Best Off Road Bikes : సరైన రోడ్లు లేని ప్రాంతాల్లో టూ-వీలర్స్ నడపడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గతుకుల రోడ్లపై, ఇసుక, కంకర, బురద, మంచు, రాళ్లురప్పలు లాంటి కఠినమైన ఉపరితలాలపై బైక్స్ నడపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా బైక్స్ త్వరగా పాడైపోతాయి కూడా. అందుకే ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీలు అన్నీ ఆఫ్-రోడ్ బైక్‌లను తయారు చేస్తున్నాయి. వీటిని డర్ట్ బైక్స్/ స్క్రాంబర్స్ అని కూడా అంటారు. వీటితో ఎలాంటి కఠినమైన రోడ్లపై అయినా చాలా సులువుగా డ్రైవ్ చేయవచ్చు. మరి మీరు కూడా ఇలాంటి బైక్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-10 ఆఫ్-రోడ్ బైక్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
1. BMW G310 GS : బీఎండబ్ల్యూ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ ఆఫ్‌రోడ్ బైక్ ఇది. దీనితో ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా, కొండలు, కోనల్లో అయినా హాయిగా దూసుకుపోవచ్చు. ఇది సింగిల్ వేరియంట్లో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 313 సీసీ
- పవర్ : 34 పీఎస్
- టార్క్ : 28 ఎన్ఎమ్
- మైలేజ్ : 29.26 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 169.5 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
BMW G310 GS Price : మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ బైక్ ధర సుమారుగా రూ.3.30 లక్షలు ఉంటుంది.
2. Yezdi Adventure : ఎలాంటి రోడ్లపై అయినా హాయిగా డ్రైవ్ చేయడానికి యోజ్డీ అడ్వెంచర్ అనుకూలంగా ఉంటుంది. ఇది 3 వేరియంట్లలో, 3 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 334 సీసీ
- పవర్ : 30.30 పీఎస్
- టార్క్ : 29.84 ఎన్ఎమ్
- మైలేజ్ : 33.07 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 198 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Yezdi Adventure Price : మార్కెట్లో ఈ యెజ్డీ అడ్వెంచర్ బైక్ ధర సుమారుగా రూ.2.16 లక్షలు - రూ.2.20 లక్షలు ఉంటుంది.
3. KTM 390 Adventure : మోస్ట్ పాపులర్ ఆఫ్-రోడ్ బైక్‌ల్లో కేటీఎం 290 అడ్వెంచర్ ఒకటి. ఇది రెండు వేరియంట్లలో, 4 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 373.27 సీసీ
- మైలేజ్ : 30 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
- ఫ్యూయెల్ కెపాసిటీ : 14.5 లీటర్స్
KTM 390 Adventure Price : మార్కెట్లో ఈ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్ ధర సుమారుగా రూ.3.39 లక్షలు నుంచి రూ.3.61 లక్షలు ఉంటుంది.
4. KTM 250 Adventure : మీడియం బడ్జెట్లో మంచి ఆఫ్-రోడ్ బైక్ కొనాలని అనుకునేవారికి కేటీఎం 250 అడ్వెంచర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది సింగిల్ వేరియంట్లో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 248.76 సీసీ
- పవర్ : 30 పీఎస్
- టార్క్ : 24 ఎన్ఎమ్
- మైలేజ్ : 38.12 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 177 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
KTM 250 Adventure Price : మార్కెట్లో ఈ కేటీఎం 250 అడ్వెంచర్ ధర సుమారుగా రూ.2.47 లక్షలు ఉంటుంది.
5. Hero XPluse 200T 4V : హీరో కంపెనీ విడుదల చేసిన బెస్ట్ ఆఫ్-రోడ్ బైక్ ఇది. తక్కువ ధరలోనే మంచి టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో, 3 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 199.6 సీసీ
- పవర్ : 19.1 పీఎస్
- టార్క్ : 17.3 ఎన్ఎమ్
- మైలేజ్ : 40 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 155 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Hero XPluse 200T 4V Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్‌ప్లస్ 200టీ 4వీ బైక్ ధర సుమారుగా రూ.1.40 లక్షలు ఉంటుంది.
