ETV Bharat / bharat

ఊరి కోసం మూడేళ్లుగా 'ఒంటి కాలి' దీక్ష! వినూత్న రీతిలో బచ్చా బాబా నిరసన - SAINT HATHA YOGA

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 2:33 PM IST

Unique Protest Of Saint Standing On One Leg : తన గ్రామంలోని సమస్యలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఓ వ్యక్తి. మూడేళ్లుగా ఒంటికాలిపై నిలబడి తమ ఇబ్బందులను పాలకులకు తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన ఆపనని తేల్చి చెప్పాడు.

Unique Protest Of Saint Standing On One Leg
Unique Protest Of Saint Standing On One Leg (ETV Bharat)

Unique Protest Of Saint Standing On One Leg : ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించే మనం దేశంలో, ప్రజలు వారి సమస్యలు తీర్చమని నిరసనలు చేయడం కొత్తేమీ కాదు. చాలా మంది ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలతో తమ డిమాండ్​లను పాలకుల ముందు ఉంచుతారు. కానీ ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ప్రాంతంలోని దయనీయ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వినూత్న రీతిలో తెలియజేస్తున్నాడు. మూడేళ్లుగా ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలుపుతున్నాడు.

ఫిరోజాబాద్​ జిల్లా తుండ్లా మండలం గ్వరాయి గ్రామానికి చెందిన బాబా మహేశానంద్ గిరి అలియాస్​ బచ్చా బాబా, స్థానిక దేవాలయంలో ప్రధాన పూజారిగా పని చేస్తున్నాడు. తుండ్లా మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి సరైన రోడ్డు వసతి లేదు. విద్యుత్​ కోతలు తదితర సమస్యలతో గ్వరాయి గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తన ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసిన మహేశానంద్, సమస్యలకు పరిష్కారం చూపాలనుకున్నాడు. ఎలాగైనా వారి కష్టాలను పాలకులకు తెలియజేయాలనుకున్నాడు. అప్పటినుంచి ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. రోజంతా ఒంటికాలిపైనే నిలబడతాడు. నిద్రపోవడానికి కూడా కాలు కింద పెట్టడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇలా నిరసన తెలుపుతున్నాడు.

Unique Protest Of Saint Standing On One Leg
ఒంటికాలిపై నిలబడి నిరసన తెలుపుతున్న మహేశానంద్ గిరి బాబా (ETV Bharat)

"ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఇలా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలుపుతున్నాను. నేను ఒంటికాలిపైనే నిలబడతా, అంతేకానీ ఎప్పుడూ రెండు కాళ్లపై నిటారుగా నిలబడను. మా చుట్టు పక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మా గ్రామంలో ఎందుకు జరగడం లేదు? మా ఊరిలో వీధి దీపాలు లేవు. రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయి." అని మహేశానంద్ వాపోయాడు.

మహేశానంద్ గిరి చేస్తున్న వినూత్న నిరసన స్థానికులను ఆకర్షించింది. దీంతో అందరూ అతడిని 'హఠయోగి బాబా' పిలుస్తున్నారు. అయితే, ఎన్నికలకు ముందు పలువురు నాయకులు తమ గ్రామానికి వచ్చి, ఆలయాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు పనులు ముందుకు సాగలేదని తెలిపాడు. అలాంటి నాయకుల్లో ఎమ్​ఎల్​ఏ ప్రేమ్​పాల్​ ధన్​గర్​ ఒకరని చెప్పాడు. తమ గ్రామంలో సమస్యలు తీర్చాలని, తన ఆలయంలో కూడా పునురుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్​ చేశాడు. తన డిమాండ్​లు​ నెరవేర్చే వరకు నిరసన ఆపనని లేల్చి చెప్పాడు మహేశానంద్ గిరి బాబా.

రోడ్డు వేస్తేనే ఓట్లేస్తాం - గుర్రాలపై గిరిజనుల వినూత్న నిరసన - First Roads Then Votes

మెడికో హత్యాచారం ఘటనపై భారీ ర్యాలీ- ఏకతాటిపైకి చిరకాల ప్రత్యర్థులు- రంగంలోకి పోలీసులు! - Kolkata Doctor Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.