ETV Bharat / business

పెట్రోల్ కార్ Vs సీఎన్‌జీ కార్​- ఈ రెండింట్లో ఏది బెటర్? - CNG vs Petrol Cars - CNG VS PETROL CARS

CNG vs Petrol Cars: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ వేరియంట్‌ను కొనాలా? లేదా సీఎన్​జీ వేరియంట్​ను కొనుగోలు చేయాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ఈ రెండింటీలో ఏది బెస్ట్ ఆప్షన్ అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 7:40 PM IST

CNG vs Petrol Cars: కారు అంటే గతంలో డీజిల్ లేదా పెట్రోల్​తో మాత్రమే నడిచేది. కానీ, ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లతోపాటు సీఎన్​జీ (CNG) కార్లు కూడా రోడ్లపై దూసుకెళ్తున్నాయి. మరి ఇప్పడు కారు కొనుగోలు చేయాలంటే ఏది బెస్ట్? సీఎన్​జీ కారు కొంటే మంచిదా? పెట్రోల్‌ కారు తీసుకుంటే బాగుంటుందా? అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్​లో ఉంటారు. మరి వీటిలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌ అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గత కొన్నేళ్లుగా సీఎన్​జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్ల అమ్మకాలు దేశంలో విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం, ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా అందుబాటులోకి రాని కారణంగా సీఎన్​జీ కార్లవైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. అలాగే పెట్రోల్​తో నడిచే కార్లతో పోలిస్తే సీఎన్​జీ కార్లకు నిర్వహణ ఖర్చు (Maintenance) చాలా తక్కువ. అలాగే పర్యావరణ ప్రేమికులు సైతం సీఎన్​జీ వేరియంట్లపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో చిన్న, మధ్యతరహా సీఎన్​జీ వేరియంట్ కార్ల సేల్స్ పెరిగాయి. అయితే ఇప్పుడు ఎస్​యూవీ (SUV)ల్లో కూడా సీఎన్​జీ వేరియంట్ కార్లు వచ్చేశాయి.

సీఎన్​జీ వేరియంట్లపై ఆసక్తి!
పెట్రోల్, డీజిల్​తో పోలిస్తే సీఎన్​జీ ధర తక్కువగా ఉంటుంది. అలాగే పెట్రోల్​తో సీఎన్​జీ కార్లు నడుస్తాయి. సీఎన్​జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోల్​తో కూడా సీఎన్​జీ కార్లను నడపొచ్చు. ఈ సదుపాయం వల్ల సీఎన్​జీ వేరియంట్ కార్లపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.

పెట్రోల్ కార్లతో పోలిస్తే పికప్ తక్కువ!
పెట్రోల్‌ కార్లతో పోలిస్తే సీఎన్​జీ కార్ల పికప్‌ తక్కువగా ఉంటుంది. అలాగే సీఎన్​జీ కార్లు పెట్రోల్ కౌంటర్‌ పార్ట్‌లపై తక్కువ శక్తిని, టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. దేశంలో ఎక్కడికి వెళ్లినా పెట్రోల్‌ బంకులు ఉంటాయి, కాబట్టి సీఎన్‌జీ కార్ల లాగా ఫిల్లింగ్‌ స్టేషన్ల కోసం వెతకాల్సిన పని లేదు. పెట్రోల్‌ బంకుల్లాగా అన్ని చోట్ల సీఎన్‌జీ ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు లేకపోవడం ప్రధాన సమస్య. సీఎన్​జీతో పోలిస్తే పెట్రోల్ ధర ఎక్కువ. ఫలితంగా పెట్రోల్ వాహనాల నిర్వహణకు ఎక్కువ ఖర్చవుతుంది.

పెట్రోల్ vs సీఎన్​జీ ఏది బెటర్ ?
పెట్రోల్​తో నడిచే కార్లు అత్యాధునికమైనవి. మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. పెట్రోల్ కార్లు మెరుగైన పనితీరుతో మీ ప్రయాణాన్ని మరింత సాఫీగా మారుస్తాయి. కాగా, సీఎన్​జీ వేరియంట్ కార్ల నిర్వహణకు తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించి ఖర్చులను తగ్గించుకోవాలంటే సీఎన్​జీ వేరియంట్ మంచి ఆప్షన్ అవుతుంది. మీ ప్రయాణాలు, బడ్జెట్​ను బట్టి పెట్రోల్, సీఎన్​జీ వేరియంట్ కార్లలో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవాలి.

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

లాంఛ్​కు బజాజ్​ CNG బైక్ రెడీ- తక్కువ ధర, పవర్​ఫుల్ ఇంజిన్, స్టైలిష్ లుక్! - Bajaj Bruzer CNG Bike Launch

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.