ETV Bharat / bharat

రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్​! సోదరిపైనే పోటీ? - Vinesh Phogat Politics

Vinesh Phogat Politics : అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె సోదరి బబితా ఫొగాట్‌తో తలపడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వినేశ్‌ ఫొగాట్‌ ఏ పార్టీలో చేరేది స్పష్టత రావాల్సి ఉందని ఆమె సన్నిహతవర్గాలు అంటున్నాయి.

Vinesh Phogat
Vinesh Phogat (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 5:33 PM IST

Updated : Aug 20, 2024, 6:10 PM IST

Vinesh Phogat Politics : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్టార్‌ రెజ్లర్లు తలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడ్డ స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తన సోదరి బబితా ఫొగాట్‌పై పోటీ చేయించేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

'రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు?'
అయితే రాజకీయాల్లోకి రాబోనని గతంలో వినేశ్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. "ఆమె(వినేశ్) రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్‌ వర్సెస్‌ బబితా ఫొగాట్‌ పోటీ ఉండొచ్చు. రాజకీయాల్లోకి రాబోనని గతంలో ఆమె ప్రకటించింది. అయితే ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీలో చేరనున్నారనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు" అని ఫొగాట్‌ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

కాంగ్రెస్​లోకి వినేశ్​!
పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి ఇటీవల వినేశ్‌ ఫొగాట్‌ స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా ఆమెను సాదరంగా స్వాగతం పలికారు. ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. గతంలోనూ దీపిందర్‌ హుడా వినేశ్‌ను రాజ్యసభకు పంపాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వినేశ్ సన్నిహిత వర్గాలు మాత్రం ఏ పార్టీలో ఆమె చేరనుందన్న విషయంపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి.

అందరి దృష్టి అటు వైపే!
గత హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేశ్ సోదరి బబితా ఫొగాట్‌ 2019లో బీజేపీ చేరారు. దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా కథనాలు నిజమైతే ఈసారి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ సిస్టర్స్‌ మధ్య పోరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అంతేగాక మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హరియాణాలో అక్టోబరు 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

'ఆ రోజు వినేశ్ ఫొగాట్​ చనిపోతుందని అనుకున్నా!'- కోచ్ సంచలన వ్యాఖ్యలు - Vinesh Phogat Olympics

వినేశ్‌ ఫోగాట్‌ వ్యవహారంలో ఏం జరిగింది? - కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మాజీ కెప్టెన్‌ - Paris Olympics 2024 vinesh Phogat

Last Updated : Aug 20, 2024, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.