ETV Bharat / business

అలర్ట్​ - ఆధార్ కార్డ్ ఫ్రీ అప్​డేట్​కు మరో 2 రోజులే ఛాన్స్​! - Aadhaar Card Free Update Deadline - AADHAAR CARD FREE UPDATE DEADLINE

Aadhaar Card Free Update Deadline : ఆధార్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్​. మీ ఆధార్​ను పూర్తి ఉచితంగా అప్​డేట్ చేసుకునేందుకు మరో 2 రోజుల వరకే అవకాశం ఉంది. ఆ తరువాత మీ ఆధార్ వివరాలు అప్​డేట్ చేసుకోవాలంటే, కచ్చితంగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

uidai
Aadhaar Card Free Update (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 12:39 PM IST

Aadhaar Card Free Update Deadline : ఆధార్​ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు మరో 2 రోజుల వరకే ఛాన్స్​ ఉంది. అందువల్ల ఇప్పటి వరకు ఆధార్ అప్​డేట్ చేసుకోనివారు, గడువులో దానిని పూర్తి చేయడం మంచిది.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్​ను పూర్తి ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు జూన్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పొడిగిస్తూ వచ్చిన ఉడాయ్​ ఇకపై ఈ గడువును పొడిగిస్తుందో, లేదో తెలియదు. కనుక జూన్​ 14లోపు మీ ఆధార్​లోని వివరాలను ఉచితంగా అప్​డేట్ చేసుకోవడం మంచిది.

గడువులు పొడిగిస్తూనే ఉంది!
ఉడాయ్​ తొలుత 2023 మార్చి 15 వరకు ఉచితంగా ఆధార్ అప్​డేట్​ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. తరువాత ఈ గడువును 2024 డిసెంబరు 14 వరకు; తర్వాత 2024 మార్చి 14 వరకు, ఆ తరువాత మళ్లీ జూన్ 14 వరకు గడువు పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం వల్లనే ఈ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ గతంలో చెప్పింది.

వాళ్లు కచ్చితంగా అప్​డేట్ చేయాల్సిందే!
'ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లకుపైగా దానిని అప్​డేట్​ చేసుకోనివారు, కచ్చితంగా తమ డెమోగ్రాఫిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం UIDAI వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి మీ లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. మీరు గుర్తింపు కార్డుగా రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ లాంటి పత్రాలను సమర్పించవచ్చు. అంతేకాదు చిరునామా ధ్రువీకరణ పత్రాలుగానూ వీటిని ఉపయోగించుకోవచ్చు. మార్క్‌షీట్‌, టీసీ, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి వాటిని కూడా ఐడెంటిటీ ప్రూఫ్​లుగా వాడుకోవచ్చు. అలాగే విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించకుండా ఉండాలి) మీ అడ్రస్​ ప్రూఫ్​లుగా ఉపయోగించుకోవచ్చు' అని ఉడాయ్‌ స్పష్టం చేసింది. కనుక 'మై ఆధార్‌’ పోర్టల్‌'లోకి వెళ్లి జూన్​ 14లోపు పూర్తి ఉచితంగా ఆధార్​ వివరాలు అప్​డేట్ చేసుకోవడం మంచిది.

ఫ్రీగా ఆధార్​ అప్‌డేట్‌ చేసుకోండిలా!

  • ముందుగా మీరు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
  • మీ ఆధార్​ నంబర్​తో పోర్టల్​లోకి లాగిన్​ కావాలి.
  • 'ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత 'డాక్యుమెంట్‌ అప్‌డేట్‌' ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు మీ ఆధార్​ కార్డ్​ వివరాలు అన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • వీటిలో మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా మొదలైన వివరాలు ఉంటాయి.
  • వీటిలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే చేసుకోవాలి.
  • తరువాత Next బటన్​పై క్లిక్​ చేయాలి.
  • అక్కడ కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి 'ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌' డాక్యుమెంట్లను సెలక్ట్ చేసుకోవాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
  • చివరిగా మీకొక 14 అంకెల 'అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌' వస్తుంది.
  • దీని ద్వారా మీ ఆధార్​ అప్‌డేటెడ్​ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు https://myaadhaar.uidai.gov.in/ వెబ్​సైట్​లో చెక్‌ చేసుకోవచ్చు.

SBI బంపర్ ఆఫర్​​ - ఇకపై MSMEలకు 45 నిమిషాల్లోనే లోన్!​ - SBI DIGITAL MSME LOAN IN 45 MINUTES

ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డు పొందవచ్చు - ఎలాగో తెలుసా? - How To Get Credit Card Without Job

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.