెట్​ను కొనుగోలు చేస్తే, వాటి క్లబ్​ పాయింట్​లను పొందవచ్చు.

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల బదిలీ
Transfer Of Credit Card Reward Points : కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు పాయింట్ల‌ను ఎయిర్ ఫ్లైయ‌ర్ మైల్స్​గా మార్చుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. అయితే వీటిని వివిధ బ్యాంకులు అందిస్తాయి. హెచ్​డీఎఫ్​సీ, యాక్సిక్​ వంటి బ్యాంకులు తమ వినియోగదారుల రివార్డ్ పాయింట్లను 15 కంటే ఎక్కువ విమానయాన సంస్థలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

మీరు తరచుగా విమాన ప్రయాణం చేసేవారైతే, ల‌గ్జ‌రీ విమాన ప్ర‌యాణం చేయ‌వచ్చు.

మీరు తరచుగా ప్రయాణిస్తూ, విలాసవంతమైన విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంటే, దాంతో పాటు డ‌బ్బు కూడా ఆదా చేసుకోవాలనుకుంటే, దానికి ఎయిర్ మైల్స్ ఒక అద్భుతమైన మార్గం. అయితే ఇందుకోసం ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌కు తగిన విధంగా ఎయిర్ లైన్స్ ప్రోగ్రామ్, క్రెడిట్ కార్డులను ఎంచుకోవ‌డం ముఖ్యం. అలానే వాటి ద్వారా ఎయిర్ మైల్స్ పొందేలా చూసుకోవాలి. ఇలా స‌రైన రీతిలో ప్లాన్ చేయ‌డం వ‌ల్ల, ప్రతి సంవత్సరం లగ్జరీ బిజినెస్​ క్లాస్​లో క‌నీసం ఒక విహారయాత్రకు వెళ్లొచ్చు.

కొత్త ఏడాదిలో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్​ - ఇకపై లాంజ్ యాక్సెస్​ కష్టమే!

బెస్ట్ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డ్​ ఎంచుకోవాలా? టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.