Top Brand Deals During Amazon Prime Day Sale 2024 : ప్రముఖ ఇ - కామర్స్ దిగ్గజం అమెజాన్.. తమ కస్టమర్ల కోసం "ప్రైమ్ డే సేల్" ను ప్రకటించింది. జులై 20&21న అంటే రెండు రోజుల పాటు భారీ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించనుంది. ప్రముఖ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అతి తక్కువ ధరలతో పాటు వేగవంతమైన డెలివరీ ఈ సేల్ స్పెషాలిటీ. మరి ఈ సేల్‌లో ఏ ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు : ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో Oneplus, POCO స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంటుందని అమెజాన్ సంస్థ తెలిపింది. హై రిజల్యూషన్ కెమెరాలు, స్పీడ్ ప్రాసెసర్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వచ్చే Oneplus స్మార్ట్‌ఫోన్‌లు ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ.18,999ల నుంచి ప్రారంభమవుతాయి. అలాగే POCO స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అద్భుతమైన డీల్‌లను ఈ సందర్భంగా వెల్లడించింది. ఇవి రూ. 6,799 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.
ల్యాప్‌టాప్‌లు : ప్రస్తుత కాలంలో విద్యార్థులకు, ఉద్యోగస్థులకు ల్యాప్‌టాప్‌ల అవసరం చాలా ఉంది. అయితే ల్యాప్‌టాప్ కొనాలనే కోరికను ఈ సేల్ ద్వారా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఈ ప్రైమ్ డే సేల్‌లో కొన్ని కంపెనీల ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది. అందులో ఇంటెల్ కోర్ అల్ట్రా ల్యాప్‌టాప్‌లపై - 35% వరకు తగ్గింపు ఉండగా.. HP, డెల్, ఆసుస్, ఏసర్ వంటి ల్యాప్‌టాప్స్‌పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుంది.
స్మార్ట్ టీవీలు : తక్కువ ధరకే మంచి స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వివిధ కంపెనీల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌండ్ లభించనుంది. LG స్మార్ట్ టీవీలపై గరిష్ఠంగా 30% తగ్గింపు కాగా, TCL QLED టీవీలుపై 60%, Hisense Smart TVలపై గరిష్ఠంగా 50%, Samsung Smart TVలపై గరిష్ఠంగా 40% వరకు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర కంపెనీల టెలివిజన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
డైపర్స్ : చిన్న పిల్లలు సౌకర్యవంతంగా నిద్రపోవడానికి డైపర్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన డైపర్స్‌పై భారీగానే డిస్కౌంట్లు ఉన్నాయి. అందులోనూ ప్యాంపర్స్ డైపర్స్‌పై గరిష్ఠంగా 50% వరకు తగ్గింపును సంస్థ అందించనుంది.
లాండ్రీ డిటర్జెంట్లు : దుస్తులు ఫ్రెష్‌గా, పరిశుభ్రంగా ఉండటానికి లాండ్రీ డిటర్జెంట్లు బాగా పనిచేస్తాయి. అయితే, అమెజాన్ ప్రై డే సేల్‌లో భాగంగా ఏరియల్ లాండ్రీ డిటర్జెంట్లపై గరిష్ఠంగా 25% వరకు లభిస్తుందని సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
ఫ్యాషన్ : బ్రాండెడ్ హెయిర్ కేర్ ప్రొడక్టులపై కూడా ఈ ప్రైమ్ డే సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా డవ్ బెస్ట్ సెల్లర్స్ ప్రాడక్ట్స్‌పై గరిష్ఠంగా 35% వరకు తగ్గింపు ధర లభించనుంది.
ఇవీ కూడా చదవండి :