Anant Ambani Radhika Wedding : ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలోని అంబానీ నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం జులై 3న(బుధవారం) 'మామెరు' వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. వరుడు అనంత్ అంబానీ, వధువు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు మామెరు వేడుక నిర్వహిస్తారు.
#WATCH | Visuals of Mosalu Ceremony ahead of the wedding of Anant Ambani with Radhika Merchant, in Mumbai, attended by Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and her husband Mukesh Ambani. pic.twitter.com/L4p9fF0yqj
— ANI (@ANI) July 4, 2024
వధూవరులను ఆశీర్వరించిన కుటుంబ సభ్యులు
అనంత్ అంబానీ తల్లి అయిన నీతా అంబానీ పుట్టింటి వారు 'మామెరు' వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు.
#WATCH | Mumbai: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and husband Mukesh Ambani take part in the Mameru Ceremony ahead of the wedding of their son Anant Ambani with Radhika Merchant. pic.twitter.com/rSb3elHDOv
— ANI (@ANI) July 3, 2024
పూలతో ఇల్లు అలంకరణ
అనంత్, రాధిక 'మామెరు' వేడుక కోసం అంబానీ నివాస భవనం యాంటిలియాను అందంగా తీర్చిదిద్దారు. ఎరుపు, గులాబీ, నారింజ పూలతో అలంకరించారు. దీని అందాన్ని మరింత పెంచేందుకు బంగారు దీపాలు కూడా ఏర్పాటు చేశారు. అనంత్, రాధిక క్యారికేచర్లతో కూడిన డిజిటల్ స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందులో 'ఆల్ ది బెస్ట్' అని రాసి ఉంది. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#WATCH | Visuals of Mosalu Ceremony ahead of the wedding of Anant Ambani with Radhika Merchant, in Mumbai, attended by Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and her husband Mukesh Ambani.
— ANI (@ANI) July 4, 2024
Mosalu is a traditional ceremony celebrated in Gujarati culture a few… pic.twitter.com/ubTOcOf4ES
అనంత్- రాధిక పెళ్లి ఫుల్ షెడ్యూల్ ఇదే
- జులై 12 నుంచి మూడు రోజుల పాటు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగనున్నాయి.
- జులై 12న ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. ఈ వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి హాజరుకానున్నారు.
- జులై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు కూడా అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులతో రానున్నారు.
- జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకలకు అతిథులు ఇండియన్ చిక్ డ్రెస్ కోడ్‌తో హాజరవ్వనున్నారు.
ఇప్పటివరకు అనంత్-రాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి వేడుక ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అనంత్- రాధిక వివాహ కార్యక్రమంలో భాగంగా జులై 2న పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్ ను అందించారు.
సంగీత్ వేడుకలో పాప్‌స్టార్
అనంత్ -రాధిక వివాహ వేడుకల్లో పాప్‌స్టార్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం ముంబయికి వచ్చినట్లు సమాచారం.
ఏడాదికి కోటి పెళ్లిళ్లు - రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్‌లో అట్లుంటది మరి! - Indian Wedding Costs