ETV Bharat / bharat

బిడ్డ ప్రాణాల కోసం తల్లి సాహసం - ప్రమాదమని తెలిసినా తోడేలుతో పోరాటం - UP Woman Fight With Wolf - UP WOMAN FIGHT WITH WOLF

UP Woman Fight With Wolf : ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. తాజాగా ఓ తల్లి తన బిడ్డ ప్రాణాల కోసం తోడేళ్లతో వీరోచితంగా పోరాడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

UP Woman Fight With Man-Eater Wolf
UP Woman Fight With Man-Eater Wolf (ANI (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 7:48 AM IST

UP Woman Fight With Wolf : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లా వాసులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా తోడేలుతో పోరాడింది. కుమారుడి కోసం మృత్యువుకు ఎదురు నిలిచిన ఆ తల్లి ధైర్యసాహసాల ముందు తోడేలు తోక ముడవక తప్పలేదు.

ఇదీ జరిగింది
యూపీలోని హర్ది ప్రాంతంలో ఓ తల్లి తన ఐదేళ్ల బిడ్డ పరాస్‌ను పక్కన పెట్టుకుని నిద్రపోయింది. అయితే ఆదివారం తెల్లవారుజామున వింత శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది. కళ్లు తెరిచి చూసే సరికి తన కుమారుడి మెడ పట్టుకుని ఓ తోడేలు ఈడ్చుకెళుతోంది. దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, మంచంపై నుంచి దూకి తోడేలను పట్టుకుంది. ఏమాత్రం భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది. వెంటనే సహాయం కోసం పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు చిన్నారిని వదిలి పెట్టేసి, అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి బిడ్డను రక్షించుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు.

ఐదేళ్ల బాలికపై తోడేళ్ల దాడి
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ఐదేళ్ల చిన్నారిపై తోడేళ్లు మరోసారి దాడి చేశాయి. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు, తల్లిందుడ్రులు ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఈ తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది మరణించారు. మరోవైపు 'ఆపరేషన్‌ భేడియా'లో భాగంగా యూపీ సర్కార్ విన్నూత ప్రయత్నం చేపట్టింది. తోడేళ్లను పట్టుకునేందుకు పిల్లల (చిన్నారుల) మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు. ఈ బొమ్మలను వ్యూహాత్మకంగా నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు. మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ప్రయత్నాన్ని చేపట్టారు.

8 మందిని చంపిన తోడేళ్ల కోసం వేట- ఎట్టకేలకు 'ఆపరేషన్‌ భేడియా'లో పురోగతి! - Wolf Attack In Uttar Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.