ETV Bharat / bharat

ఫొటో ఇచ్చేందుకు మహిళలు ససేమిరా! ఆచరణ సాధ్యం కాదనుకున్న ఓటర్ ఐడీ కార్డు- ఆసక్తికర విషయాలివే! - voter id card history

Voter Id History In India : ప్రస్తుతం ఓటు వేయాలంటే సులువుగా ఓటర్ ఐడీ కార్డును పట్టుకుని వెళ్లిపోతున్నాం. అయితే ఓటరు కార్డును రూపొందించిన క్రమంలో ఎన్నికల సంఘానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఓటరు కార్డు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. మరెందుకు ఆలస్యం ఓటరు కార్డు చరిత్రను ఓ సారి తెలుసుకుందాం.

Voter Id History In India
Voter Id History In India
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 8:18 AM IST

Voter Id History In India : భారత్ వంటి పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణ ఒక సవాల్‌ అనే చెప్పవచ్చు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వీటిని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో కీలకమైన ఓటరు కార్డును 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాల కాలం పట్టింది. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధించడంలో కీలకమైన ఈ ఓటరు కార్డును 1993లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అది ఓటరు గుర్తింపుగానే కాకుండా వ్యక్తుల చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఒకటిగా నిలిచింది.

తొలి ప్రయత్నం విఫలం
ఓటర్లకు ఫొటో ఐడీ కార్డులను జారీ చేసే ప్రక్రియను తొలిసారిగా 1960లో చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. కోల్​కతా (సౌత్‌-వెస్ట్‌) పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఓటరు కార్డులను ఇచ్చారు. కానీ, పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడం వల్ల దాదాపు రెండు దశాబ్దాల పాటు అది అటకెక్కింది. మళ్లీ 1979లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీటిని జారీ చేయగా ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ తీసుకొచ్చారు. ఇవే 1993లో దేశవ్యాప్త ఫొటో ఐడీ జారీకి నాంది పలికాయి. వీటికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు -1958లో ఓ ఆసక్తికర నిబంధన ఉంది. భారత్‌లో ఎన్నికల ప్రయాణంపై ఈసీ ప్రచురించిన 'లీప్‌ ఆఫ్‌ ఫెయిత్‌' పుస్తకంలో వెల్లడించారు.

లోక్​సభలో 1958 నవంబర్‌ 27న ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని చూసి సంతోషంగా అనిపించిందని భారత తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ రిటైర్మెంట్‌ సమయంలో తెలిపారు. బిల్లును ప్రవేశపెట్టిన అప్పటి న్యాయశాఖ మంత్రి అశోక్‌కుమార్‌ సేన్‌- సుకుమార్‌ సేన్‌ తమ్ముడు కావడం విశేషం. చివరకు 1958 డిసెంబర్‌ 30న ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అప్పటికే రెండో ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కేవీకే సుందరం బాధ్యతలు చేపట్టారు. 1958 డిసెంబర్‌ 20 నుంచి 1967 సెప్టెంబర్‌ 30 వరకు పదవిలో ఉన్న ఆయన సుదీర్ఘకాలం సీఈసీగా కొనసాగిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు. 1957 సార్వత్రిక ఎన్నికల తర్వాత, రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయడం వల్ల పోలింగ్‌ సమయంలో ఓటర్లను గుర్తించడం తేలిక అవ్వడం సహా దొంగ ఓట్లను నివారించవచ్చని అప్పట్లో ఇచ్చిన నివేదికలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కారణాలివే
కోల్​కతా (సౌత్‌-వెస్ట్‌)లో 3.42 లక్షల మంది ఓటర్లు ఉండగా 10 నెలలు కష్టపడి 2.13 లక్షల ఓటర్ల ఫొటోలను మాత్రమే సేకరించగలిగారు. ఇందులో 2.10 లక్షల మందికి ఫొటో ఐడీ కార్డులు జారీ చేశారు. ఇందుకు కారణం మహిళా ఓటర్లు ముందుకు రాకపోవడమేనట. మహిళా, పురుష ఫొటోగ్రఫర్లను నియమించినప్పటికీ మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు, కేవలం ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు కోల్​కతా ప్రాంతానికే రూ.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఖర్చుపరంగా అదనపు భారం కావడం, కమిషన్‌లో మిషనరీపై సమీక్ష జరిపిన ఈసీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కోల్​కతా లేదా దేశవ్యాప్తంగా సంతృప్తికర స్థాయిలో ఈ ప్రక్రియ చేపట్టడం ఆచరణ సాధ్యం కాదని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది.

ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. చివరకు 1993లో ఓటరు కార్డుల జారీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఓటరుకు గుర్తింపుకార్డు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నించింది. 2021లో ఎలక్ట్రానిక్‌ ఎలక్టోరల్‌ ఫొటో ఐడీ కార్డుల (EPIC)ను తీసుకొచ్చారు. పీడీఎఫ్‌లో ఉండే ఈ డిజిటల్‌ కార్డును మార్చేందుకు వీలులేకుండా రూపొందించారు.

బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!

'ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు'- కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.