6. Triumph Tiger 900 : ట్రయంఫ్ టైగర్ 900 బైక్ పేరుకు తగ్గట్లుగానే ఎలాంటి రోడ్లపై అయినా పులిలా దూసుకుపోతుంది. ఇది 2 వేరియంట్లలో, 6 రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
- ఇంజిన్ : 888 సీసీ
- పవర్ : 95.2 పీఎస్
- టార్క్ : 87 ఎన్ఎమ్
- మైలేజ్ : 19.23 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Triumph Tiger 900 Price : మార్కెట్లో ఈ ట్రయంఫ్ టైగర్ 900 బైక్ ధర సుమారుగా రూ.13.95 లక్షల నుంచి రూ.15.95 లక్షలు ఉంటుంది.
7. Kawasaki Versys 650 : ప్రస్తుతం లభిస్తున్న బెస్ట్ ఆఫ్-రోడ్ బైక్‌ల్లో కవాసకి వెర్సిస్ 650 ఒకటి. ఇది సింగిల్ వేరియంట్లో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 649 సీసీ
- పవర్ : 66 పీఎస్
- టార్క్ : 61 ఎన్ఎమ్
- మైలేజ్ : 20 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 219 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Kawasaki Versys 650 Price : మార్కెట్లో ఈ కవాసకి వెర్సిస్ 650 బైక్ ధర సుమారుగా రూ.7.77 లక్షలు ఉంటుంది.
8. Benelli TRK 251 : మీడియం బడ్జెట్లో మంచి ఆఫ్-రోడ్ బైక్ కొనాలని అనుకునేవారికి బెనెల్లీ టీఆర్కే 251 బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది సింగిల్ వేరియంట్లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 249 సీసీ
- పవర్ : 25.8 పీఎస్
- టార్క్ : 21.1 ఎన్ఎమ్
- మైలేజ్ : 31.81 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 164 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Benelli TRK 251 Price : మార్కెట్లో ఈ బెనెల్లీ టీఆర్కే 251 బైక్ ధర సుమారుగా రూ.2.89 లక్షలు ఉంటుంది.
9. Honda CRF1100L Africa Twin : హెవీ బడ్జెట్ పెట్టగలవారు హోండా సీఆర్ఎఫ్ 1100ఎల్ ఆఫ్రికా ట్విన్‌పై ఓ లుక్కేయవచ్చు. ఇది 2 వేరియంట్లలో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిపై కొండలు, కోనలు, నదులు, వాగుల్లోనూ (నీరు తక్కువగా ఉన్నప్పుడు) దూసుకుపోవచ్చు అని కంపెనీ చెబుతోంది.
- ఇంజిన్ : 1082.96 సీసీ
- పవర్ : 99.2 పీఎస్
- టార్క్ : 103 ఎన్ఎమ్
- మైలేజ్ : 20 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 249 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Honda CRF1100L Africa Twin Price : మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారుగా రూ.15.97 లక్షల నుంచి రూ.17.51 లక్షలు ఉంటుంది.
10. Aprilia Tuareg 660 : అడ్వెంచర్ రైడింగ్ ఇష్టపడేవారు, ఎంత ఖర్చు అయినా భరించగలిగేవాళ్లు ఈ అప్రిలియా టువరెగ్ 660పై ఓ లుక్కేయవచ్చు. ఇది 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 659 సీసీ
- పవర్ : 80.21 పీఎస్
- టార్క్ : 70 ఎన్ఎమ్
- కెర్బ్ వెయిట్ : 204 కేజీ
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
Aprilia Tuareg 660 Price : మార్కెట్లో ఈ అప్రిలియా టువరెగ్ 660 బైక్ ధర సుమారుగా రూ.18.85 లక్షల నుంచి రూ.19.16 లక్షలు ఉంటుంది.