ETV Bharat / business

ట్రెండ్​కు తగ్గట్టుగా మారుతూ - నంబర్​ 1 పొజిషన్​లో ఉన్న టాప్-12 కంపెనీస్ ఇవే! - Successful Reinvented Companies - SUCCESSFUL REINVENTED COMPANIES

12 Companies That Completely Reinvented Themselves : వ్యాపారం అంటే అంత అషామాషీ కాదు. కస్టమర్ల ఆలోచనలకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇలా ట్రెండ్​కు తగ్గట్టుగా మారుతూ ఎంతో కాలంగా నంబర్​-1 పొజిషన్​లో కొనసాగుతున్న టాప్​-12 కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Brand Evolution
Business Reinvention (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 4:49 PM IST

12 Companies That Completely Reinvented Themselves : వ్యాపారం చేయడం అంటే మాటలు కాదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నా, ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? మార్కెట్లో ఏ వస్తువులకు, సేవలకు డిమాండ్‌ ఉంది? తదితర అంశాలను ఎప్పటికప్పుడు బాగా అధ్యయనం చేస్తూ ఉండాలి. వాటికి అనుగుణంగా వ్యాపారంలో తగు మార్పులు, చేర్పులు చేసుకుంటూ వృద్ధి చెందాలి. కస్టమర్ల అవసరాలను ముందే గమనించి కాలానికి అనుగుణంగా వ్యాపార వ్యూహాలు అమలు చేయాలి. అప్పుడే వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఈ విధంగా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ, చాలా కంపెనీలు వ్యాపారంలో అదరగొడుతున్నాయి. వాటిలోని టాప్​-12 సంస్థల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

12. LG
మొబైల్‌ ఫోన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను తయారు చేసే 'ఎల్​జీ' బ్రాండ్‌ అందరికీ సుపరిచితమే. దక్షిణ కొరియాకు చెందిన 'కూ ఇన్‌ హ్వోయి' అనే ఆయన 1947లో 'లక్కీ కెమికల్​' పేరుతో ఓ కెమికల్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫేస్​క్రీమ్​లు ఉత్పత్తి చేసి విక్రయించేవారు. ఆ తర్వాత దీని పేరును 'గోల్డ్‌ స్టార్‌'గా మార్చారు. ఈ కంపెనీ కొరియాలోనే తొలిసారి దేశీయ రేడియోను తయారు చేసింది. గోల్డ్‌ స్టార్ బ్రాండ్ కొరియాలో మొదటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కలర్ టీవీలను తయారుచేసింది. 1983లో ఈ కంపెనీ పేరును 'లక్కీ గోల్డ్‌ స్టార్ గ్రూప్‌'గా మార్చారు. ఈ పేరునే కాస్త కుదించి 1995 నుంచి అధికారికంగా 'LG'గా మార్చారు.

ఎల్​జీ కంపెనీ అమెరికాకు చెందిన అదిపెద్ద గృహోపకరణాల కంపెనీ జెనిత్​ కార్పొరేషన్​ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎల్​జీ కింద 19 వేర్వేరు కంపెనీలు ఉన్నాయి. పైగా ఈ కంపెనీకి రెండు స్పోర్ట్స్​ (బేస్​ బాల్​, బాస్కెట్ బాల్​) టీమ్​లు కూడా ఉన్నాయి. ఈ విధంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుని ఎల్​జీ కంపెనీ ఎలక్ట్రానిక్ సెక్టార్​తో సహా పలు రంగాల్లో రాణిస్తోంది.

11. Berkshire Hathaway
ఇన్వెస్ట్​మెంట్ గురు వారెన్ బఫెట్​ 'బెర్క్​షైర్‌ హాత్​వే' కంపెనీని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో కొనుగోలు చేశారు. దీని వెనుక ఒక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. 1927లో హాత్​వే మాన్యుఫ్యాక్చరింగ్ కో పేరిట కొంతమంది టెక్స్​టైల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1960వ దశకం ప్రారంభంలో అమెరికా వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఈ కంపెనీ కూడా నష్టాలపాలైంది. దీనితో వారెన్ బఫెట్ ఈ కంపెనీ షేర్లను చాలా తక్కువగా కొనుగోలు చేసి, వాటి నుంచి భారీ లాభం పొందారు. దీనితో సదరు కంపెనీ వారెన్ బఫెట్​ను చీట్ చేయాలని చూసింది. దీనితో బఫెట్ భారీ సంఖ్యలో ఆ కంపెనీ షేర్లు కొనేసి, అసలు యజమానులను కంపెనీ నుంచి బయటకు పంపేశారు. 1985లో బఫెట్ టెక్స్​టైల్ వ్యాపారాన్ని మూసివేసి, దానిని బిలయన్ల డాలర్ల విలువైన కార్పొరేట్ హోల్డింగ్ కంపెనీగా తీర్చిదిద్దారు.

