ETV Bharat / bharat

రాష్ట్రపతికి రాజ్​భవన్ మహిళా ఉద్యోగి లేఖ- గవర్నర్ అలా చేయడంపై అభ్యంతరం! - West Bengal Governor Case - WEST BENGAL GOVERNOR CASE

West Bengal Governor Issue : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్​పై వేధింపుల ఆరోపణలు చేసిన రాజ్​భవన్ మహిళా ఉద్యోగి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆశ్రయించనున్నారు. తనకు న్యాయం చేయాలంటూ ముర్ముకు లేఖ రాయనున్నారు.

CV Anand Bose, Droupadhi Murmu
CV Anand Bose, Droupadhi Murmu (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 3:48 PM IST

Updated : May 10, 2024, 4:40 PM IST

West Bengal Governor Issue : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్​పై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ, తనకు న్యాయం చేయాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరనున్నారు. కోల్‌కతా పోలీసులపై ఆశలు పెట్టుకోలేకపోతున్నానని, తీవ్ర నిరాశకు లోనవుతున్నానని ఆమె మీడియాకు తెలిపారు. అందుకే రాష్ట్రపతికి లేఖ రాయడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు.

సాధారణ పౌరులకు గవర్నర్‌ సీసీటీవీ ఫుటేజీని చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ముఖాన్ని బ్లర్ చేయకుండా స్క్రీనింగ్ చేశారని తెలిపారు. "రాజ్యాంగ పదవిలో ఉన్న సిట్టింగ్ గవర్నర్‌కు ఏమీ జరగదని నాకు తెలుసు. అందుకే న్యాయం కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు" అని ఆమె తెలిపారు.

'మోదీకి లేఖ రాయను!'
"నేను బాధలో ఉన్నప్పుడు పీఎం భద్రతా సిబ్బంది నా వేదనను చూశారు. వారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఇప్పుడు ఆయనకు లేఖ రాయడం వృథాగా భావిస్తున్నాను" అని మోదీకి లేఖ రాస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.

'సైకాలజిస్ట్‌ను కలుస్తా'
"నేను తీవ్రమైన డిప్రెషన్​కు గురవుతున్నాను. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదు. ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి కౌన్సెలింగ్ కోసం సైకాలజిస్ట్‌ను కలవాలని ఆలోచిస్తున్నాను. మే 2వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని ప్రదర్శిస్తూ నా గోప్యతకు గవర్నర్ భంగం కలిగించారు. ఫుటేజీని విడుదల చేయడానికి నా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అలా గవర్నర్​ మరో నేరానికి పాల్పడ్డారు" అని ఆమె ఆరోపించారు.

ఇదీ జరిగింది!
ఇటీవల సీవీ ఆనంద్​ బోస్ తనను​ వేధింపులకు గురిచేశారంటూ ఆ మహిళ ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయమై గవర్నర్​ బోస్​ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు. దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.

లైంగిక ఆరోపణలపై బంగాల్​ గవర్నర్​ ఆడియో రిలీజ్​- కేరళకు ఆనంద్​ బోస్​ పయనం - Bengal Governor Molestation Issue

'100మందికి CCTV వీడియో చూపించిన బంగాల్​ గవర్నర్'- లైంగిక ఆరోపణలపై ఆనంద్​ బోస్​ రియాక్షన్ - BENGAL GOVERNOR MOLESTATION Issue

Last Updated : May 10, 2024, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.