ETV Bharat / bharat

PUBG ఆడుకోనివ్వడం లేదని తాళం చెవి, నెయిల్​ కట్టర్లు​ మింగిన యువకుడు! ఆ తర్వాత ఏమైందంటే? - Youth Swallowed Metal Objects - YOUTH SWALLOWED METAL OBJECTS

Youth Swallowed Metal Objects : ఓ యువకుడి కడుపులో నాలుగు అంగుళాల కత్తి, నేయిల్‌ కట్టర్లు, తాళం చెవి సహా పలు మెటల్ వస్తువులు లభ్యమయ్యాయి. తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిన బాధితుడిని, అతడి కుటుంబ సభ్యులు కొన్ని రోజుల కింద మోతిహారీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎక్స్-రే తీయగా పొట్ట లోపల లోహపు వస్తువులు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన బిహార్‌ తూర్పు చంపారన్ జిల్లాలోని జరిగింది.

Youth Swallowed Knives And Keys
Youth Swallowed Knives And Keys (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 9:45 AM IST

Youth Swallowed Metal Objects : మొబైల్​లో పబ్​జీ వీడియో గేమ్​ ఆడుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని, తాళం చెవి, నాలుగు అంగుళాల కత్తి, నెయిల్​ కట్టర్లు మింగేశాడు ఓ యువకుడు. దీంతో ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలయ్యాడు. సర్జరీ చేసి బాధితుడి కడుపులోంచి మెటల్​ వస్తువులను బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన బిహార్‌ తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది
మోతిహారీలోని చాంద్​మారి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఓ వ్యక్తి, మొబైల్​లో వీడియో గేమ్​లకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వీడియో గేమ్​ ఆడొద్దని కుటుంబ సభ్యులు వారించారు. దీంతో యువుకుడు, తాళం చెవి, కీ రింగ్, చిన్న కత్తి, నెయిల్​ కట్టర్లు​ వంటి మెటల్​ వస్తువులు మింగాడు. అయితే కొన్ని గంటల తర్వాత బాధితుడి పరిస్థితి విషమించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాధితుడికి వైద్యులు సోనోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్​ తీశారు. యువకుడి పొట్టలో కనిపించిన వస్తువులు చూసి కంగుతిన్నారు.

"యువకుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. దాదాటు గంటపాటు ఆపరేషన్ చేసి, అతడి కడుపులో నుంచి తాళం చెవి, ఒక కత్తి, రెండు నెయిల్ కట్టర్లు, చిన్న మెటల్​ వస్తువులను తొలగించాము. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది" అని డాక్టర్ అమిత్ కుమార్ చెప్పారు.

మరోవైపు, బాధిడుతు సోషల్ మీడియా, స్మార్ట్​ఫోన్​, ఆన్​లైన్​ గేమ్​లకు బానిసయ్యాడని అతడి తల్లి పేర్కొంది. అతడు ఎక్కువ సమయం సినిమాలు, రీల్స్​ చూస్తు గడుపుతాడని చెప్పింది. దాని కారణంగా మానసికంగా బలహీనంగా అయ్యాడని తెలిపింది. అంతేకాకుండా ఇతరుల కన్నా తానే గొప్ప అని చెప్పుకునేందుకు ఇటీవల నుంచి ఇలా మెటల్​ వస్తువులను మింగుతున్నాడని పేర్కొంది.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు, ఆన్‌లైన్ గేమింగ్‌లకు అలవాటు పడకుండా నిరోధించడానికి, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, వారిపై ఒక కన్నేసి ఉంచాలని డాక్టర్ అమిత్ కుమార్ సూచించారు. అవసరమైతే సైకొలాజికల్​ గైడెన్స్​, కౌన్సిలింగ్, మెడికేషన్​ తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా పిల్లల స్క్రీన్​టైమ్​​ను ఎప్పటికప్పుడు గమనించాలని పేర్కొన్నారు.

యువకుడి కడుపులో సొరకాయ- చూసిన వైద్యులు షాక్​- వెంటనే!

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.