Veera Startup In Madhya Pradesh : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది యువత ఇంటి వద్దే వర్క్ చేస్తూ మంచి జీతాన్ని పొందాలనుకుంటున్నారు. వర్క్ ఫమ్ హోమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే స్కిల్, టాలెంట్ ఉన్నవారికి మంచి అకాశం కల్పిస్తోంది మధ్యప్రదేశ్‌లో ఉన్న వీరా అనే స్టార్టప్ కంపెనీ. వీరా డాట్ కమ్‌లో మీ వివరాలను నమోదు చేసుకుని ఎంపికైన వారు రూ.లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగాలు పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ వీరా స్టార్టప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి నైపుణ్యాలు, టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తోంది భోపాల్‌లోని వీరా స్టార్టప్. వివిధ రంగాలకు చెందిన వారు ఈ స్టార్టప్ ద్వారా వర్క్ ఫమ్ హోమ్ ఉద్యోగాలను పొందుతున్నారు. వీరా డాట్ కమ్‌లో వివరాలు నమోదు చేసుకున్నవారికి వారి స్కిల్స్‌కు తగ్గట్లు ఉద్యోగాలు వస్తున్నాయి. అభ్యర్థుల టాలెంట్ తగ్గట్లు ఉద్యోగాలను ఇప్పిస్తోంది వీరా స్టార్టప్. అంతేకాకుండా పనికి తగ్గట్లు జీతాన్ని ఇప్పిస్తోంది.
మంచి జీతం మీ సొంతం
ఏప్రిల్ 2021లో ప్రారంభమైన వీరా స్టార్టప్ ద్వారా ఇప్పటివరకు 81 దేశాల నుంచి 10 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారు. ఈ కంపెనీ పర్మినెంట్ ఉద్యోగాలపై ఉద్యోగులను నియమించదు. ఉద్యోగులు చేసే పనిని బట్టి బట్టి జీతం ఇప్పిస్తుంది. వీరా స్టార్టప్ ప్రస్తుతం 101 రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటివరకు 300 కంటే ఎక్కువ క్లయింట్లను కలిగి ఉంది. ఉద్యోగికి, కంపెనీకి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తోంది.
ఇదీ ప్రస్థానం
వీరా స్టార్టప్ వ్యవస్థాపకుడు శుభం శర్మ బీటెక్( సివిల్) చదివారు. ఆ తర్వాత ఆయన బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారు. అప్పుడు కోచింగ్‌కు రాలేని కొందరి విద్యార్థులకు శుభం శర్మ ఆన్లైన్లో క్లాసులు చెప్పేవారు. అప్పుడే శుభం శర్మకు ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగులు, కంపెనీల మధ్య సమన్వయాన్ని ఏర్పరిచేందుకు వీరా స్టార్టప్‌ను ప్రారంభించారు.
'కొవిడ్ సమయంలో ప్రజలు వారి ఇళ్లలోనే ఉండిపోయారు. కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేలా చేశాయి. కంపెనీ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని భావించాం. అప్పటి వరకు మేము ఆన్‌లైన్ ట్యూషన్‌ను మాత్రమే అందిస్తున్నాము, కానీ ఆ తర్వాత మేము ఐటీ, బ్యాంకింగ్, యోగా, డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, లీగల్, బ్యాంకింగ్ సహా 101 రంగాల్లో వర్కర్లను యజమానులకు ఫ్రీలాన్స్ నిపుణులను అందించడాన్ని ప్రారంభించాం.' అని శుభం శర్మ చెప్పారు.
వీరా కంపెనీ ఇప్పటి వరకు దాదాపు రూ.16 కోట్ల నిధులను ఇన్వెస్టర్ల నుంచి అందుకుంది. ఇందులో ఇతర పెట్టుబడిదారులతో పాటు కొన్ని ప్రభుత్వ, ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా ఉన్నాయి. వీరా కంపెనీ ప్రస్తుతం భోపాల్, ఇందౌర్, జబల్పుర్లో తన కార్యాలయాలను నిర్వహిస్తోంది. దాదాపు 20 మందితో కూడిన బృందం ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.
విదేశాల నుంచి ఉద్యోగవకాశాలు
వీరాకి కెనడాకు చెందిన ఐటీ కంపెనీ నుంచి రూ.50 లక్షల కాంట్రాక్ వచ్చింది. అప్పుడు కంపెనీ పదిమందికి పైగా ఐటీ నిపుణులకు వర్క్ ఫ్రం హోం కల్పించింది. ఇది కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ సహా 81 దేశాల్లో తన ఉనికిని విస్తరించింది. భారతదేశంలోని మెట్రో నగరాల నుంచి కూడా ఈ కంపెనీకి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం వీరా సంస్థకు ముంబయి, పుణె, గుజరాత్, జయపుర, భోపాల్‌తో సహా ఇతర పెద్ద నగరాల నుంచి క్లయింట్లు ఉన్నారు. కాగా, ఉద్యోగులు వీరాకు తమ వివరాలను పంపుతారు. ఆ వివరాలను వీరా వివిధ కంపెనీలకు పంపుతుంది. వారు సమ్మతి తెలిపిన తర్వాత, అగ్రశ్రేణి నిపుణులకు పనిని అప్పగిస్తుంది. ఆ తర్వాత వారికి వీరా డబ్బుల చెల్లిస్తుంది.
పట్టపగలే దొంగల బీభత్సం- రూ.7లక్షలు లూటీ- సినీ ఫక్కీలో ఫ్యామిలీ కిడ్నాప్ - Robbery In Dehradun