Crazy Concept Bike : మనం సాధారణంగా మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు కొనాలని అనుకుంటాం. కుర్రకారు అయితే మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు కాన్సెప్ట్ బైక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? వీటినే కొందరు షో బైక్స్ అని, ఫ్యూచర్ బైక్స్ అని కూడా అంటారు. మరి ఈ క్రేజీ బైక్స్ గురించి మనమూ తెలుసుకుందామా?
1. Suzuki Falcorustyco
1985 టోక్యో మోటార్ షోలో మొదటిసారిగా 'సుజుకి ఫాల్కోరస్టీకో' బైక్‌ను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో బాగా గుర్తుండిపోయే, మొదటి కాన్సెప్ట్ బైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. స్క్వేర్-ఫోర్ ఫోర్-స్ట్రోక్, త్రీ క్యామ్స్, హైడ్రాలిక్ డ్రైవ్, సెంటర్ స్ట్రీరింగ్తో దీనిని డిజైన్ చేశారు.
2. Suzuki GSX1000 Katana
సుజుకి కంపెనీ 1982లో 'జీఎస్ఎక్స్ 1000 కతానా' బైక్‌ను లాంఛ్ చేసింది. హై-స్పీడ్ స్టెబిలిటీ, ఏరోడైనమిక్స్ ఫీచర్స్‌తో దీనిని మాజీ బీఎండబ్ల్యూ చీఫ్ డిజైనర్ హన్స్ ముత్ రూపొందించారు. సుజుకి కంపెనీ తెచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ కారు ఇదే అని చెప్పవచ్చు.
3. Suzuki Nuda
సుజుకి కంపెనీ 1986 టోక్యో షోలో 'న్యూడా' బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌లో GSX-R750 బైక్‌లో వాడిన ఇంజిన్నే వాడారు. సుజుకి టోటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌తో, టూ-వీల్ షాఫ్ట్ డ్రైవ్, హబ్-సెంటర్ స్టీరింగ్‌తో దీనిని రూపొందించారు.
4. Harley-Davidson Café Racer Concept
హార్లే-డేవిడ్సన్ కేఫే రేసర్ కాన్సెప్ట్ బైక్‌ను 85 కొలోన్ షోలో ప్రదర్శించారు. మంచి స్పోర్ట్‌స్టర్ కాన్సెప్ట్ బైక్ ఇది. అప్పటి కాలంతో పోలిస్తే, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టూ-వీలర్ అని చెప్పుకోవచ్చు.
5. Craig Vetter's KZ1000 Mystery Ship
క్రెయిగ్ వెటర్ కంపెనీకి చెందిన ఈ KZ1000 మిస్టరీ షిప్ ఒక బెస్ట్ కాన్సెప్ట్ బైక్. మంచి స్టైలిష్ లుక్‌తో దీనిని తీసుకువచ్చారు. విండ్ ప్రొటక్షన్ కాన్సెప్ట్‌తో తీసుకువచ్చిన మొదటి బైక్ ఇదే. కానీ తరువాత దీని ప్రొడక్షన్ పూర్తిగా ఆపేశారు.
6. BMW Futuro
1980లో బీఎండబ్ల్యూ ఫ్యూచరో ఒక మంచి కాన్సెప్ట్ బైక్. ఇది టర్బోఛార్జ్డ్ బాక్సర్ ట్విన్ నుంచి పవర్ పొందుతుంది. దీని ట్రంక్ చాలా వెరైటీగా ఉంటుంది. దీనినే కాస్త మోడిఫై చేసి, తరువాత కాలంలో హోండా కంపెనీ వాడుకుంది.
7. Yamaha GTS1000
యమహా కంపెనీ తీసుకువచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ బైక్ ఈ GTS1000. ఇది చాలా లావుగా ఉంటుంది. కనుక సాధారణ డ్రైవర్లు దీనిని నడపలేరు. పైగా ఇది చాలా ఎక్స్పెన్సివ్.
8. Honda NR750
హోండా కంపెనీ విడుదల చేసిన ఫ్యూచరిస్టిక్ బైక్ ఇది. ఇందులో ఫోర్-సిలిండర్ 500సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. అప్పట్లోనే దీనిని చాలా హై-టెక్ డిజైన్‌తో రూపొందించారు.
మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Sports Bike