Best Bikes Under 70000 : మంచి బైక్ కొనుక్కోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. అయితే బడ్జెట్ సమస్య వాళ్లను ఇబ్బందిపెడుతుంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ ధరలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.70,000 బడ్జెట్లో ఉన్న టాప్-5 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5. Bajaj Platina 100 Features : ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న సరసమైన (ఎఫర్డబుల్) బైక్‌లలో బజాజ్ ప్లాటినా 100 ఒకటి. ఈ టూ-వీలర్లో 102 సీసీ సామర్థ్యం ఉన్న మోటార్‌ను అమర్చారు. ఇది డీటీఎస్-ఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ మోటార్ ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో కాకుండా ఈ-కర్బ్తో పనిచేస్తుంది. ఈ మోటార్ 7.9 హెచ్‌పీ పవర్, 8.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
Bajaj Platina 100 Price : మార్కెట్లో ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.67,808 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Honda Shine 100 Features : భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభిస్తున్న బైక్‌ల్లో హోండా షైన్ 100 ఒకటి. ఈ బైక్ ఆటో చోక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్లను కలిగి ఉంది. ఓబీడీ-2ఏ కంప్లైంట్, ఈ20 కంపాటిబిలిటీ ఉన్న ఏకైక ఎఫర్డబుల్ బైక్ ఇదే.
ఈ హోండా షైన్ 100 బైక్‌లో 99.7 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7.61 హెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దేశంలోని అత్యంత సరమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్ బైక్ ఇది.
Honda Shine 100 Price : మార్కెట్లో ఈ హోండా షైన్ 100 బైక్ ధర సుమారుగా రూ.64,900 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. TVS Sport Features : అత్యంత తక్కువ ధరలో మంచి బైక్ కొనాలని అనుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్‌లో 109.7 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 8.3 హెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో కిక్ స్టార్టర్, సెల్ఫ్-స్టార్టర్ వేరియంట్లు ఉన్నాయి.
TVS Sport Price : మార్కెట్లో ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర సుమారుగా రూ.61,500 నుంచి రూ.69,873 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Hero HF Deluxe Features : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి. దీనిలో 97 సీసీ సామర్థ్యం ఉన్న 'స్లోపర్' ఇంజిన్ ఇంది. ఇది ఐ3ఎస్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8.02 పీఎస్ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో కిక్ స్టార్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
Hero HF Deluxe Price : మార్కెట్లో ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర సుమారుగా రూ.59,998 నుంచి రూ.68,768 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1. Hero HF 100 Features : ఇండియాలో ఎక్కువ మంది కొన్న బైక్‌ల్లో హోరో హెచ్ఎఫ్ 100 ఒకటి. అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్న టూ-వీలర్ ఇది. ఈ బైక్‌లో 97 సీసీ సామర్థ్యం కలిగి ఇంజిన్ ఉంది. ఇది 8 హెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఐ3ఎస్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీతో పని చేస్తుంది. అయితే దీనితో కిక్-స్టార్టర్ వేరియంట్ కూడా ఉంది.
Hero HF 100 Price : మార్కెట్లో ఈ హీరో హెచ్ఎఫ్ 100 బైక్ ధర సుమారుగా రూ.59,068 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీటిపైనా ఓ లుక్కేయవచ్చు!
ఇండియన్ మార్కెట్లో హీరో స్ల్పెండర్, టీవీఎస్ రేడియన్ లాంటి బైక్‌లు కూడా మోస్ట్ పాపులర్. వీటిపైనా మీరు ఓ లుక్కేయవచ్చు. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ లిస్ట్‌లో వీటిని చేర్చలేదు.
కొత్త కారు కొనాలా? కంఫర్ట్ కాదు సేఫ్టీయే ముఖ్యం- ఈ 6 ఫీచర్లు ఉంటేనే!
మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యిందా? సింపుల్‌గా రెన్యువల్ చేసుకోండిలా!