ETV Bharat / business

రోజు రూ.18 పొదుపుతో - రూ.3 లక్షల బెనిఫిట్ ​- చిన్నారుల కోసం సూపర్​ స్కీమ్​! - Bal Jeevan Bima Yojana Scheme

Bal Jeevan Bima Yojana Scheme : మీ పిల్లల పేరు మీదు పొదుపు చేయడానికి మంచి స్కీమ్ కోసం వెతుకుతున్నారా? అది కూడా పొదుపు ప్రయోజనాలతో పాటు బీమా సౌకర్యం కల్పించే ప్లాన్ కావాలనుకుంటున్నారా? అయితే, మీకోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ఒకటి ఉంది. అదే.. బాల్ జీవన్ బీమా యోజన పథకం. ఇందులో కేవలం రోజుకు గరిష్ఠంగా రూ. 18 చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 3 లక్షలు వస్తాయ్. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

POST OFFICE SAVING SCHEME
Bal Jeevan Bima Yojana Scheme ((Etv Bharat))
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 12:16 PM IST

Bal Jeevan Bima Yojana Scheme Benefits : నేటి ఆధునిక యుగంలో ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. ఎంత పొదుపు చేస్తున్నామన్నదే చాలా కీలకం. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి పేరు మీద పొదుపు ప్రారంభించడం చాలా ఉత్తమమైన నిర్ణయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతుంటాయి. ప్రధానంగా వారి చదువుల కోసం లక్షలు పోయాల్సి వస్తే.. పుస్తకాలు, యూనిఫార్మ్ వంటి ఇతర వాటికోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావొచ్చంటున్నారు నిపుణులు.

కాబట్టి, పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే వారి పేరు మీద ఏదైనా స్కీమ్​లో పొదుపు స్టార్ట్ చేయండని సలహా ఇస్తున్నారు. అందుకోసం వందలు, వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. 'ఇండియన్ పోస్టాఫీస్'(Post Office) అందిస్తున్న ఈ పథకంలో కేవలం రోజుకు 6 రూపాయలు పొదుపు చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారంటున్నారు. అదే.. 18 రూపాయలు పొదుపు చేస్తే 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇంతకీ, ఏంటి ఆ పథకం? అర్హతలేంటి? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? ఈ స్కీమ్​లో ఎలా చేరాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియన్ పోస్టాఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన ఆ స్కీమ్ పేరు.. బాల్ జీవన్​ బీమా పథకం(Bal Jeevan Bima Scheme). ఈ స్కీమ్​లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు.. వారి ఆర్థిక స్తోమతను బట్టి కనిష్ఠంగా రోజుకు రూ. 6, గరిష్ఠంగా రూ. 18 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద ఈ పొదుపును స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బాల్​ జీవన్ బీమా పథకంలో 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లల వరకు పేరెంట్స్ పొదుపు చేయవచ్చు. అయితే ఈ స్కీమ్​లో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు.

రూ. 18తో రూ. 6 లక్షల రాబడి! : ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే బాలా జీవన్​ బీమా పథకం కింద ప్రయోజం అందుతుంది. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారు కనీసం రోజుకు 6 రూపాయలు పొదుపు చేస్తే.. మెచ్యూరిటీ ముగిశాక కనీస హామీ మొత్తం లక్ష రూపాయల వరకు రాబడి అందుతుంది. అదే గరిష్ఠంగా.. రోజుకు 18 రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ ముగిశాక రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఇకపోతే.. మీరు ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ. 36(ఒక్కొక్కరికి రూ.18) పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.

10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్​ స్కీమ్​! - Post Office RD Scheme

ఈ పథకానికి సంబంధించిన మరికొన్ని వివరాలు :

  • పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు 45 ఏళ్లు మించకూడదు.
  • పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే.. ఆ టైమ్​లో ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు.
  • పాలసీ ప్రీమియాన్ని పేరెంట్స్ చెల్లించాలి. ఈ పాలసీ మీద రుణ ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఒకవేళ పాలసీ నుంచి మధ్యలో వైదొలగాలనుకుంటే.. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది.
  • రూ. 1000 ప్రతి సంవత్సరం హామీ మొత్తం మీద రూ. 48 బోనస్ ఇస్తారు.

మీరు మీ పిల్లల పేరు మీద బాల్ జీవన్ బీమా యోజన పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ముందు సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారులను సంప్రదించి ​ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి. అనంతరం అప్లికేషన్​ ఫామ్‌లో.. మీ పిల్లల గురించి పూర్తి వివరాలు నమోదు చేయండి. అంతేకాకుండా.. పాలసీదారుడి(మీ) వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించి.. అకౌంట్​ను ఓపెన్ చేయండి.

Note: పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వాణిజ్య రంగ నిపుణులు సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఈ ప్లాన్​లో పెట్టుబడి పెట్టేముందు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్​ చేయడం మంచిది.

మ్యూచువల్ ఫండ్స్​లో పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.