Upcoming SUVs Under 10 Lakh : కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. స్కోడా, హ్యుందాయ్, కియా, మారుతి సుజుకి కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీలను రానున్న 12 నెలల్లో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అలాగే ఈ కార్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
1. Skoda Kylaq :
స్కోడా కైలాక్ ఎస్యూవీ 2025 మార్చిలో భారత మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కైలాక్ భాగాలు కూడా స్కోడా కుషాక్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 1.0లీటర్ల 3 సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 115 పీఎస్ పవర్‌ను, 178 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.8.5 లక్షలు- రూ.15లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
2. New Hyundai Venue :
హ్యుందాయ్ వెన్యూ ఎస్యూవీ సెకండ్ జెనరేషన్ 2025 మధ్యలో మార్కెట్లోకి రానుంది. ఫీచర్లు, డిజైన్లలో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అయితే పాత మోడల్ మాదిరిగానే దీని ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ వెన్యూ ధర వేరియంట్ ఆధారంగా రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల వరకు ఉండనుంది.
3. Kia Syros :
కియా సిరోస్ 2025 మొదటి అర్ధభాగంలో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. కియా సిరోస్ కారు కియా సోనెట్ ఇంజిన్, ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. ఈ కారు అత్యాధునిక ఫీచర్లు, మంచి లుక్‌తో ఉండనున్నట్లు సమాచారం. పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్ రూఫ్, మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కియా సిరోస్ ప్రారంభ ధర రూ.6 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
4. Maruti Suzuki Fronx Facelift :
మారుతి కంపెనీ నుంచి రానున్న మరో కొత్త మోడల్ ఎస్యూవీ సుజుకి ఫ్రాంక్స్ ఫేస్ లిఫ్ట్. ఈ మోడల్ కారు 2025 మధ్యలో మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.10 లక్షల లోపే ఉండనున్నట్లు అంచనా.