Ayodhya Deepotsav 2024 : బాలరాముడు కొలువుదీరిన ఆయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, ఈసారి కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు 25 లక్షలకుపైగా దీపాలు వెలిగించారు. దీనితో అయోధ్యా నగరం ధగధగా మెరిసిపోయింది. 55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన ఈ ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్ ప్రతినిధులు లెక్కించారు.
#WATCH | Uttar Pradesh: Saryu ghat illuminated with lakhs of diyas in Ayodhya as part of grand #Deepotsav celebration here.#Diwali2024 pic.twitter.com/DkbWnPmPzR
— ANI (@ANI) October 30, 2024
గిన్నిస్ రికార్డ్
అయోధ్య దిపోత్సవంలో భాగంగా, యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులు ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందు ఉన్న అన్ని గిన్నిస్ రికార్డ్లను బ్రేక్ చేసింది. అదే విధంగా యూపీ టూరిజం డిపార్ట్మెంట్, సరయు హారతి సమితి ఆధ్వర్యంలో ఏకకాలంలో 1,121 మంది దేవునికి హారతి ఇస్తూ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ విధంగా ఆయోధ్య దీపోత్సవం ఏక కాలంలో రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించింది.
#WATCH | Ayodhya, Uttar Pradesh: 2 new Guinness World Records created during the #Deepotsav celebrations in Ayodhya
— ANI (@ANI) October 30, 2024
Guinness World Record created for the most people performing 'diya' rotation simultaneously and the largest display of oil lamps with 25,12,585 achieved by… pic.twitter.com/ppvlbt17L1
అలరించిన లేజర్ షో
అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయోధ్య దీపోత్సవానికి ముందు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారులు కొలువుదీరిన రథాన్ని లాగారు. వేడుకల సందర్భంగా సుమారు 10వేల మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహించారు.
వేడుకల సందర్భంగా ప్రదర్శించిన లేజర్, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేజర్ షో ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేసియా, భారతీయ కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి.
#WATCH | Uttar Pradesh: Laser and light show underway at Saryu Ghat in Ayodhya. With the Ghat lit up with diyas and colourful lights, Ram Leela is being narrated through a sound-light show.
— ANI (@ANI) October 30, 2024
#Diwali2024 #Deepotsav pic.twitter.com/EzHgWWzTdl
దీపోత్సవం స్పెషల్
- 25 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు, దాదాపు 28 లక్షల ప్రమిదలను ముందస్తుగానే ఆర్డర్ చేశారు.
- రామమందిరంతోపాటు పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించారు.
- దీపోత్సవ కార్యక్రమంలో 30,000 వాలంటీర్లు పాల్గొన్నారు
- ఓ ఘాట్ వద్ద 80,000 దీపాలతో స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించారు.
- పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఆవు నెయ్యితో లక్షన్నర దీపాలను వెలిగించారు.
- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేసి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
- మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేసియా, కంబోడియా, ఇండోనేసియాకు చెందిన కళాకారులతో వేదిక వద్ద ప్రదర్శన నిర్వహించారు.
- ఘాట్‌ల వద్ద దాదాపు ఐదారు వేల మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేశారు.
- లైవ్ కవరేజీ కోసం పెద్ద తెరలు ఏర్పాటు చేశారు
- నగరం మొత్తం దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath, Union Minister Gajendra Singh Shekhawat, Deputy CM Brajesh Pathak at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya
— ANI (@ANI) October 30, 2024
#Deepavali2024 pic.twitter.com/UbZyzoFV3t
#WATCH | Uttar Pradesh: A large number of people are present along the banks of the Sarayu River in Ayodhya to witness the grand #Deepotsav celebration here.
— ANI (@ANI) October 30, 2024
25 lakh diyas will be lit to illuminate ghats along the banks of the Saryu River during 'Deepotsav' in Ayodhya today.… pic.twitter.com/gdsPT82YoG