ETV Bharat / business

మొబైల్​ రీఛార్జ్ అయిపోయిందా? 'ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌' తీసుకోండిలా! - Airtel Emergency Validity Loan

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 11:48 AM IST

Airtel Emergency Validity Loan : ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఎయిర్​టెల్​ మరో ముందడుగు వేసింది. తాజాగా 'ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌' వసతిని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎయిర్​టెల్ యూజర్లు 1.5 జీబీ డేటాతో పాటు అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​ సదుపాయాన్నీ పొందవచ్చు. ప్రీపెయిడ్​ ప్లాన్​ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్​ చేసుకోలేని వారికి ఇది గుడ్​న్యూసే. ఈ లోన్​ స్కీం గురించి పూర్తి వివరాలివి.

How To Get Emergency Loan In Airtel
How to get Airtel Emergency data loan

Airtel Emergency Validity Loan : ప్రీపెయిడ్​ మొబైల్​ రీఛార్జ్ ప్లాన్లలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చే దిశగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్​ అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ కస్టమర్లకు డేటాను అప్పుగా ఇస్తున్న ఎయిర్​టెల్​ మరో ముందడుగు వేసింది. తాజాగా 'ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌' వసతిని అందుబాటులోకి తెచ్చింది. యాక్టివ్‌గా ఉన్న ప్రీపెయిడ్​ రీఛార్జ్​ ప్లాన్​ గడువు ముగిసిన వెంటనే అత్యవసరం కోసం 'వ్యాలిడిటీ లోన్‌' సదుపాయాన్ని యూజర్లు వాడుకోవచ్చు. ఈ లోన్‌లో భాగంగా ఎయిర్​టెల్ యూజర్లు 1.5 జీబీ డేటాతో పాటు అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది. బేస్‌ ప్రీపెయిడ్​ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్​ చేసుకోలేని వారికి, అత్యవసర సమయాల్లో ఈ ఎమర్జెన్సీ వ్యాలిడిటీ లోన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ లోన్​ పొందండిలా!
How To Get Emergency Loan In Airtel : ఎయిర్​టెల్​ 'వ్యాలిడిటీ లోన్‌'ను పొందడం చాలా ఈజీ!! ఎలా అంటే- ఎయిర్​టెల్​ ఐవీఆర్‌ ప్రీకాల్​ అనౌన్స్‌మెంట్​ లేదా యూఎస్‌ఎస్‌డీ కోడ్​ *567*2# డయల్​ చేసి వ్యాలిడిటీ లోన్​ను వాడుకోవచ్చు. బేస్​ ప్రీపెయిడ్​ ప్లాన్​ గడువు ముగియగానే సీఎల్‌ఐ 56323 నుంచి వచ్చే మెసేజ్‌కు '1'తో రిప్లై ఇచ్చి కూడా లోన్​ కోసం రిక్వెస్టును పంపవచ్చు. ఇలా ఇచ్చే లోన్‌‌ను ఎయిర్‌టెల్‌ తర్వాతి రీఛార్జ్​ నుంచి రికవర్‌ చేసుకుంటుంది. కొత్త ప్లాన్‌లో ఒక రోజు గడువును తగ్గించడం ద్వారా రికవరీ ప్రాసెస్​ ముగిసిపోతుంది.

ప్రస్తుతానికి ఈ రాష్ట్రాల్లోనే
రూ.115 నుంచి మొదలుకొని రూ.3,359 దాకా వివిధ రీఛార్జ్​ ప్లాన్‌లలో ఈ వ్యాలిడిటీ లోన్‌ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. లోన్‌ తీసుకున్న తర్వాత దాన్ని రికవర్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్​ ప్లాన్‌తో రీఛార్జ్​ చేసుకోకపోతే, మరోసారి వ్యాలిడిటీ లోన్‌ పొందడానికి అర్హత ఉండదు. ప్రస్తుతానికి ఈ ఆఫర్​ను​ ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్​, కేరళ రాష్ట్రాల్లోని ఎయిర్​టెల్​ సర్వీసు ఏరియాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్‌ను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.

ఏయే ప్లాన్లు వాడేవాళ్లు అర్హులంటే?
ఈ కింది ప్లాన్‌లను రీఛార్జ్​ చేసుకునే ఎయిర్​టెల్ కస్టమర్లకు మాత్రమే 'వ్యాలిడిటీ లోన్‌' ఆఫర్​ ఇస్తారు. అవి: రూ.155, రూ.179, రూ.199, రూ.209, రూ.239, రూ.265, రూ.289, రూ.296, రూ.299, రూ.319, రూ.329, రూ.359, రూ. 398, రూ.399, రూ.455, రూ.479, రూ.489, రూ.499; పైన వివరించిన ప్రీపెయిడ్​ ప్లాన్లను రీఛార్జ్​ చేసుకునే వారు 'వ్యాలిడిటీ లోన్​' పొందేందుకు అర్హులు. వీరితోపాటు రూ.509, రూ.519, రూ.549, రూ.666, రూ.699, రూ.719, రూ.779, రూ.839, రూ.869, రూ.999, రూ.1499, రూ.1799, రూ.2999, రూ.3359 ప్లాన్‌లను వాడుతున్న వినియోగదారులకు కూడా ఈ వ్యాలిడిటీ లోన్ ఫెసిలిటీ ఉంది.

ఎన్​పీఎస్ నయా రూల్​ - ఇకపై ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి! - NPS New Login Rules

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? సరైన ITR ఫారాన్ని ఎంచుకోండిలా! - How To Choose Right ITR Form

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.