ETV Bharat / business

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు షురూ- 51వేల మందికి అన్నసేవ- రాధికనే స్పెషల్ అట్రాక్షన్​! - Anant Ambani Radhika marrriage

Anant Ambani Radhika Merchant Anna Seva : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. జామ్‌నగర్‌లోని ఓ గ్రామంలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్న సేవతో ప్రారంభమయ్యాయి. స్థానికులకు అంబానీ కుటుంబం ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.

Anant Ambani Radhika Merchant Anna Seva
Anant Ambani Radhika Merchant Anna Seva
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 8:48 AM IST

Updated : Feb 29, 2024, 9:25 AM IST

Anant Ambani Radhika Merchant Anna Seva : 'ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి' అన్నట్టుగా భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. ముకేశ్‌, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతుండటం టాక్‌ ఆఫ్ ది వరల్డ్​గా మారిపోయింది. తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

స్వయంగా వడ్డించిన అనంత్​, రాధిక
గుజరాత్​ జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు 'అన్న సేవ'తో ప్రారంభమయ్యాయి. ముకేశ్, అనంత్, రాధిక సహా అంబానీ కుటుంబసభ్యులు గ్రామస్థులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని స్వయంగా వడ్డించారు.

Anant Ambani Radhika Merchant Anna Seva
అన్న సేవలో అనంత్ అంబానీ
Anant Ambani Radhika Merchant Anna Seva
అన్న సేవలో రాధికా మర్చంట్

51 వేల మందికి విందు
ఈ కార్యక్రమంలో రాధికా మర్చంట్ అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా పాల్గొన్నారు. సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమం కొద్ది రోజులపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అన్న సేవ అనంతరం సంప్రాదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు స్థానికులు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గఢ్వీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Anant Ambani Radhika Merchant Anna Seva
భోజనం వడిస్తున్న ముకేశ్, అనంత్

1000 మంది ప్రముఖులు
అయితే జులైలో అనంత్- రాధిక వివాహం జరగనుండగా, జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్‌, ఎంఎస్‌ ధోనీ తదితరులు ఉన్నారు.

నో రిపీట్
మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తోపాటు అనేక మంది ప్రముఖులు రానున్నారు. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది అంబానీ కుటుంబం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్‌ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కళాకారులకు పెద్ద పీట!
అయితే అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో రాజస్థాన్​ కళాకారులకు స్థానం దక్కింది. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్ వంటి 1000 మంది ప్రముఖల ఎదుట వారు తమ కళను ప్రదర్శించనున్నారు. రాజస్థాన్​ జయపుర బ్లూ పోటరీ ఆకృతులను గరిమా నీలిమ జామనగర్​లో ప్రదర్శించనున్నారు. ఇంతకుముందు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తండ్రి గోపాల్ కూడా బ్లా పోటరీ కళను ప్రదర్శించారు. మొఘులుల కాలంలో ఈ కళను సంగీత్ సాజ్​ అని పిలవగా, ఆ తర్వాత బ్లూ పోటరీ పేరుతో ప్రసిద్ధి చెందింది.

Anant Ambani Radhika Merchant Anna Seva
బ్లా పోటర్ కళాకృతులతో గోపాల్, గరీమా

గిఫ్ట్​లుగా బాబులాల్ ఆకృతులు
పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న మినియేచర్ ఆర్టిస్ట్ బాబులాల్ మరోథియా పెయింటింగ్స్​ను అతిథులకు కానుకలుగా అంబానీ కుటుంబం అందించనుంది. ప్రముఖ డిజైనర్ అరుణ్ పబువాల్ రూపొందించిన ఆహార ప్లేట్లు, కట్లరీని జయపుర నుంచి జామ్​నగర్​ వెళ్లనున్నాయి. పబువాల్​ కంపెనీకి చెందిన 100 మందికిపైగా నాలుగు నెలలపాటు శ్రమించి వీటిని తయారు చేశారు. పబువాల్ గ్రూప్ ఇప్పటికే 1987, 1996 ప్రపంచకప్ టోర్నీల ట్రోఫీలను రూపొందించింది. ఇటీవల దిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా వెండి పూతతో ప్లేట్లు, కట్లరీని తయారు చేసింది.

Anant Ambani Radhika Merchant Anna Seva
పబువాల్ కంపెనీ రూపొందించిన సామగ్రి

అనంత్‌, రాధిక నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. ముకేశ్‌-నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్‌, అనంత్. వీరు గత కొన్నేళ్లుగా రిటైల్, డిజిటల్ సేవలు, నూతన ఇంధనం సహా రిలయన్స్‌ కీలక వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. అనుబంధ సంస్థల బోర్డుల్లోనూ సేవలందిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణకు ఈశా నేతృత్వం వహిస్తున్నారు. ఆకాశ్‌ అంబానీ జూన్ 2022 నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అనంత్‌ నూతన ఇంధనం, మెటీరియల్ వ్యాపారాల విస్తరణను పర్యవేక్షిస్తున్నారు. ఈశాకు 2018లో, ఆకాశ్‌కు 2019లో వివాహం జరిగింది. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి జరగనుంది.

'మా నాన్న, తాత కర్మభూమి- అందుకే జామ్‌నగర్​ను ఎంచుకున్నాం'- ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ అంబానీ

అదిరిపోయేలా అంబానీ ప్రీవెడ్డింగ్!​- కళ్లు చెదిరే ఈవెంట్లు, స్పెషల్​ సర్​ప్రైజ్​లు- అబ్బో చాలా ఉన్నాయ్! ​

Last Updated : Feb 29, 2024, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.