Best Mileage Scooters : స్కూటర్లు స్త్రీ, పురుషులు ఇద్దరికీ చాలా అనువుగా ఉంటాయి. పైగా రద్దీగా ఉండే రోడ్లపై కూడా స్కూటీతో చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు. ఇరుకైన సందుల్లో కూడా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. అందుకే స్కూటర్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరి మీరు కూడా మంచి స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల బడ్జెట్లో లభిస్తున్న మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Yamaha RayZR 125 Fi Hybrid Features : యమహా కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటర్లలో ఈ RayZR 125 ఒకటి. రూ.1 లక్ష బడ్జెట్లోపు మంచి టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 125 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.2 PS@6000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.3 Nm@5000 rpm
- మైలేజ్ : 71.33 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- గేర్స్ : వీ-బెల్ట్ ఆటోమేటిక్
- కెర్బ్ వెయిట్ : 99 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Yamaha RayZR 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ ధర సుమారుగా రూ.87,295 నుంచి రూ.97,264 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Yamaha Fascino 125 Fi Hybrid Features : ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఒక లక్ష రూపాయల లోపు మంచి స్కూటీ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- ఇంజిన్ : 125 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.2 PS@6500 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.3 Nm@5000 rpm
- మైలేజ్ : 68.75 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- గేర్స్ : వీ-బెల్ట్ ఆటోమేటిక్
- కెర్బ్ వెయిట్ : 99 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Yamaha Fascino 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటీ ధర సుమారుగా రూ.84,088 - రూ.94,561 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Honda Activa 125 Features : ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 125 ఒకటి. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.30 PS@6250 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.4Nm@5000 rpm
- మైలేజ్ : 60కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 109 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ ధర సుమారుగా రూ.84,718 నుంచి రూ.93,890 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. TVS NTORQ 125 Features : స్టైలిష్ డిజైన్‌తో, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ ఎన్‌టార్క్ 125. ఇది చాలా స్ట్రాంగ్‌గా, డ్రైవింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.51 PS@7000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.6Nm@5500 rpm
- మైలేజ్ : 53.4 - 56.23 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.8 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 109 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.88,333 నుంచి రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
5. Hero Destini Prime Features : రూ.80వేలు లోపు మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి హీరో డెస్టినీ ప్రైమ్ మంచి ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.09 PS@7000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.38Nm@5500 rpm
- మైలేజ్ : 56 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5 లీటర్స్
- గేర్స్ : వేరియామాటిక్ డ్రైవ్
- కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Hero Destini Prime Price : మార్కెట్లో ఈ హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ ధర సుమారుగా రూ.79,548 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
6. Suzuki Avenis Features : సుజుకి కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీల్లో 'అవెనిస్' ఒకటి. ఇది మంచి హ్యాండ్సమ్ లుక్‌తో ఉంటుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.7 PS@6750 rpm
- మ్యాక్స్ టార్క్ : 10 Nm@5500 rpm
- మైలేజ్ : 55 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- కెర్బ్ వెయిట్ : 106 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Suzuki Avenis Price : మార్కెట్లో ఈ సుజుకి అవెనిస్ స్కూటర్ ధర సుమారుగా రూ.97,675 నుంచి రూ.98,746 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
7. Vespa SXL 125 Features : కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు అనుకునేవాళ్లు వెస్పా SXL 125 స్కూటీపై ఓ లుక్కేయవచ్చు. ట్రెడిషనల్ లుక్స్‌తో డ్రైవ్ చేయడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
- ఇంజిన్ : 124.45 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.78 PS@7400 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.11 Nm@5600 rpm
- మైలేజ్ : 55 కి.మీ/ లీటర్
- టాప్ స్పీడ్ : 90 కి.మీ/ గంట
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Vespa SXL 125 Price : మార్కెట్లో ఈ వెస్పా SXL 125 స్కూటర్ ధర సుమారుగా రూ.1.35 లక్షలు - రూ.1.41 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
8. TVS Jupiter 125 Features : టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీల్లో జూపిటర్ 125 ఒకటి. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.15 PS@6500 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.5 Nm@4500 rpm
- మైలేజ్ : 52.91 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.1 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 108 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.92,235 - రూ.1.01 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
9. Honda Active 6G Features : భారతదేశంలో మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. రూ.90 వేలు లోపు మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- ఇంజిన్ : 109 సీసీ
- మ్యాక్స్ పవర్ : 7.84 PS@8000 rpm
- మ్యాక్స్ టార్క్ : 8.90 Nm@5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
- గేర్స్ : సీవీటీ
- కెర్బ్ వెయిట్ : 105 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
Honda Active 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.80,334 - రూ.86,834 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
10. TVS XL 100 Features : చిరువ్యాపారులకు ఉపయోగపడే బెస్ట్ టూ-వీలర్ ఈ టీవీఎస్ XL100. ఇది చాలా తక్కువ బరువు ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
- ఇంజిన్ : 99 సీసీ
- మ్యాక్స్ పవర్ : 4.35 PS@6000 rpm
- మ్యాక్స్ టార్క్ : 6.5 Nm@3500 rpm
- మైలేజ్ : 80 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 4 లీటర్స్
- గేర్స్ : సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్
- కెర్బ్ వెయిట్ : 89 కేజీలు
- టైర్ టైప్ : ట్యూబ్
TVS XL 100 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ XL 100 ధర సుమారుగా రూ.44,999 నుంచి రూ.64,169 (ఎక్స్-షోరూం) ఉంటుంది.