Anant Ambani Radhika Sangeet : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ సంగీత్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబానీ కుటుంబం డ్యాన్స్
ఆ ప్రత్యేక వీడియోలో ముకేశ్, ఆయన సతీమణి నీతా అంబానీ కలిసి తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి కారు షికారు చేస్తూ కన్పించారు. వింటేజ్ ఓపెన్ టాప్ కారులో ముకేశ్ అంబానీ డ్రైవింగ్ చేస్తున్నారు. నీతా అంబానీ మనవళ్లు పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద పక్కన కూర్చున్నారు. అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన 'బ్రహ్మచారి' చిత్రంలోని 'చక్కే మే చక్కా' పాటను పాడుతూ వారు షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్‌లో ప్రదర్శించారు. ఇక ఈ సంగీత్ వేడుకల్లో అంబానీ కుటుంబమంతా కలిసి డాన్స్‌లు చేశారు. అదే ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా 'ఓం శాంతి ఓం'లోని 'దీవాంగీ దీవాంగీ' పాటకు ముకేశ్-నీతా, ఆకాశ్-శ్లోకా, ఈశా-ఆనంద్ పిరమాల్, అనంత్-రాధిక ఆడిపాడారు. నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యం స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
Nita and Mukesh Ambani and their absolutely adorable grandchildren Prithvi, Aadiya, Krishna and Veda set the tone for the #FamilySangeet celebrations of Anant and Radhika! #ARWeddingCelebrations #AnantAmbani #RadhikaMerchant #NitaAmbani pic.twitter.com/HJo7N6WGnK
— Pankaj Upadhyay (@pankaju17) July 6, 2024
Ambani family on stage, grooving to the popular Deewangi Deewangi song, as the grand finale of the family sangeet celebrations for Anant and Radhika Wedding Festivities#FamilySangeet#ARWeddingCelebrations #AnantAmbani #RadhikaMerchant #NitaAmbani #MukeshAmbani pic.twitter.com/U7nKjzjYcO
— Pankaj Upadhyay (@pankaju17) July 6, 2024
సల్మాన్‌తో కలిసి అనంత్ స్టెప్పులు
అనంత్- రాధిక సంగీత్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలతో సహా క్రికెట్లు వచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా ఆడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్, ధోనీ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్, కిషన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి అనంత్ అంబానీ స్టెప్పులేశారు. పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఇందులో ప్రదర్శన ఇచ్చారు. అందు కోసం రూ.83 కోట్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. జులై 12-14 తేదీల్లో ముంబయిలోని జియో సెంటర్ వేదికగా అనంత్-రాధిక వివాహం జరగనుంది. జులై 12న శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభమై జులై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం, జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో ముగుస్తాయి.
#WATCH | Cricketers Hardik Pandya, Krunal Pandya and Ishan Kishan arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/bLy33tmZB8
— ANI (@ANI) July 5, 2024