ETV Bharat / business

కార్ లోన్ గడువుకు ముందే తీర్చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Car Loan Prepayment

Car Loan Prepayment : చాలా మంది అప్పు చేసి కారు కొంటుంటారు. అయితే మన దగ్గరకు అనుకోకుండా డబ్బు వచ్చి, ఆ కార్​ లోన్​ తీర్చేయాలనుకుంటే, అప్పుడు ఏం చేయాలి? ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Car Loan Prepayment
Car Loan Prepayment (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 11:18 AM IST

Car Loan Prepayment : కారు లోన్​ను గడువుకు ముందే, మొత్తంగా లేదా పాక్షికంగా చెల్లించాలనుకుంటే, ముందుగా రుణదాతకు ఆ విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొంతమేర అదనపు రుసుములు వసూలు చేస్తారని మర్చిపోవద్దు. కాబట్టి, ముందుగానే వీటి గురించి తెలుసుకుంటే మంచిది. అయితే ఇలాంటి పద్ధతులు బ్యాంకులు/ఆర్థిక సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. మిగిలిన లోన్​ మొత్తంపై ఒక శాతం నుంచి ఆరు శాతం వరకూ రుసుము ఉండొచ్చు.

  • ముందుగా మీ లోన్​ అగ్రీమెంట్​ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. గడువుకు ముందే రుణం తీర్చడానికి సంబంధించిన నిబంధనలు, షరతులు ఇందులో ఉంటాయి.
  • మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకోండి. ముందస్తు చెల్లింపు చేయడం వల్ల, మీ ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.
  • లోన్​ మొత్తం, దానిపై రుసుములు అన్నీ స్పష్టంగా తెలుసుకోండి.
  • ఏ రోజున మీరు చెల్లిస్తారన్నదీ రుణదాతకు స్పష్టంగా తెలియజేయండి.
  • రుణాన్ని పూర్తిగా తీర్చేసిన తర్వాత, రుణదాత నుంచి తగిన ధ్రువీకరణలను తీసుకోవడం మర్చిపోవద్దు.

అదనపు చెల్లింపులతో
కారు లోన్​కు నెలవారీ వాయిదాలతో పాటు అప్పుడప్పుడూ అదనంగా కొంత మొత్తం చెల్లించే ప్రయత్నమూ చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల వాహన రుణం 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుంటే, దీనికి నెలకు రూ.10,380 వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ.5,000 అదనంగా చెల్లించడం వల్ల లోన్​ను 4 ఏళ్ల 7 నెలల్లోనే తీర్చేయొచ్చు. దీని వల్ల మొత్తం వడ్డీ భారం దాదాపు రూ.10వేల వరకూ తగ్గుతుంది.

ఇవి చూసుకోండి

  • మీ దగ్గరున్న అదనపు నిధులను కారు లోన్ తీర్చడం కోసమే కాకుండా, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉందా చూసుకోండి. ముఖ్యంగా అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీర్చడానికి ప్రయత్నం చేయండి.
  • సాధారణంగా 12 నెలల వాయిదాలు చెల్లించిన తర్వాతే రుణాన్ని ముందుగా తీర్చేందుకు అనుమతిస్తారు. కాబట్టి, మిగతా వాయిదాల చెల్లింపు, రుసుముల భారం రెండూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటే మంచిది.
  • మీ రుణదాత అధిక వడ్డీ విధిస్తున్నారని మీకు అనిపిస్తే, మరో సంస్థకు మారే ప్రయత్నం చేయొచ్చు. దీనికి కొన్ని అదనపు రుసుములు తప్పవు.
  • కారు రుణాన్ని తొందరగా తీర్చేయాలంటే కొంత ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కొత్త వాహనాన్ని తీసుకునేటప్పుడే వడ్డీ రేట్లు, రుసుములు ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే కారు రుణం భారం కాదు.

మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing

లాంఛ్​కు బజాజ్​ CNG బైక్ రెడీ- తక్కువ ధర, పవర్​ఫుల్ ఇంజిన్, స్టైలిష్ లుక్! - Bajaj Bruzer CNG Bike Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.