ETV Bharat / business

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేయవద్దు! - Mutual Fund Investment - MUTUAL FUND INVESTMENT

Mutual Fund Investment Mistakes : మీరు మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. కనుక మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Mutual Fund Investment Mistakes
mutual fund investment tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 2:55 PM IST

Mutual Fund Investment Mistakes : డబ్బు పొదుపు చేసేందుకు చాలా మంది చిన్న పొదుపు పథకాలపై ఆధారపడుతుంటారు. మరికొందరు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యం నెరవేరేందుకు తగినంత పెట్టుబడులు పెట్టగలరా, లేదా అనేది చూసుకోవాలి. క్రమబద్ధమైన (SIP) విధానాన్ని అనుసరించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడులు సంపాదించే అవకాశం పెరుగుతుంది. అయితే చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల వారి ఆర్థిక లక్ష్యాలు నెరవేరే అవకాశం బాగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్​మెంట్​లో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన లక్ష్యం లేకపోవడం!
స్వల్పకాలిక లాభాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సరికాదు. కనీసం ఏడేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. అంతకంటే దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగించడం మంచిది. మార్కెట్ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అలాకాకుండా స్వల్పకాలిక దృష్టితో, సరైన లక్ష్యం లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, స్టాక్ మార్కెట్లో స్వల్పకాలంలో అనేక ఒడుదొడుకులు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుంది. క్రమశిక్షణతో దీర్ఘకాలంపాటు మదుపు చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్స్​ మంచి లాభాలనే తెచ్చిపెడతాయని చరిత్ర చెబుతోంది.

సరిపడా పెట్టుబడులు పెట్టకపోవడం!
చాలా మందికి పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. కానీ వాటి సాధించేందుకు తగిన పెట్టుబడులు మాత్రం పెట్టరు. దీని వల్ల తమ లక్ష్యాలను సాధించలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు, మీరు ఓ 20 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుకుందాం. కానీ నెలవారీగా రూ.1000 మాత్రమే పెట్టుబడిపెడుతున్నారు. లేదా ఏకమొత్తంగా రూ.1 లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక లక్ష్యం నెరవేరదు. ​

వాస్తవానికి మీరు 20 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించాలంటే, ఇప్పటి నుంచే నెలవారీగా రూ.7,550 చొప్పున మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. లేదా ఓకేసారి రూ.6.1 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడే 20 ఏళ్ల తరువాత మీరు ఒక కోటి రూపాయల నిధిని సంపాదించగలుగుతారు.

సమయానికి సిప్ చేయకపోవడం!​
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP)ను తూచా తప్పకుండా పాటించాలి. అలా కాకుండా మీకు నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం లేదా పూర్తిగా నిలిపివేయడం వల్ల మీ ఆర్థిక లక్ష్యం నెరవేరకుండా పోతుంది. మీకు రావాల్సిన యూనిట్లు క్రమంగా తగ్గిపోతాయి. కొంత మంది మంచి లాభాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్​ నుంచి అవసరం లేకపోయినా డబ్బులు తీసేస్తూ ఉంటారు. మరికొందరు నష్టభయంతో అర్థాంతరంగా మ్యూచువల్ ఫండ్స్​ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉంటారు. దీని వల్ల నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.

నష్టభయంతో
స్టాక్ మార్కెట్లు స్వల్పకాలంలో ఒడుదొడుకులకు లోనుకావడం చాలా సహజం. అయితే చాలా మంది మార్కెట్ క్రాష్ అయినప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. నష్టభయంతో పెట్టుబడులు వెనక్కు తీసుకుంటూ ఉంటారు. స్వల్ప లాభాలతో లేదా నష్టాలతో ఇన్వెస్ట్​మెంట్ చేసిన డబ్బును వెనక్కు తీసుకుంటారు. కానీ ఇలా చేయడం చాలా తప్పు. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు, మంచి స్టాక్స్​ లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కనుక ఈ ఆపర్చూనిటీని మీరు ఉపయోగించుకోవాలి. అప్పుడే మీకు లాంగ్ పీరియడ్​లో మంచి లాభాలు వస్తాయి.

టాప్-పెర్ఫార్మింగ్ ఫండ్స్​ను ఛేజ్ చేయకూడదు!
చాలా మంది మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్​లో మాత్రమే పెట్టుబడులు పెడదామని అనుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే బాగా పెర్ఫార్మ్ చేసిన ఫండ్స్​ను ఎంచుకుంటారు. కానీ ఇది సరికాదు. నేడు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నవి, భవిష్యత్​లో కూడా రాణిస్తాయని చెప్పలేము. కొంత మంది ఇప్పటికే ఒక ఫండ్​లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కానీ ఎవరో చెప్పారని, దాని నుంచి డబ్బులు తీసేసి, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్​లో పెట్టుబడి పెడతారు. తరువాత ఇంతకన్నా మంచి ఫండ్ ఉందంటే, దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీరే నష్టపోతారు. ఎలా అంటే?

ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్​ పెర్పార్మన్స్ చూడాలంటే, కనీసం 2-3 ఏళ్లు వేచి ఉండాలి. అలాగే సదరు మ్యూచువల్ ఫండ్ పోర్ట్​ఫోలియో, ఫండ్ మేనేజర్ సామర్థ్యాలను గమనించాలి. ఆ తరువాత మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాకాకుండా చీటికీ మాటికీ మ్యూచువల్ ఫండ్స్​ మారుస్తూ ఉంటే, లాభాల మాటమో గానీ, నష్టపోవడం ఖాయం. చూశారుగా! మరి మీరు కూడా మ్యూచువల్ ఫండ్​లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.

నెలకు రూ.9500 పెట్టుబడి పెట్టండి - రూ.4.6 కోట్లు సంపాదించండి - ఎలా అంటే? - Smart SIP Tips

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' సేల్‌ - భారీ ఆఫర్స్​ & డీల్స్​ - ఎప్పటి నుంచి అంటే? - Flipkart Big Saving Days 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.