ETV Bharat / business

ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్‌ చేయాల్సిందే! - NEW CAR DELIVERY CHECKLIST

మొదటి సారి కొత్త కారు కొన్నారా? ప్రీ-డెలివరీ చెక్ లిస్ట్ ఇదే!

Car Pre Delivery Inspection Checklist
Car Pre Delivery Inspection Checklist (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 12:30 PM IST

New Car Delivery Checklist : మనలో చాలా మందికి కొత్త కారు కొనడం ఒక కల. అందుకే ఏరికోరి నచ్చిన కారును సెలక్ట్ చేసుకుంటారు. తీరా ఆ కారు డెలివరీ తీసుకున్నాక, అందులో ఏమైనా లోపాలు ఉంటే, అప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే, కారు డెలివరీకి ముందు 5 రకాల అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. Car Exterior Inspection : సాధారణంగా మనం మంచి డిజైన్‌, కలర్‌ ఉన్న కారునే కొనుక్కుంటాం. తీరా డెలివరీ తీసుకున్న తరువాత దీనిలో ఏమైనా లోపాలు ఉంటే, అప్పుడు బాధపడినా ఫలితం ఉండదు. అందుకే ముందుగానే కారు వెలుపలి భాగాన్ని (ఎక్స్‌టీరియర్‌) కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాలి.

  • బాడీ ప్యానెల్స్‌ : కొన్నిసార్లు కారుపై చొట్టలు, గీతలు లాంటివి ఉంటాయి. అలాగే బాడీ ప్యానెల్స్‌ మధ్య గ్యాప్స్ ఉంటాయి.
  • పెయింట్ వర్క్ : కొన్ని సార్లు కార్ పెయింట్‌ సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే పెయింట్ ఓవర్ స్ప్రే అవ్వడం కానీ, లేదా పెయింట్ గ్యాప్స్ కానీ, పాయింట్ ఊడిపోవడం గానీ జరగవచ్చు.
  • టైర్స్‌ : కారు టైర్స్, రిమ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైర్ల సైజ్‌, డెప్త్‌ సరిగ్గా ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. పంక్చర్లు, పగుళ్లు లాంటి ఉన్నా, లేదా ఏదైనా తేడాగా ఉన్నా కచ్చితంగా డీలర్‌కు ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే కొంత మంది డీలర్లు టైర్లు మార్చేసే అవకాశం ఉంది. కనుక వాహనం చెక్ చేసేటప్పుడు కచ్చితంగా మీ ఫోన్‌తో కారును అన్ని వైపుల నుంచి ఫొటోలు తీసుకోవడం మంచిది. ఇది మీకు ఒక ప్రూఫ్‌గా పనిచేస్తుంది.

2. Car Interior Inspection : కారు లోపల అంతా బాగుంటేనే మీ ప్రయాణం హాయిగా, సాఫీగా కొనసాగుతుంది. కనుక కారు డెలివరీ తీసుకునే ముందు కచ్చితంగా కారు లోపలి భాగంలో అన్నీ సక్రమంగా ఉన్నాయో, లేదో చూసుకోవాలి.

  • డ్యాష్‌ బోర్డ్‌ : కారులోపల డ్యాష్‌బోర్డ్‌ను కచ్చితంగా చూడాలి. ముఖ్యంగా వార్నింగ్ లైట్స్‌, గేజ్‌లు, డిస్‌ప్లే సిస్టమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.
  • సీట్స్‌ : కారు సీట్లపై ఏమైనా మరకలు, చిరుగులు ఉన్నాయా? సీట్ల పొజిషన్ చక్కగా ఉందా, లేదా అనేది కూడా చూడాలి.
  • ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ : ఆడియో, బ్లూటూత్‌ కనెక్టివిటీ, నావిగేషన్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో టెస్ట్ చేయాలి.
  • క్లీన్లీనెస్‌ : కారు లోపలంతా శుభ్రంగా, ఎలాంటి దుర్వాసనలు లేకుండా చూసుకోవాలి.

3. Car Engine And Performance Check :

  • ఇంజిన్‌ : కారులో అత్యంత ముఖ్యమైన భాగం ఇంజిన్. ఇది బాగుంటేనే, కారు ప్రయాణం సాఫీగా సాగుతుంది. కనుక ఇంజిన్‌ను చెక్ చేసే విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదు.
  • ఇంజిన్ ఆయిల్‌ : మీ కారులో ఎలాంటి ఇంజిన్ ఆయిల్ వాడారు? అయిల్ లెవెల్‌, కలర్‌, కన్సిస్టెన్సీ అన్నీ చెక్ చేయాలి. అలాగే కూలెంట్ (శీతలీకరణి), బ్రేక్‌, ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన ఫ్లూయిడ్స్‌ గురించి కూడా తెలుసుకోవాలి.
  • బ్యాటరీ కండిషన్‌ : కారు బ్యాటరీ బాగుందా, లేదా అనేది కచ్చితంగా చెక్ చేయాలి. ఏదైనా లీకేజ్‌ లేదా తుప్పు పట్టడం లాంటిది ఉంటే, కచ్చితంగా దానిని మార్చమని చెప్పాలి.
  • స్టార్ట్‌-అప్‌ : కారు స్టార్ చేసినప్పుడు ఇంజిన్‌ నుంచి ఏవైనా అసాధారణ శబ్దాలు లేదా వైబ్రేషన్స్‌ వస్తున్నాయా అనేది చూడండి.
  • ట్రాన్స్‌మిషన్ అండ్ గేర్ షిఫ్ట్స్‌ : కారు నడుపుతున్నప్పుడు ట్రాన్స్‌మిషన్ చక్కగా ఉందా? గేర్ షిఫ్ట్స్ స్మూత్‌గా జరుగుతున్నాయా అనేది పరిశీలించండి.

4. Car Odometer And Fuel Check :

  • కొత్త కారు ఓడోమీటర్ రీడింగ్ 100 -150 కి.మీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఈ రీడింగ్ పరిధికి మించి ఉంటే, డీలర్‌ నుంచి కచ్చితంగా వివరణ కోరాలి.
  • సాధారణంగా కారు డీలర్లు కాంప్లిమెంటరీగా 5 లీటర్ల వరకు పెట్రోల్ ఇస్తారు. ఇది మీరు సమీపంలోని పెట్రోల్ బంక్‌ వరకు వెళ్లడానికి సరిపోతుందో, లేదో చూసుకోండి.

5. Car Documentation And Warranty Check : కారు డెలివరీ తీసుకునేముందు కచ్చితంగా డాక్యుమెంటేషన్ అంతా సరిగ్గా ఉందో, లేదో చూసుకోవాలి. వారెంటీ నిబంధనలను కూడా కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

  • ఓనర్స్ మాన్యువల్‌ పూర్తిగా తనిఖీ చేయాలి.
  • వారెంటీ పత్రాల్లోని నిబంధనలు, వ్యవధి, మైలేజ్ పరిమితులను చెక్ చేయాలి.
  • ఏమైనా సర్వీస్ రికార్డులు ఉంటే, వాటిని కూడా మీరు తీసుకోవాలి.
  • మీ పేరు మీద కార్‌ రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్ పేపర్లు ఉన్నాయో, లేదో కచ్చితంగా చూసుకోండి.
  • ఈ విధంగా అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే, భవిష్యత్‌లో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

నోట్‌ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కారు కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.