10. Shell
ప్రపంచంలోనే అతి భారీ లాభాలు పొందుతున్న ఇంధన సంస్థల్లో 'షెల్‌' ఒకటి. ఈ సంస్థ యజమానులకు 1930వ దశకంలో లండన్​లో పురాతన వస్తువులను విక్రయించే చిన్న దుకాణం ఉండేది. మార్కస్‌ శామ్యూల్‌ అనే వ్యక్తి అప్పట్లో వివిధ దేశాల నుంచి రకరకాల షెల్స్​ను దిగుమతి చేసుకొని అమ్మేవారు. దీనికితోడు, వారి కుమారులు ఎగుమతుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. లండన్‌ నుంచి ఓడల్లో భారీ యంత్రాలు, పనిముట్లను ఎగుమతి చేస్తూ జపాన్‌, చైనా నుంచి బియ్యం, సిల్క్‌ తదితర వస్తువులను దిగుమతి చేసుకునేవారు. కాగా 19వ శతాబ్దం చివర్లో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దీంతో శామ్యూల్‌ అండ్‌ సన్స్‌ ఇంధన రంగంలోకి దిగారు. 1892లో ప్రపంచంలోనే తొలిసారి అతిపెద్ద ఇంధన ట్యాంకర్​ను నిర్మించారు. యూరప్​నకు ఇంధనం దిగుమతి చేసుకోవడం కోసం పైప్​లైన్‌ ఏర్పాటు చేశారు. అలా ఆ రంగంలో శామ్యూల్‌ కుటుంబం పట్టు సాధించింది. 1897లో వారి షిప్పింగ్‌ కంపెనీ పేరును 'షెల్‌ ట్రాన్స్​పోర్ట్​ అండ్‌ ట్రేడింగ్‌' కంపెనీగా మార్చారు. 20వ శతాబ్దం ప్రారంభంలో షెల్ కంపెనీ, రాయల్ డచ్ పెట్రోలియంలో విలీనమైంది. ఆ తర్వాత 2022లో కొత్త పేరు, లోగోతో 'షెల్‌' సంస్థగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 46 షెల్​ స్టేషన్లు ఉన్నాయి.

9. Nokia
ఫిన్లాండ్​కు చెందిన ఫ్రెడ్రిక్‌ ఇడెస్టామ్‌ అనే మైనింగ్‌ ఇంజినీర్‌ 1871లో నోకియా ప్రాంతంలోని నోకియన్‌ విర్టా నది ఒడ్డున తన వ్యాపారం కోసం ఓ పేపర్‌ మిల్లు స్థాపించారు. 1898లో తన కంపెనీకి 'నోకియా ఏబీ' అని పేరు పెట్టారు. అదే సమయంలో ఫిన్నిష్‌ రబ్బర్‌ వర్క్స్‌ అనే సంస్థ టైర్లు, రబ్బరు బూట్లు తయారు చేసేది. ఈ రెండు కంపెనీలు 1912లో ఫిన్నిష్‌ కేబుల్‌ వర్క్స్‌ అనే సంస్థతో కలవడం వల్ల నోకియా కార్పొరేషన్‌ ఏర్పడింది. నోకియా బ్రాండ్​తో సరికొత్త డిజైన్లతో, రంగు రంగుల రబ్బర్ బూట్లు తయారు చేసేవాళ్లు. ఈ వ్యాపారంలో నోకియా బాగా రాణించింది.

ఆ తర్వాత 1963లో నోకియా కంపెనీ తొలిసారి ఎలక్ట్రానిక్‌ రంగంలో అడుగుపెట్టింది. మిలటరీ, ఎమెర్జెన్సీ సర్వీసుల కోసం రేడియో ఫోన్లను తయారుచేసింది. 1980ల్లో కమర్షియల్‌ రేడియో ఫోన్లు, కార్‌ ఫోన్లు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ రంగంలోనే భవిష్యత్తును వెతుక్కున్న నోకియా 1990ల్లో రబ్బర్‌, పేపర్‌ కంపెనీలను విక్రయించేసి, పూర్తిగా మొబైల్‌ ఫోన్ల తయారీపైనే దృష్టిపెట్టింది. 1998 నుంచి 2012 వరకు ప్రపంచంలో ఏ మొబైల్‌ కంపెనీ విక్రయించలేనన్ని మొబైల్‌ ఫోన్లను నోకియా విక్రయించిందంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే, 2014 తర్వాత స్మార్ట్​ఫోన్లు మార్కెట్లోకి రావడం వల్ల నోకియా ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం HMD పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీ, నోకియా బ్రాండ్​తో మళ్లీ ఫోన్లు విక్రయిస్తూ, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

