ETV Bharat / business

అమూల్‌ పాల ధరల పెంపు - లీటర్‌పై ఎంత పెరిగిందంటే? - Amul Milk Price Hike

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 10:40 AM IST

Updated : Jun 3, 2024, 10:54 AM IST

Amul Milk Price Hike : అమూల్ పాల ప్యాకెట్ల ధరలను పెంచుతూ గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే పాల ధరల్ని సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. జూన్​ 3 నుంచే ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Amul Milk packet Prices today
Amul Milk Price Hike (Getty Images)

Amul Milk Price Hike : అమూల్‌ పాల ధరలు పెంచినట్లు గుజరాత్ కో-ఆపరేటివ్​ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) తెలిపింది. ఒక్కో లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచినట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి అన్ని రకాల వేరియంట్లపై కూడా ఈ పెంపు వర్తిస్తుందని అమూల్ పేర్కొంది.

గుజరాత్ కో-ఆపరేటివ్​ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ - అమూల్​ బ్రాండ్​ పేరుతో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. ఇంతకు ముందు 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా అమూల్​ పాల ధరలను సవరించింది.

నేటి నుంచే
పెరిగిన అమూల్​ పాల ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు భారీగా పెరగడం వల్లనే ధరల్ని సవరించాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్​ తెలిపింది. అంతేకాదు తమ అనుబంధ పాల సంఘాలు - రైతులకిచ్చే పరిహారాన్ని గత సంవత్సర కాలంలో ఏకంగా 6-8 శాతం వరకు పెంచినట్లు పేర్కొంది. తాజా పెంపు వల్ల పాడి రైతులకు మరింత మెరుగైన ధరలు కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది. దీని వల్ల పాడి రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ధరల పెంపు ఎఫెక్ట్​ - ప్రస్తుతం లీటర్‌ పాల ధర ఎంతంటే?

  • అమూల్‌ తాజా - రూ.56
  • అమూల్‌ గోల్డ్‌ - రూ.68
  • అమూల్‌ ఆవు పాలు - రూ.57
  • అమూల్‌ ఏ2 గేదె పాలు - రూ.73

ధరల పెంపు ఎఫెక్ట్​తో, లీటర్ 'అమూల్​ తాజా'​ పాల ప్యాకెట్ ధర రూ.54 నుంచి రూ.56లకు పెరిగింది. అమూల్​ గోల్డ్ ధర రూ.66 నుంచి రూ.68లకు చేరింది. అయితే అమూల్​ ఆవు పాలపై మాత్రం కేవలం రూ.1 మాత్రమే పెంచారు. అందువల్ల లీటర్ అమూల్ ఆవు పాల ధర రూ.57 అయ్యింది. గేదె పాల ధరను ఏకంగా రూ.3 పెంచారు. అందువల్ల లీటర్ గేదె పాల ధర రూ.70 నుంచి రూ.73కు పెరిగింది.

అర లీటర్​ పాల ప్యాకెట్ ధరలు

  • 500 ml అమూల్​ గేదె పాలు - రూ.36
  • 500 ml అమూల్ గోల్డ్ మిల్క్ - రూ.33
  • 500 ml అమూల్​ శక్తి మిల్క్​ - రూ.30

మదర్స్ డెయిరీ పాల ధరలూ పెరిగాయ్​!
మదర్స్ డెయిరీ పాల ధరలు కూడా లీటర్​కు రూ.2 చొప్పున పెరిగాయి. గత 15 నెలలుగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో, పాల ధరలను పెంచినట్లు మదర్ డెయిరీ తెలిపింది. దిల్లీ-ఎన్​సీఆర్ సహా అన్ని మార్కెట్లలోనూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ధరల పెంపుతో ప్రస్తుతం లీటర్‌ పాల ధర ఎంతంటే?

  • ఫుల్ క్రీమ్​ మిల్క్ - రూ.68
  • టోన్డ్ మిల్క్​ - రూ.56
  • డబుల్ టోన్డ్​ మిల్క్ - రూ.50
  • గేదె పాలు - రూ.72
  • ఆవు పాలు - రూ.58
  • టోకెన్ మిల్క్ - రూ.54

నోట్ : లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అమూల్​, మదర్ ఇండియా డెయిరీలు తమ పాల ధరలను పెంచడం గమనార్హం.

గుడ్ న్యూస్​ - భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

కనీ, వినీ ఎరుగని లాభాల్లో స్టాక్ మార్కెట్లు - ఆల్​ టైమ్ హైరికార్డ్ క్రాస్ చేసిన సెన్సెక్స్ & నిఫ్టీ! - Stock Market Today

Last Updated : Jun 3, 2024, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.