8. IBM
ప్రపంచంలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఐబీఎం ఒకటి. ఈ మల్టీ నేషనల్ కంపెనీ 1984లో పీసీ కంప్యూటింగ్ విభాగంలో రారాజుగా వెలుగొందింది. తొలుత ఐబీఎం చిన్న తయారీదారుల నుంచి కంప్యూటర్ హార్డ్​వేర్ భాగాలను కొనుగోలు చేసి, మైక్రోసాఫ్ట్ విండోస్​తో పీసీలను తయారుచేసేది. కానీ చివరికి ఇదే ఆ కంపెనీని దెబ్బతీసింది. ఎందుకంటే, మార్కెట్లోకి ఎన్నో క్లోన్ కంప్యూటర్​లు అందుబాటులోకి వచ్చేశాయి. దీనితో 1993లో ఐబీఎం కంపెనీ, స్టాక్​ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూసింది. దీనితో తక్కువ ధర ఉన్న పీసీలు, కంప్యూటర్ చిప్స్, ప్రింటర్లు, ఇతర హార్డ్​వేర్​లను విక్రయించడం ఆపేసింది. ఇది చాలా కఠినమైన, ధైర్యమైన నిర్ణయమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఐబీఎం - ఐటీ, కంప్యూటింగ్ రంగంలోకి అడుగపెట్టి రాణించింది. 2010 నాటికి ఐబీఎం 200కు పైగా కంపెనీలను కొనుగోలు చేసింది. భారీ నష్టాల నుంచి కోలుకుని దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఐబీఎం గురించి బిజినెస్​ స్కూల్స్​లో ప్రత్యేకంగా పాఠాలు చెబుతుంటారు.

7. Nintendo
జపాన్​కు చెందిన వీడియో గేమింగ్ కంపెనీ నంటెండో. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత పాపులర్ వీడియో గేమింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. 1989లో ఫుసాజిరో యమౌచి అనే అతను దీనిని ప్లేయింగ్ కార్డుల తయారీ కంపెనీగా స్థాపించారు. కానీ అతని మనవడు హిరోషి దీనిని వీడియో గేమింగ్ కంపెనీగా మార్చి ప్రపంచంలోనే నంబర్​ 1 కంపెనీగా తీర్చిదిద్దారు.

6. Western Union
విదేశాలకు డబ్బులు పంపించే బ్యాంకింగేతర సంస్థ 'వెస్ట్రర్న్ యూనియన్'. ఈ కంపెనీ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 1844లో శామ్యూల్ మోర్స్ వాషింగ్టన్ డీసీ నుంచి బాల్టిమోర్​, మేరీ ల్యాండ్​కు మొదటి టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపారు. ఆయనే ప్రపంచానికి సుదూర కమ్యూనికేషన్‌ ను పరిచయం చేశారు. దీనితో అప్పటి యువ పారిశ్రామిక వేత్తలు టెలిగ్రాఫ్ సంస్థలను స్థాపించి, యూఎస్ నగరాలను కనెక్ట్ చేయడానికి దేశవ్యాప్తంగా టెలిగ్రాఫ్ లైన్లను వేశారు. ఇలా ఆవిర్భవించిన వాటిలో 'వెస్ట్రన్ యూనియన్‌' కంపెనీ ఒకటి. అయితే ఫోన్లు రావడం వల్ల టెలిగ్రామ్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. దీనితో కంపెనీ చాలా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంది. కానీ ఈ కంపెనీ 'మనీ ట్రాన్స్‌ఫర్' వ్యాపారాన్ని ప్రారంభించింది. 1935లో ఫ్యాక్స్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వెస్ట్రన్ యూనియన్ కంపెనీ 200 పైగా దేశాల్లో తమ సేవలను అందిస్తోంది.

5. Wipro
ప్రపంచంలోని గొప్ప ఐటీ కంపెనీల్లో విప్రో ఒకటి. భారత ఐబీఎం సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీలో దాదాపు 2,20,000 మంది ఉద్యోగులున్నారు. 1945లో మహమ్మద్‌ ప్రేమ్​జీ వెస్ట్రన్‌ ఇండియా ప్రొడక్ట్స్‌(విప్రో) పేరుతో వంటనూనెల వ్యాపారం ప్రారంభించారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ సంస్థ సబ్బులు, వాషింగ్‌ పౌడర్‌, ఫేస్‌ పౌడర్‌, బల్బులు, ఇతర ఇంటి సామగ్రిని తయారు చేయడం ప్రారంభించింది. 1966లో మహమ్మద్ ప్రేమ్​జీ మృతి చెందడం వల్ల, ఆయన కుమారుడైన 21 ఏళ్ల అజీమ్‌ ప్రేమ్​జీ విప్రో బాధ్యతలు స్వీకరించారు. 1970, 1980ల్లో భారత్‌లో అప్పుడప్పుడే ఐటీ రంగం మొదలైంది. ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ తన సంస్థ ప్రధాన కార్యాలయాన్ని భారత సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరుకు మార్చారు. ఆ తర్వాత కంప్యూటర్లు, సాఫ్ట్​వేర్‌ తయారు చేసే సంస్థను నెలకొల్పారు. అలా విప్రో ఐటీ కంపెనీ మొదలైంది. విప్రోకు ఎక్కువ భాగం ఆదాయం అమెరికా నుంచే వస్తుంటుంది. ఇప్పటికీ ఈ సంస్థ విప్రో ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో బాత్​రూమ్​కు సంబంధించిన వస్తువులు, బల్బులు, ఇతర ఇంటి సామగ్రిని ఉత్పత్తి చేస్తోంది.

4. National Geographic
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ నేషనల్‌ జియోగ్రాఫిక్‌. 1888లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ తొలి సంచికను ప్రచురించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి, ప్రపంచం, సైన్స్‌ వంటి ఎన్నో అంశాలపై ఆసక్తికర కథనాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతోంది. తరువాత నేషనల్ జియోగ్రాఫిక్​ టీవీ ఛానల్ కూడా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మ్యాగజైన్​ను ప్రముఖ డిస్నీ సంస్థ నడిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు టీవీ నెట్​వర్క్​లు, సోషల్ మీడియా ఛానెల్​లలో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ కంటెంట్​ ప్రసారం అవుతోంది.

3. American Express
'అమెరికన్ ఎక్స్​ప్రెస్' కంపెనీ 1850లో విలువైన వస్తువుల డెలివరీ సర్వీస్​గా ప్రారంభమైంది. 1882లో మనీ ఆర్డర్​ సేవలు కూడా ప్రారంభించింది. తరువాత ఛార్జ్​ కార్డుల వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ పేమెంట్ కార్డుల నెట్​వర్క్​గా మారిపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ గ్లోబర్ ఫైనాన్సియల్ సర్వీసెస్​, ట్రావెల్ కంపెనీగా వెలుగొందుతోంది.

2. Corning
మెటీరియల్ సైన్సెస్​లో ప్రపంచ అగ్రగామిగా కార్నింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థ స్మార్ట్​ఫోన్‌ డిస్​ప్లే ప్యానెల్‌లో కీలకమైన గొరిల్లా గ్లాస్​ను తయారు చేస్తోంది. శాంసంగ్, గూగుల్, ఎల్​జీ వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు - కార్నింగ్ తయారుచేసిన గొరిల్లా గ్లాస్​ను తమ డివైజ్​ల్లో అమరుస్తున్నారు. ఈ కంపెనీ తొలుత గ్లాస్ బల్బులను తయారుచేసేది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకుని రాణిస్తోంది.

1. Apple
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, స్మార్ట్​వాచ్​లకు ఉండే క్రేజే వేరు. కొత్త కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి దించుతూ అదరగొడుతుంటుంది యాపిల్ కంపెనీ. ఈ కంపెనీ పీసీ, ల్యాప్​టాప్​లను, యాపిల్ వాచ్​​, ఎయిర్​పాడ్​లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. యాపిల్ సొంతంగా యాపిల్​ ప్లస్ పేరుతో​ స్ట్రీమింగ్ టీవీ​ నెట్​వర్క్​ను కూడా రన్ చేస్తోంది. ఈ విధంగా వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రొడక్ట్స్ తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తోంది యాపిల్​ కంపెనీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.